నారా లోకేష్ రాక.!

Publish Date:Sep 22, 2026

Advertisement

యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు  పండుగ రోజు. దివంగత ఎన్టీఆర్, పరిటాల రవి విగ్రహావిష్కరణకు తొలిసారి నియోజకవర్గానికి ఆనందంగా ఉందని రాప్తాడు ఎమ్మెల్యే, మాజీమంత్రి పరిటాల సునీత అన్నారు. రాప్తాడు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమన్వయ సమావేశంలో సునీతమ్మ మాట్లాడుతూ... రాప్తాడు నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో చాలామందిని ఇబ్బంది పెట్టారు. కనీసం పెళ్లిళ్లకు కూడా వెళ్లకుండా అడ్డుకున్నారు. కార్యకర్తలు బెదరకుండా ధైర్యంతో నిలబడ్డారు. ఎన్టీఆర్ పిలుపుమేరకు పరిటాల రవీంద్ర రాజకీయాల్లోకి వచ్చారు. నాడు అన్న ఎన్టీఆర్ వద్దన్నా మంత్రి పదవి ఇచ్చి ఆదరించారు. చంద్రబాబు పిలుపుమేరకు నేను రాజకీయాల్లోకి వచ్చాను.  ఆనాడు కార్యకర్తలే నా వెన్నంటి నడిపించారు. చంద్రబాబు మూడుసార్లు టిక్కెట్ ఇచ్చి, ఒకసారి మంత్రినిచేసి మా కుటుంబాన్ని ఆదరించారు. 

గత ప్రభుత్వంలో నాపై 22, శ్రీరామ్‌పై 34, కార్యకర్తలపై 20కి పైగా కేసులు పెట్టారు. ఆ కేసుల గురించి ఆలోచించాలని లోకేష్‌ను  కోరుతున్నా. రాప్తాడు నియోజకవర్గంలో అన్ని సామాజికవర్గాలు మాకు అండగా నిలబడ్డాయి. ప్రత్యర్థులు చేతిలో ప్రాణాలు కోల్పోయిన తగరకుంట ప్రభాకర్  ఆరుగురి బిడ్డలను చంద్రబాబు చదివించి ప్రయోజకులను చేశారు. పరిటాల రవితోపాటు చనిపోయిన వారి పిల్లలను చదివించారు. వాడుకుని పక్కనపడేసే పార్టీ కాదు తెలుగుదేశం. రాప్తాడు నియోజకవర్గంలో 11మందికి కార్యకర్తల సంక్షేమనిధి అందించారు. యువనేత లోకేష్ కార్యకర్తలకు ధైర్యాన్నిస్తూ యువగళం పాదయాత్ర చేసి స్పూర్తినిచ్చారు. 

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం వెనుక చంద్రబాబు, లోకేష్ రెక్కల కష్టం దాగిఉంది. అందువల్లే రాప్తాడులో దాదాపు 25వేలకు పైగా మెజారిటీ వచ్చింది. ఈ నియోజకవర్గంలో చిన్న సైకోను సాగనంపాలని ప్రజలు,కార్యకర్తలు నిర్ణయించుకొని, ఎన్నికల్లో నెరవేర్చుకున్నారు. రాప్తాడు నియోజకవర్గానికి సాగు, తాగునీరు అందించే రూ.800 కోట్ల అప్పర్ పెన్నార్ ప్రాజెక్టు అందించినందుకు కృతజ్జతలు. రైతులకు త్వరగా పరిహారం అందించాలని కోరుతున్నా. రాప్తాడు మండలంలో జూనియర్ కాలేజి మంజూరు చేయండి. రామగిరిలో హాస్టల్ భవనం, ఆత్మకూరులో కాలేజి మంజూరు చేయండి. విద్యాశాఖ మంత్రిగా లోకేష్ బాబు వచ్చాకే స్కూళ్లు బాగుపడ్డాయి. చదువుకునే ప్రతిబిడ్డకు తల్లికి వందనం అందిస్తున్నారు. మీ ఆదేశాల మేరకు కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి, పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని సునీత చెప్పారు. 

స్థానిక ఎన్నికల్లో ఏకపక్ష విజయం సాధించాలి..!

హిందూపురం ఎంపి బికె పార్థసారధి మాట్లాడుతూ... దివంగత ఎన్టీఆర్, పరిటాల రవీంద్ర విగ్రహావిష్కరణకు యువనేత లోకేష్ రాప్తాడు రావడం ఆనందంగా ఉంది. ఆనాడు పరిటాల రవీంద్ర  దివంగతులయ్యాక వచ్చిన ఎన్నికల్లో పార్టీ కేడర్ వెన్నుచూపకుండా 15వేల మెజారిటీతో పార్టీని గెలిపించారు. 2019లో అధికారం కోల్పోయాక బెదిరించారు. రామగిరి పోలీసు స్టేషన్ వద్ద ఆందోళన చేశాం. ఎక్కడా భయపడలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చిన్నచిన్న విభేదాలను పక్కనబెట్టి ఏకపక్షంగా కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలి. 2019-24లో అభివృద్ధి జరగలేదు. చంద్రబాబు గారు హంద్రీనీవాను 3వేలకోట్లతో విస్తరించి కుప్పం వరకు నీళ్లు తీసుకెళ్లారు. యువనేత లోకేష్ యువగళంలో ఇచ్చిన 20లక్షల ఉద్యోగాల హామీమేరకు పరిశ్రమలు పెద్దఎత్తున ఎపికి వస్తున్నాయి. స్థానిక ఎన్నికల్లో కష్టపడి పనిచేయాలి, పార్టీ బాగుంటేనే అందరం బాగుంటాం. మరో 20ఏళ్లు తెలుగుదేశం అధికారంలో ఉండాలని అన్నారు. 

స్థానిక ఎన్నికల్లో ఇదే ఉత్సాహాన్ని కొనసాగించండి :శ్రీరామ్

ధర్మవరం ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ... మీ అందరి సహకారంతో లోకల్ బాడీలో అద్భుత విజయాన్ని సాధించబోతున్నాం.  పార్టీ కార్యకర్తలంతా గ్రామాల్లోకి వెళ్లి ఇదే ఉత్సాహాన్ని కొనసాగించాలి. యువగళం రథసారధి లోకేష్‌కు ఘనస్వాగతం పలికిన పార్టీ కేడర్‌కు  అభినందనలు తెలిపారు.  పార్లమెంటు పార్టీ ప్రెసిడెంట్ ఎంఎస్ రాజు మాట్లాడుతూ... కార్యకర్తల సంక్షేమం ధ్యేయం మొట్టమొదటిసారిగా కార్యకర్తల సంక్షేమనిధిని ఏర్పాటుచేసిన నాయకుడు లోకేష్. గత చీకటి పాలనను ఎదురొడ్డి యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్రప్రజలకు అండగా నిలబడ్డారు. అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ దుర్మార్గాలకు చరమగీతం పాడారు. ఒకవైపు రాష్ట్రాభివృద్ధి, మరోవైపు కార్యకర్తల సంక్షేమం కోసం శ్రమిస్తున్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు ఆశయాలను కొనసాగిస్తున్న భవిష్యత్ నాయకుడు లోకేష్ అని కొనియాడారు. 

 

 

 

[ Nara Lokesh, Paritala Sunitha, Rapthadu, TDP, Telugu Desam Party, Chandrababu Naidu, Paritala Ravindra, Paritala Sriram, BK Parthasarathi, TDP Cadre, Rapthadu TDP, Local Body Elections, Youth Gala, Upper Pennar Project, Telugu One, Telugu News  ]
 

By
en-us Political News

  
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.