ఈ లక్షణాలు ఉంటే మీ కిడ్నీ డేంజర్ లో ఉనట్టే!

Publish Date:Jan 31, 2023

Advertisement

మీ కిడ్నీ సరిగా పనిచేయనప్పుడు సరైన తోక్సిన్స్ పెరుగు తాయి. అది మీ రోజువారి జీవితం పై తీవ్ర ప్రభావం చూపుతుంది.అది మీకు ఆస్చార్యాన్ని కలిగించ వచ్చు. కిడ్నీలో సమస్యల లో వచ్చాయిఅనడానికి ఈ పదిలక్షణాలు గమనించండి.

1)మీరు తరచుగా అలిసిపోవడం...

మీ శరీరంలో కిడ్నీ ద్వారా రక్తం శుద్ధి చేసున తరువాత వచ్చే వేస్టేజ్ ను బయటికి పంపుతుంది. మీకిడ్నీ సరిగా పనిచేయనట్లయితే టాక్సిన్స్ పెరుగుతాయి.దీనికి సంకేతంగా త్వరగా అలిసిపోవడం అలసట వారం రోజులకు పైగా ఉండవచ్చు. కిడ్నీలు మీ శరీరంలో హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. అలాగే శరీరంలో 
ఎర్ర,తెల్ల రక్తకణాలు ఉత్పత్తి చేస్తాయి. మీ కిడ్నీలో సమస్య ఉంటె రక్తం ద్వారా  మెదడుకు కండరాలకు అవసరమైన ఆక్సిజన్ అందక పోవచ్చు.

2 )నిద్రలేమి!

మీ నిద్రలేమికి కిడ్నీ వ్యాధికి సంబంధం ఉండచ్చు. అది మీశారీరంలోని ఇతర అవయవాలను నాశనం చేస్తుంది. తద్వారా కిడ్నీ ఫెయిల్యూర్ కు దారితీయవచ్చు. మీ శరీరానికి సరిపడా నిద్ర లేకుంటే కిడ్నీ సమస్యలు ఉన్నట్లే. కిడ్నీ లో సమస్యకారణం గానే ఆక్సిజన్ సరఫరా లోపిస్తుంది.ఒక్కోసారి కిడ్నీ సమస్య వల్ల గొంతులో నాళాలు కుంచించుకు పోతాయి. టాక్సిన్స్ పెరిగి అనేకసమస్యలకు దారితీస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

౩ ) చర్మం పై దురద!

మీ శరీరం లోని టాక్సిన్స్ కిడ్నీ ద్వారా బయటకు రాకుంటే రక్తంలో టాక్సిన్స్ పెరిగినట్లే. ఈ కారణం గా దద్దుర్లు రావడం దురదకు దారితీస్తుంది.మీకిద్నీ కొంత కాలానికి మినరల్స్ ను న్యుట్రీషియన్స్ సమతుల్యం గా ఉంచలేదు. మినరల్స్ సరిగా అందకుంటే ఎముకలకు సంబందించిన సమస్యలు వచ్చి మీ చర్మం ఎండిపొయినట్లు గా దురదగా ఏర్పడుతుంది.

4 )ముఖం -కాళ్ళు వాయడం!

మీకిడ్నీకి అవసరమైన సోడియం అందకుంటే శరీరంలో ఫ్లూయిడ్స్ ఏర్పడి చేతులు కాళ్ళు,పాదాలు లేదా ముఖం వాచినట్లుగా ఉంటుంది. ప్రత్యేకంగా కాళ్ళ లో,కాలిమడమల లో వచ్చేవాపులు గమనిస్తే లేదా మూత్రంలో ప్రోటీన్ కోల్పోతారు కాళ్ళు వాచినట్లు కనిపిస్తుంది.

5 )కండరాలు పట్టేయడం!

కాలినరాలు పట్టేయడం అంటే మీ కిడ్నీ పనితీరు సరిగాలేదని అర్ధం. సోడియం,కాల్షియం,పొటాషియం, సమానంగా లేకపోవడం ఎలక్ట్రోలైట్స్ పరీక్షలు కొంతమేరకు ఇబ్బంది కలిగిస్తాయి. దీని ఆధారంగానే నాడీ వ్యవస్థ కండరాల వ్యవస్థ పనిచేస్తాయి. సమస్య తలెత్తితే కిడ్నీ ఎలాఉంది అన్నది మొదటి ప్రశ్న.

6 )ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది!

మీరు కిడ్నీ సమస్యతో బాధపడుతున్నప్పుడు ఎరిత్రో ప్రోటీన్ హార్మోన్ ను ఉత్పత్తి చేయదు. హార్మోన్ సిగ్నల్ వల్లే ఎర్రరక్త కణాలు తయారు అవుతాయి. అలా జరగ నట్లయితే పూర్తిగా రక్త హీనత ఏర్పడుతుంది. అప్పుడే మీకు ఊపిరి అందడం కష్టంగా ఉంటుంది. అది ఒక్కో సారి తీవ్రసమస్యాగా మారితే కళ్ళు తిరగడం లేదా ఇతర అనారోగ్య సమస్యలకు దారితీయవచ్చు.

7)మెదడు మొద్దుబారినట్లుగాఉండడం!

తల పై ఎదో కమ్మినట్లు మబ్బుగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. శరీరంలో మీ కిడ్నీ సరిగా ఫిల్టర్ చేయనట్లయితే టాక్సిన్స్ మీ మెదడుపై ప్రభావం చూపుతాయి.ఒక్కొసారి మెదడు చీకట్లు కమ్ముకుంటాయి. దీనుకి కారణం శరీరానికి ఆక్సిజన్ అందాకపోవడం. అప్పుడే కళ్ళు తిరిగినట్లు ఏకాగ్రత కోల్పోవడం జ్ఞాపక శక్తి చిన్న చిన్న సమస్యలు సైతం కష్టంగా కనిపిస్తాయి.

8)ఏపటై టిస్ తగ్గడం!

కిడ్ని సమస్య ఉంటె మీఅహారం అరగక పోవడం. శరీరం అసహనంగా ఉండడం. దీర్ఘంగా అలసట గాఉండడం. ఈ కారణంగానే వాంతి వచ్చినట్లుగా ఉండడం. లేదా పొట్టలో సమస్యలు అరగక పోవడం లేదా విరేచనాలు. ఆకలి మండగిబ్చడం లేదా ఆహారం తీసుకోవాలని అనిపించక పోవడం వంటిలక్షణాలు ఉంటె త్వరగా మీరు బరువు కోల్పోతారు.

9)నోటి దుర్వాసన!

మీకిడ్నీ లో సమస్య వచ్చి ఫిల్టర్ జరగకుంటే శరీరంలోని వేస్టేజ్ బయటికి పోవడం వల్ల యురీమియా సమస్య వస్తుంది. ఈ కారణంగా నే మీ శ్వాస ఊపిరిలో దుర్వాసన వస్తుంది.శరీర రక్త కణాలలో టాక్సిన్ చేరి మెటాలిక్ గా మారి రుచిని కోల్పోతారు.

1౦)మూత్రం లో నురగా లేదా రక్తం పడడం లేదా రక్త స్రావం.లేదా మీ మూత్రం బ్రౌన్ రంగులోకి మారడం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. మీశరీరంలో అధికంగా ప్రోటీన్ చేరినా దీనిని ఆల్బుమిన్ ఉంటె అది కిడ్నీ సమస్యకు దారితీయవచ్చు. మూత్రం తెల్లగా లేదా బ్రౌన్ రంగులో కి మారడం ంటే కిడ్నీ లో లోపం ఉన్నట్లే అంటే కిడ్నీ సమస్య ఉన్నట్లే అని నిపుణులు భావిస్తున్నారు. మూత్ర నాళం ద్వారా రక్త శ్రావం కిడ్నీలో రాళ్ళు, ఇతర ట్యూమర్లు, ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పైన పేర్కొన్న లక్షణాలు గమనించిన వెంటనే మీరు దగ్గరలోని డాక్టర్ ను సంప్రదించడం అవసరం తద్వారా కిడ్నీ మార్పిడికి పోకుండా కిడ్నీ లో వచ్చే తీవ్ర సమస్యను ముందుగానే గమనించి విలువైన ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు. లేదా కిడ్నీని రక్షించుకోవచ్చు.
                     

By
en-us Political News

  
శరీరంలో వేడి, పాదాల్లో మంట, కళ్లలో మంట, నోటి పూత, గ్యాస్, అసిడిటీ ఎందుకు వస్తాయి? పిత్త దోషం లక్షణాలు, కారణాలు, ఆహారం, ఆయుర్వేద చిట్కాలను డా. చి. మధుసూదన్ శర్మ ఈ వీడియోలో వివరించారు.
పురుషుల ఆరోగ్యం విషయంలో చాలామంది నిర్లక్ష్యం చేసే సమస్యల్లో క్యాన్సర్ ఒకటి. ప్రారంభ దశలోనే గుర్తిస్తే చాలా రకాల క్యాన్సర్లను విజయవంతంగా చికిత్స చేయవచ్చు...
భారతదేశంలో టీ కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, అది ఒక అలవాటుగా , రోజును మొదలుపెట్టడానికి మంచి ఎనర్జీ డ్రింక్ గా కూడా భావిస్తారు. ఉదయం లేవగానే టీ తాగడం, పనిలో బ్రేక్  సమయంలో టీ తాగడం..
మనం తినే ఆహారాన్ని ఎంత ఎక్కువగా ఉడికిస్తే అంత మంచిదని చాలామంది భావిస్తుంటారు. కానీ అధికంగా ఉడికించడం వల్ల కొన్ని పోషకాలు తగ్గిపోయే అవకాశం ఉంటుందని ప్రముఖ సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్,
పెళ్లయ్యాక ప్రతి భార్యాభర్త పిల్లలను కనడంపై శ్రద్ద పెడతారు. పిల్లలను కనడం,  అమ్మ నాన్న అనిపించుకోవడం జీవితంలో ఒక మధురమైన అనుభూతిగా భావిస్తారు. అయితే నేటికాలంలో ఆడవారు మాత్రమే కాకుండా...
నేటి కాలంలో ప్రపంచవ్యాప్తంగా గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అందువల్ల, వైద్యులు క్రమం తప్పకుండా వ్యాయామం చేయమని చెబుతుంటారు.   గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి  చాలామంది..
ప్రోటీన్ శరీరానికి అవసరమైన పదార్థం. శరీరంలో కండరాల నిర్మాణానికి, శక్తికి,కణాల అభివృద్దికి, ఎముకల నిర్మాణానికి ఇలా చాలా విషయాలకు ప్రోటీన్ అవసరం అవుతుంది. శరీరానికి ప్రోటీన్ కోసం చాలా మంది గుడ్లు, పాలు, పాల పదార్థాలు అయిన పనీర్ వంటివి తీసుకుంటారు...
ఏదైనా కొనడానికి వెళ్ళాలని అనుకుంటాం. కానీ తీరా అక్కడికి వెళ్లాకా ఏం తీసుకోవాలని వచ్చామో అదే మర్చిపోతుంటాం. ఇది చాలా మందికి జరుగుతూ ఉంటుంది.  కానీ ఎవరూ దీని గురించి పెద్దగా పట్టించుకోరు....
మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన ఖనిజాల్లో మెగ్నీషియం (Magnesium) ఒకటి. ఇది కండరాల పనితీరు, నరాల వ్యవస్థ, గుండె ఆరోగ్యం..
మంచి ఆరోగ్యానికి ఆరోగ్యకరమైన ఆహారం చాలా అవసరం.  తరచుగా ఏమి తినాలి అనే దానిపై చాలా మంది దృష్టి పెడతారు.  నిజానికి ఆరోగ్యం కోసం ఏం తినాలో అనే కాదు..  ఎప్పుడు తినాలనే విషయం  కూడా అంతే ముఖ్యమని..
డయాబెటిస్ ఉన్నవారిలో సైలెంట్ హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఎంత? నార్మల్ షుగర్ లెవల్స్, HbA1c విలువలు, ప్రీ-డయాబెటిస్, డయాబెటిస్ కంప్లికేషన్స్ గురించి డా. హరిచరణ్ వివరించిన పూర్తి సమాచారం...
ఈ రోజుల్లో, ఫిట్‌గా , ఆరోగ్యంగా ఉండటానికి చాలా మంది జిమ్‌కు వెళ్తున్నారు.  శరీరాకృతి మెరుగ్గా కనిపించాలని,  ఫిట్‌నెస్ కోసం చేసే ఈ ప్రయత్నంలో, చాలా మందికి తెలియకుండానే కొన్ని తప్పులు జరుగుతాయి...
అధిక బరువు, బెల్లీ ఫ్యాట్ సమస్యలను సహజంగా తగ్గించుకోవాలనుకుంటున్నారా? ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణుడు డా. చిట్టిబొట్ల మధుసూదన శర్మ సూచించిన ఆయుర్వేద చిట్కాలు, జీవనశైలి మార్పులు, ఆహార నియమాలు ఈ వీడియోలో తెలుసుకోండి. ఆయుర్వేద ద్రవ్యాల ప్రయోజనాలు, శరీరంలో కొవ్వు తగ్గించే మార్గాలు, ఆరోగ్యకరమైన బరువు నియంత్రణపై ఉపయోగకరమైన సమాచారం అందించబడింది. ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునేవారికి ఈ వీడియో ఎంతో ఉపయోగపడుతుంది...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.