జగన్‌కు దమ్ముంటే కాపు నేతల్లో ఒకరిని సీఎం అభ్యర్థిగా ప్రకటించాలి : కిరణ్ రాయల్

Publish Date:Jun 23, 2026

Advertisement

 

వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డికి నిజంగా దమ్ముంటే ఇటీవల సమావేశమైన ఐదుగురు కాపు నేతల్లో ఒకరిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని జనసేన పార్టీ తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్ సవాల్ విసిరారు. అలా ప్రకటిస్తే తాను స్వయంగా వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తానని పేర్కొన్నారు.

రాష్ట్ర రాజకీయాలు కులాల చుట్టూ తిరగడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం 25 నుంచి 27 శాతం వరకు ఓటు బ్యాంక్ కలిగి ఉందని, ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా కాపుల మద్దతు కీలకమని అన్నారు.

కాపు సామాజిక వర్గం మద్దతుతోనే కూటమి ప్రభుత్వం 164 సీట్ల భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిందని తెలిపారు. అయితే, కాపు వర్గాన్ని వైసీపీ రాజకీయ ప్రయోజనాల కోసం పావులుగా ఉపయోగించుకుంటోందని ఆరోపించారు.

రాష్ట్రంలో జరిగే ప్రతి ఘటనకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను బాధ్యుడిగా చూపించడం సరికాదని కిరణ్ రాయల్ అన్నారు. పేర్ని నాని, అంబటి రాంబాబు, కన్నబాబు, అమర్‌నాథ్, బొత్స సత్యనారాయణ సమావేశం వెనుక జనసేన, కూటమిని బలహీనపరిచే రాజకీయ ఉద్దేశాలే ఉన్నాయని ఆరోపించారు.

జగన్ నిజంగా కాపు సామాజిక వర్గానికి న్యాయం చేయాలనుకుంటే ఆ ఐదుగురు నేతల్లో ఒకరిని సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని, లేదా ఐదుగురికి ఒక్కో ఏడాది చొప్పున ముఖ్యమంత్రి పదవిని పంచాలని సూచించారు. సీఎం అభ్యర్థిగా ఎవరిని ప్రకటించినా వారికి ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తానని అన్నారు.

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వంగవీటి రాధాను రాజకీయంగా నయవంచన చేసి గ్రూపు రాజకీయాలకు తెరతీశారని, అదే విధానాన్ని జగన్ కొనసాగిస్తూ కాపు సామాజిక వర్గాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి తీరుపై కూడా కిరణ్ రాయల్ తీవ్ర విమర్శలు చేశారు. రూ.300 చొప్పున చెల్లించి పెయిడ్ ఆర్టిస్టులతో నిరసనలు చేయించడం భూమనకు అలవాటైందని ఆరోపించారు. తిరుపతిలో భూమన కుటుంబం అనేక శాఖలకు మంత్రుల్లా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు.

అభినయ్ రెడ్డి అనుచరుడిగా చెప్పబడుతున్న చైతన్య యాదవ్ అరాచక శక్తిగా మారాడని, వడ్డీ వ్యాపారాలు నిర్వహించాడని ఆరోపించారు. కాపులంటే భూమనకు భయం ఉందని, చిన్న అంశాన్నైనా పెద్దదిగా చూపిస్తూ పెయిడ్ ఆర్టిస్టులతో రాజకీయ డ్రామాలు నిర్వహిస్తున్నారని విమర్శించారు.

ఓట్లు రాకపోవడంతో కాపు సామాజిక వర్గాన్ని రాజకీయంగా దెబ్బతీయాలనే కుట్ర జరుగుతోందని, దీనికి భూమన కరుణాకర్ రెడ్డి నాయకత్వం వహిస్తున్నారని కిరణ్ రాయల్ ఆరోపించారు.
 

By
en-us Political News

  
ఈ నెల 25న పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి..
దేశ రాజధాని న్యూఢిల్లీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ మరోసారి సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించింది.
హైదరాబాద్‌లో మరోసారి ఖాకీపై అవినీతి మచ్చ పడింది.
తమిళనాడు అసెంబ్లీ వేదికగా అధికార తమిళగ వెట్రి కజగం (TVK) మరియు ప్రధాన ప్రతిపక్ష డీఎంకే (DMK) నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది.
న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రెండో విడత పద్మ పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.
బీహార్‌లోని భోజ్‌పూర్ జిల్లాకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ భరత్ భూషణ్ తివారీ (28) పోలీస్ ఎన్‌కౌంటర్‌లో గాయపడి మరణించడం
హైదరాబాద్ మెట్రో రైలు అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలిసి రాజకీయ డ్రామాలకు తెరలేపారని
సైబరాబాద్ పరిధిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో రెండు ప్రముఖ రెస్టారెంట్లలో ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన సాయి కృష్ణ అదృశ్యం ఉదంతంలో ఎట్టకేలకు ఒక కీలకమైన పురోగతి లభించింది.
స్వర్ణగిరిగా... ఇక జొన్నగిరి..గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు..
ఏటీఎంలో నగదు నింపే వ్యాన్ డ్రైవర్ నగదుతో పరార్...
దుల నుండి ఇసుకను విచ్చలవిడిగా తోడేయడం వల్ల భూగర్భ జల మట్టాలు దారుణంగా పడిపోతున్నాయని డాక్టర్ రాజగోపాల్ ఆందోళన వ్యక్తం చేశారు. నదుల్లో ఇసుక పొరలు నీటిని నిల్వ ఉంచే స్పాంజ్‌లా పనిచేస్తాయని, వాటిని పూర్తిగా తొలగిస్తే వర్షపు నీరు భూమిలోకి ఇంకకుండా వేగంగా సముద్రంలోకి కొట్టుకుపోతుందని హెచ్చరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.