జైసపా దుఖాణ్ బంద్

Publish Date:Jul 2, 2014

Advertisement

 

సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక వెలుగు వెలిగి, రాష్ట్ర రాజకీయాలలో చక్రం తిప్పి, ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన అధిష్టానాన్ని ముప్ప తిప్పలు పెట్టిన కిరణ్ కుమార్ రెడ్డి, ఇప్పుడు ప్రజలకు మొహం చూపించలేని దుస్థితిలో ఉన్నారు. ఆది నుండి అందరితో కయ్యమే తప్ప నెయ్యం ఎరుగని ఆయనను నేడు పలుకరించేవారే లేరు. రాష్ట్ర విభజన అంశం మొదలుకొని కాంగ్రెస్ ను వీడి జైసపా స్థాపన, నామినేషన్ వేయకపోవడం వరకు వరుసగా అన్ని తప్పులే చేసుకొంటూ ముందుకు సాగిన ఆయన చివరికి పార్టీ పెట్టిన మూడు నాలుగు నెలలోనే మూసేసుకోవలసి వచ్చింది.

 

ఎటువంటి రాజకీయానుభవము లేని అరవింద్ కేజ్రీవాల్ కూడా ఆమాద్మీ పార్టీని పెట్టి ఏడాది పాటు దిగ్విజయంగా నడిపించి జాతీయ పార్టీలయినా కాంగ్రెస్, బీజేపీలకు ముచ్చెమటలు పట్టించి డిల్లీ ముఖ్యమంత్రి పీఠం అధిష్టించగలిగారు. ఎటువంటి రాజకీయ అనుభవము లేని చిరంజీవి కూడా ప్రజారాజ్యం పార్టీని దాదాపు ఏడాదిపైనే నడిపించి కాంగ్రెస్ సముద్రంలో విలీనం చేసి కేంద్రమంత్రి పదవి కూడా పుచ్చుకొన్నారు. ఎటువంటి రాజకీయానుభవం లేని జగన్ మోహన్ రెడ్డి అవినీతి కేసులు ఎదుర్కొంటూ జైల్లో ఉంటూనే పార్టీని నడిపించడమే,అనేక ఓడిడుకులను ఎదుర్కొంటూనే గత  ఐదేళ్ళుగా పార్టీని ఏకత్రాటిపై నిలబెట్టగలిగారు. ఎన్నికలలో పోటీ చేసి ఏకంగా అరవై ఏడు యం.యల్యే., తొమ్మిది యంపీ సీట్లు కూడా గెలుచుకోగలిగారు. ఎటువంటి రాజకీయ అనుభవము లేని పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించినప్పటికీ, పరిస్థితులను చూసి తెదేపా-బీజేపీలకు మద్దతు తెలిపి మంచి పేరు సంపాదించుకోగలిగారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులతో ‘శభాష్’ అనిపించుకొని వారితో సత్సబందాలు పెంపొందించుకోగలిగారు.

 

కానీ కిరణ్ కుమార్ రెడ్డికి సుదీర్గ రాజకీయానుభవం, ముఖ్యమంత్రిగా రాష్ట్ర రాజకీయలపై మంచిపట్టు, చివరి నిమిషం వరకు చేతిలో అధికారం అన్నీ ఉండి కూడా అల్లుడి నోట్లో శని అన్నట్లు పార్టీ పెట్టి ఒక్క సీటు కూడా గెలుచుకోలేక, పార్టీని నడిపించలేక పరువు తీసుకొన్నారు. రెండు రోజుల క్రితం మాదాపూర్ లో జైసపా కార్యాలయం కోసం అద్దెకు తీసుకొన్న భవనం కూడా ఖాళీ చేసేసారు. ఇప్పుడు ఆయన బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే నిజమయితే ఆయన రాజకీయ జీవితంలో మరొక తప్పుకు సిద్దమవుతున్నారనుకోవలసిందే. ఒక అనుభవజ్ఞుడయిన రాజకీయనాయకుడు ఇంత తక్కువ సమయంలో వరుస పెట్టి ఇన్ని తప్పులు చేయడం సాధ్యమేనా? అంటే 'అవునుసాధ్యమే'నని కిరణ్ కుమార్ రెడ్డి నిరూపించి చూపారు.  

By
en-us Political News

  
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలు రాష్ట్రాల అధ్యక్షులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇరు రాష్ట్రాల ఇన్‌చార్జ్ కార్యదర్శులు హాజరయ్యారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడాని ముందు ఉన్న గడువులో అన్ని రాష్ట్రాలలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. సుమారు 125 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో 40 నుండి 60 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీ షోర్ హైవే ప్రాజెక్టుతో పాటు, రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హై-స్పీడ్ రైల్ కారిడార్లు రాష్ట్ర ప్రగతికి కొత్త వేగాన్ని తీసుకువచ్చాయి. తీర ప్రాంత అభివృద్ధిని, రాజధాని రవాణా సౌకర్యాలను ఏకకాలంలో మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి.
పొంగులేటి ప్ర‌స్తుతం మంత్రిగా నిర్వహిస్తున్న మైనింగ్ శాఖ‌, గ‌తంలో కేటీఆర్ నిర్వ‌హించ‌గా.. ఆ స‌మ‌యంలో ఎన్ని అక్ర‌మాలు జ‌రిగాయో.. ఎన్నేసి అరాచ‌కాలు న‌డిచాయో.. గ‌త అసెంబ్లీ స‌మావేశాల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చ‌దివి వినిపించిన సంగ‌తి తెలిసిందే. వీటిపై సీబీసీఐడీ ఎంక్వ‌యిరీ కూడా వేస్తామ‌ని సీఎం ప్ర‌క‌టించిన సంగ‌తీ విదిత‌మే. ఈ అక్ర‌మాల్లో త‌న సోద‌రుడి ప్ర‌మేయం కూడా ఉండ‌టంతో.. ఉలిక్కి ప‌డ్డ హ‌రీష్ రావు, ఈ శాఖామాత్యుడైన‌ పొంగులేటిని త‌న టార్గెట్ గా ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం.
ది ఉద్యోగాల కోసం వంద‌లాది మంది ఫీజులు క‌ట్టి మ‌రీ రాస్తుంటే ఆ వ‌చ్చే ప‌ది ఉద్యోగాలు పొందిన వారినుంచి ఫీజు వ‌సూళ్ల‌ వ‌ర‌కూ ఓకే.. మిగిలిన అంద‌రి ఫీజులు వాప‌స్ ఎందుకివ్వ‌ర‌ని ప్రశ్నించారు. అంతే కాదు సామాన్యుడి త‌రఫున కూడా విలక్షణ శైలిలో తన గళమెత్తుతున్నారు. టికెట్ కొని కూడా రైల్లో ఒక సాధార‌ణ ప్ర‌యాణికుడు నిల‌బ‌డి ప్ర‌యాణించాల్సి పరిస్థితి ఏంటి? వంటి ప్ర‌శ్న‌లతో రాఘవ్ చద్దా సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అయ్యారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.