ఖైరతాబాద్ బరిలో కల్వకుంట్ల కవిత: కాంగ్రెస్, బీఆర్ఎస్ కు చెమటలు తథ్యం.!
Publish Date:Sep 25, 2026
Advertisement
తెలంగాణ రాజకీయ రంగంలో ప్రస్తుతం ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఈ నియోజకవర్గంలో రాబోయే ఉపఎన్నికలో కవిత బరిలోకి దిగనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి తెలంగాణ రక్షణ సేన పేర సొంత పార్టీ ఏర్పాటు చేసిన కల్వకుంట్ల కవిత.. ఏకకాలంలో ఇటు రేవంత్ సర్కార్ ను, అటు అధికారంలో ఉండగా బీఆర్ఎస్ వైఫల్యాలనూ ఎండగడుతున్నారు. దీంతో ఖైరతాబాద్ ఉపఎన్నిక బరిలో కల్వకుంట్ల కవిత దిగితే రాజకీయం రసకందాయంలో పడినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద దానం నాగేందర్ సభ్యత్వం రద్దు కావడంతో ఖైరతాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ఈ నియోజకవర్గంలో పాగా వేయడానికి వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. వ్యూహాలను సిద్ధం చేసుకునే పనిలో పడ్డాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రక్షణ సేన అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత రంగంలోకి దిగనున్నారన్న వార్త పొలిటికల్ గా సంచలనంగా మారింది. హైదరాబాద్ మహానగర పరిధిలో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగడం ద్వారా కల్వకుంట్ల కవిత రాజకీయాల్లో తన ప్రభావం చాటేందుకు రెడీ అయ్యారంటున్నారు. అంతే కాకుండా కేసీఆర్ కుమార్తె కవిత టీఆర్ఎస్ (తెలంగాణ రక్షణ సేన తరఫున ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిస్తే, ఈ ఉపఎన్నిక రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా ప్రాధాన్యత సంతరించుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. గత కొంతకాలంగా రాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న నాటకీయ పరిణామాలు, కుటుంబ రాజకీయాల నేపథ్యంలో కవిత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. కవిత రంగంలోకి దిగడం అంటూ జరిగితే ఖైరతాబాద్ ఉప ఎన్నిక రసవత్తరంగా మారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆమె అభ్యర్థిగా రంగంలో ఉంటే.. అధికార కాంగ్రెస్ కు, ప్రతిపక్ష బీఆర్ఎస్ కూ కూడా గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా, ఆయా పార్టీల విజయావకాశాలపై ప్రభావం పడటం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. [Khairatabad Bypoll, Kavitha Kalvakuntla, Contest, Danam Nagender disqualification, Telangana politics, Khairatabad assembly constituency, Telangana news, Telugu One]
http://www.teluguone.com/news/content/khairatabad-bypoll-39-232488.html





