Publish Date:Aug 31, 2022
దేశంలో మోడీ,షా ద్వయం ఎత్తులను చిత్తు చేస్తూ, కేంద్రంలోని మోడీ సర్కార్ ను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్న ఒకే ఒక్క బీజేపీయేతర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాత్రమే. ఆమ్ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కేల్చేందుకు కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందంటూ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన కేజ్రీవాల్ తానే స్వయంగా ప్రభుత్వంపై విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం అంటూ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాపై కేసు నమోదు చేసిన తరువాత కూడా ఆప్ ధీమాగా ఉంది. అక్రమ కేసు అంటు నిలబడింది. సోదాలు, తనిఖీలను పట్టించుకోలేదు. దీంతో ఢిల్లీలో ఆపరేషన్ ఆకర్ష్ కు బీజేపీ తెరతీసింది. ఆప్ ఎమ్మెల్యేలు 40 మందికి ఒక్కొక్కరికీ పాతిక కోట్ల రూపాయలు ఇవ్వజూపిందని కేజ్రీవాల్ అసెంబ్లీ సాక్షిగా ఆరోపించి.. కమలనాథుల ప్రలోభాలకు తమ ఎమ్మెల్యేలు ఎవరూ లొంగలేదని సగర్వంగా ప్రకటించి.. ప్రభుత్వం పట్ల ఆప్ ఎమ్మెల్యేల విశ్వాసాన్ని మరోసారి నిర్ద్వంద్వంగా నిరూపించడానికే నంటూ తన ప్రభుత్వంపై తానే విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టుకుని మోడీకి సవాల్ విసిరారు. విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా కేజ్రీవాల్ తన ప్రసంగంలో బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
ప్రజాస్వామ్య విరుద్ధంగా కేంద్రం వ్యవహరిస్తున్న తీరును అసెంబ్లీ సాక్షిగా ఎండగట్టారు. ఫెడరల్ స్ఫూర్తిని కాలరాసి.. ప్రజాస్వామ్య బద్ధంగా రాష్ట్రాలలో అధికారం చేపట్టిన బీజేపీ ప్రభుత్వాలను పడగొట్టేందుకు కేంద్రం చేస్తున్న కుట్రలను ఎండగట్టారు. వాస్తవానికి అసెంబ్లీలో బీజేపీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధమైందనీ, కానీ కేజ్రీవాలే స్వియంగా విశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టి బీజేపీకి కేజ్రీవాల్ షాక్ ఇచ్చారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సాధారణంగా ఏ సీఎం కూడా స్వయంగా తన ప్రభుత్వంపై తానే విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టరు. కానీ కేజ్రీవాల్ రూటే సెపరేటు. తన ప్రభుత్వంపై, తన ఎమ్మెల్యేలపై అచంచల విశ్వాసం, తనకున్న ప్రజాదరణపై నమ్మకం ఉన్నందునే కేజ్రీవాల్ సభలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. సాధారణంగా విశ్వాస తీర్మానంపై సభ్యులందరూ మాట్లాడిన తరువాత ముఖ్యమంత్రి సమాధానం చెబుతారు.
ఈ విషయంలో కూడా కేజ్రీవాల్ బీజేపీకి, కేంద్రానికి ఝలక్ ఇచ్చారు. ముందుగా తానే ప్రసంగించడం ద్వారా బీజేపీకి ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి కల్పించారు. దేశంలో ఎనిమిది రాష్ట్రాలలోని బీజేపీయేతర ప్రభుత్వాలను కేంద్రంలోని మోడీ సర్కార్ కూలదోసిన తీరును కళ్లకు కట్టినట్లు వివంరించారు. ఆయన అసెంబ్లీలో చేసిన ప్రసంగం తరువాత మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ముంబైలో స్పందించిన తీరే కేజ్రీవాల్ ప్రసంగం ఎంత సూటిగా, సుత్తిలేకుండా ఉందో అవగతమౌతుంది. కేజ్రీవాల్ మాదిరిగా తాను కమల నాథుల కుట్రలను ముందుగా పసిగట్ట లేకపోయానని అంగీకరించారు. దేశమంతటా కాషాయి జెండా ఎగరాలన్న ఆకాంక్షతో కమలనాథులు సాగిస్తున్న ఆపరేషన్ ఆకర్ష్ పూర్వపు కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిం చిన పార్టీ ఫిరాయింపుల విధానం కన్నా దుర్మార్గమైనదని కేజ్రీవాల్ విమర్శించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kejriwal-vikarsh-operation-against-bjp-operation-akarsh-39-143010.html
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.