హైదరాబాద్ కేంద్రంగా రూ. 13వేల కోట్ల ఆన్‌లైన్ గేమింగ్ మోసం

Publish Date:Feb 19, 2026

Advertisement

దేశవ్యాప్తంగా విస్తరించిన ఆన్‌లైన్ గేమింగ్ అక్రమ సామ్రాజ్యంపై కేంద్ర జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగండీజీజీఐ  దాడులు నిర్వహించి భారీ మోసాన్ని బట్టబయలు చేశారు. దాదాపు 13 వేల కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు భావిస్తున్న  గేమింగ్ సిండికేట్ కేసులో కీలక మలుపుగా హైదరాబాద్‌లో  కీలక అరెస్టు జరిగింది.  డిజిటల్ కేవైసీ, ఫ్రాడ్ రిస్క్ మేనేజ్‌మెంట్ సేవలు అందిస్తున్న అడ్సమ్ అడ్వైజరీ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ పంకజ్ కుమార్ ను  అధికారులు అదుపులోకి తీసు కున్నారు.  దర్యాప్తులో సేకరించిన సాంకేతిక, ఆర్థిక ఆధారాలు ఈ మోసం వ్యవస్థాబద్ధంగా నడిచినట్లు తేటతెల్లం చేస్తున్నాయి. నకిలీ కేవైసీ పత్రాలతో వందలాది షెల్ సంస్థలను పేమెంట్ నెట్‌వర్క్‌ లలోకి చేర్చి, వాటికి యూపీఐ ఆధారిత లావాదేవీల సౌకర్యం కల్పించినట్లు డీజీజీఐ అధికారులు గుర్తించారు.

ఈ మార్గం ద్వారా ఆన్‌లైన్ గేమింగ్ పేరుతో వచ్చిన అక్రమ నగదు దేశవ్యాప్తంగా చలామణి అయినట్లు  భావిస్తున్నారు. ప్రాథమిక విచారణలో పేమెంట్ అగ్రిగేటర్లు, పేమెంట్ గేట్‌వేలు, మూడో పార్టీ టెక్నాలజీ సేవాదారుల పాత్రపై కూడా అనుమా నాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్బీఐ నియంత్రణలో ఉన్న సంస్థల తరఫున నిర్వ హించాల్సిన కస్టమర్ వెరిఫికేషన్ ప్రక్రియను దుర్వి నియోగం చేసి, మోసపూ రిత ధృవీకరణలు జరిగి నట్లు అధికారులు చెబుతున్నారు.  సరైన యాజ మాన్య వివరాలు లేకపో యినా, అనుమానాస్పద సంస్థలను వ్యవస్థలోకి చేర్చడం ఈ కేసులో కీలక అంశంగా మారింది. దర్యాప్తు సంస్థల కథనం మేరకు ఈ అక్రమ లావా దేవీల ద్వారా వచ్చిన డబ్బులో కొంత భాగం నిందితులకు చేరినట్లుగా అధికారులు గుర్తించారు.

పంకజ్ కుమార్ కూడా ఈ నెట్‌వర్క్ ద్వారా లబ్ధి పొందిన వ్యక్తుల్లో ఒకరని అధికారులు అనుమానిస్తున్నారు.  ఈ కేసుతో సంబంధం ఉన్న అనేక బ్యాంకు ఖాతాలను అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకూ దాదాపు వంద కోట్ల రూపాయల నిధులను సీజ్ చేశారు.  అనుబంధ సంస్థలు, మధ్య వర్తులు, టెక్నాలజీ భాగస్వా ముల పాత్రపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఈ భారీ ఆన్ లైన్ గేమింగ్ మోసంలో కీలక మాస్టర్‌మైండ్‌ లను గుర్తించేందుకు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు త్వరలో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు అంటున్నాయి.  

By
en-us Political News

  
ఈ విచారణలో విస్తు పోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం రిచ్ కిడ్స్ను మాత్రమే టార్గెట్ చేసుకొని వారితో మెల్లిమెల్లిగా సోషల్ మీడియా వేదిక ద్వారా పరిచయం పెంచుకుం టున్నారు. సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన లైఫ్ స్టైల్ చూపిస్తూ ప్రొఫైల్ తయారు చేసుకున్నారు. ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లో ఎస్కార్ట్ గా ఉంటూ రొమాంటిక్ మూడ్ అంటూ మైనర్లకు వల విసురుతున్నారు.
ఈ కొత్త జోన్ వచ్చెనెల మొదటి తేదీ నుంచీ కార్యకలాపాలు ప్రారంభిస్తుందని నోటిఫికేషన్‌ పేర్కొంది. దీంతో, ఇండియన్ రైల్వేలో దక్షిణ కోస్తా రైల్వే 18వ జోన్‌గా అవతరించనుంది.
ఈ ఆపరేషన్‌లో మొత్తం ఆరు స్టోన్ క్రషింగ్ యూనిట్లను నేలమట్టం చేయడంతో పాటు.. 12 ఆర్‌ఎంసీ ప్లాంట్లను పూర్తిగా తొలగించారు. భవిష్యత్తులో అక్కడ మళ్లీ క్రషింగ్ కార్యకలాపాలు జరగకుండా యంత్ర సామగ్రిని స్వాధీనం చేసుకుని తరలించారు. గతంలో మైనింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు శాఖలు పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ యథేచ్ఛగా కార్యకలాపాలు కొనసాగించడంతో ఈసారి శాశ్వతంగా చెక్ పెట్టినట్లు హైడ్రా అధికారులు వెల్లడించారు.
టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్నో బ్యాటర్లలో నికోలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగి కేవలం 21 బంతుల్లోనే ఒక ఫోరు, 8 సిక్సర్లతో 63 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
డ్రోన్ దాడి జరిగిన వెంటనే పెట్రోలియం జోన్‌లోని ఒక విభాగంలో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో ముగ్గురు భారతీయులకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన సహాయక బృందాలు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించాయి. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ చరిత్రాత్మక విజయం దిశగా దూసుకుపోతోంది.
చాందీ ఉమ్మన్, తన తండ్రి పేరిట ఉన్న రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేస్తూ భారీ మెజారిటీతో విజయం సాధించారు.
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కేరళలోని కన్నూర్ కు బయలుదేరిన ఇండిగో విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది.
పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి మళ్లీ గెలిచారు. ఎన్టీఏ కూటమి భాగస్వామిగా రెండో సారి పదవీ స్వీకారానికి సిద్దమయ్యారు.
అవి 2021 తమిళనాడు శాసన సభ ఎన్నికలు...
తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దక్షిణాది రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పట్టణంలో పురాతన రామాలయ పునర్నిర్మాణ పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.