అనర్హత వేట్లు కాదు: ఎన్నికల వ్యవస్థలో మార్పు రావాలి.!

Publish Date:Sep 25, 2026

Advertisement

ప్రస్తుత రాజకీయాలలో పార్టీ ఫిరాయింపులు అన్నది రివాజుగా మారిపోయింది. ఉదయం  ఒక పార్టీ, సాయంత్రానికి మరో పార్టీ.. తెల్లారేసరికి మరో పరా్టీ అన్నట్లుగా రంగులు మార్చేయడం సర్వసాధారణమైపోయింది. ఇందులోంచే ఆయారం, గయారాం అన్న నానుడి పుట్టిందని చెప్పవచ్చు.  ఒక పార్టీ తరఫున చట్ట సభకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు, తమను ఎన్నుకున్న ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా, నైతికత గురించి ఇసుమంతైనా సంకోచించకుండా రాత్రికి రాత్రి మరో పార్టీలోకి జంప్ జిలానీ అన్నట్లుగా దూకేస్తున్నారు.  దీనివల్ల ప్రజాస్వామ్య వ్యవస్థలో   నైతికత, విలువలు పలుచన అయిపోతున్నాయి.   ఏ పార్టీ నుంచి గెలిచామనే అంశంతో సంబంధం లేకుండా, వ్యక్తిగత ప్రయోజనాలు, అధికార కాంక్ష,  రాజకీయ లబ్ధికి మాత్రమే పెద్ద పీట వేస్తున్న నేతలే ఎక్కువగా కనిపిస్తున్నారు

తాజాగా పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై పడిన అనర్హత వేటు.. మరో సారి రాజకీయాలలో పార్టీ ఫిరాయింపులు, నైతిక విలువలపై మరో సారి చర్చకు తెరలేపింది.  ఒక పార్టీ గుర్తుపై శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తూ, మరో పార్టీ తరఫున పోటీ చేయడంతో దానంపై అనర్హత వేటు పడింది. ఇది దేశ వ్యాప్తంగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడే నేతలకు హెచ్చరిక అనడంలో సందేహంలేదు. 

అయితే.. ఈ సందర్భంగా  కేవలం ఫిరాయింపులపైనే కాకుండా ఎన్నికల వ్యవస్థలోని గూడుకట్టుకుని పోయిన లోపాలు, లొసుగుల గురించి కూడా చర్చ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  ఎందుకంటే.. ప్రస్తుత ఎన్నికల తీరు ప్రజాస్వామ్య స్ఫూర్తికి భిన్నంగా ఉందన్న అభిప్రాయం ప్రజాస్వామ్య వాదులు వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నికలు  ఖరీదైన వ్యవహారంగా మారిపోయి.. సామాన్యుడికి భాగస్వామ్యం లేని తంతుగా తయారయ్యాయి. ఎన్నికలలో పోటీ చేయాలంటే..  ఎన్నివందల కోట్లు ఖర్చు పెట్టగలరు? అన్న ప్రశ్న ఎదుర్కోవలసి వస్తున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొని ఉంది.  ఎలాంటి ప్రలోభాలు లేకుండా నిష్పక్షపాతంగా ఓటు వేయాల్సిన ఓటర్లు సైతం డబ్బులు, వస్తువుల పంపిణీని ఆశించే స్థాయికి దిగజారేలా, కాదు కాదు దిగజార్చేలా ఎన్నికల తీరు మారిపోయింది.  నిజాయితీగా పేద ప్రజలకు సేవ చేయాలనే తపన ఉన్నవారు ఎన్నికల వ్యయాన్ని తట్టుకోలేక ఈ ప్రక్రియకు దూరం అవుతున్నారు. 

మరోవైపు..  సాంకేతికత ఎన్నికల ప్రచార శైలిని పూర్తిగా మార్చేసింది. కార్పొరేట్ సంస్థలు, పెద్ద వ్యాపారవేత్తలు, ప్రొఫెషనల్ వ్యూహకర్తలు  రాజకీయాలను శాసించే పరిస్థితి నెలకొంది. సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థులపై అసత్య ప్రచారాలు చేయడం, తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి చొప్పించడం మొత్తంగా వాతావరణాన్ని కలుషితం చేస్తోంది.  ఏఐ వంటి సాంకేతికతో నిజం, అబద్ధం మద్య గీత చెరిగిపోయినట్లైంది.   

నేరచరిత్ర కలిగిన అభ్యర్థులు చట్టసభల్లోకి ప్రవేశిస్తున్నారనే విషయాన్ని వివిధ స్వచ్ఛంద సంస్థలు ఎప్పకటికప్పుడు నివేదికల ద్వారా హెచ్చరిస్తూనే ఉన్నా.. వాకిరి నిరోధించే యంత్రాంగం నిర్వీర్యమైపోయింది.  ఎన్నికల సంఘం  ప్రేక్షక పాత్రకే పరిమితమైపోయిన పరిస్థితి నెలకొంది.  ఈ పరిస్థితి మారకుండా,  చట్టసభల్లో అనర్హత వేటుల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. ఎన్నికల వ్యవస్థలో సమూల ప్రక్షాళన జరగాల్సి ఉంది.  అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ఖర్చు  కట్టడి, ప్రలోభాలకు తెరదించడం లాంటి చర్యల ద్వారానే  ప్రజాస్వామ్య స్ఫూర్తి పరిఢవిల్లుతుంది. 


  [Defection, Danam Nagender Disqualification, Party Jump Leaders, AAyaram GayaRam, Election Expenses, Telugu One]

By
en-us Political News

  
గత కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఒకింత జోరు తగ్గించిన వంగవీటి రాధా.. ఉన్నట్టుండి జనసేనానిని తో భేటీ అవ్వడం, అదీ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల వేడి రగిలిన సమయంలో కలవడం వెనుక పక్కా వ్యూహం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సొంత మేనకోడలు నిశ్చితార్థానికి వైఎస్ జగన్ హాజరుకాకపోవడంపై రాజకీయవర్గాలలోనే కాదు.. సామాన్య జనంలో కూడా చర్చ జరుగుతోంది. గతంలో షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ నిశ్చితార్థానికి జగన్ దంపతులు హాజరైన సంగతిని పలువురు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు.
వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించిన కాషాయ పార్టీ..!
అక్టోబరా, నవంబరా, లేదా తరువాతా అన్న ఉత్కంఠకు తెరదించుతూ మంత్రి నారా లోకేష్ వచ్చే నెలలోనే అంటే అక్టోబర్ లోనే స్థానిక సమరం ఉంటుందన్న స్పష్టత ఇచ్చారు.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి  జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా  వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే..  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి  కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.