కేబినెట్ రీషఫుల్ ఇప్పుడు ఇక కేసీఆర్ వంతు!?

Publish Date:Apr 24, 2022

Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేబినెట్ పునర్వ్యవస్థీరణ దిశగా అడుగులు వేస్తున్నారు. వచ్చే ఏడాది ఎన్నికల నాటికి సరికొత్త టీమ్ తో సిద్ధం అవ్వాలని భావిస్తున్నారా? ఏరి కోరి తాను తెచ్చుకున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే కూడా అదే చెప్పారా? ఇప్పుడు తెరాస వర్గాలలో విస్తృతంగా నడుస్తున్న చర్చ అదే.  రెండు దఫాలుగా అంటు 2014, 2018 ఎన్నికలలో విజయం తరువాత ఆయన కేబినెట్ లో పెద్దగా చెప్పుకోదగ్గ మార్పులు లేవనే చెప్పాలి. అయితే ఇప్పుడు మూడో సారి ఎన్నికలకు పార్టీని సంసిద్ధం చేస్తున్న నేపథ్యంలో టీమ్ ను మార్చుకోవాలని, వీలైతే పూర్తిగా ప్రక్షాళన చేయాల్సి అవసరం ఉందనీ ప్రశాంత్ కిశోర్ ఆయనకు సూచించనట్లు పార్టీ వర్గాలలో చర్చ జరుగుతోంది. పీకే టీమ్ జరిపిన రహస్య సర్వేలలో పలువురు మంత్రులపై ప్రజలలో వ్యతిరేకత ఉన్నట్లు తేలందని చెబుతున్నారు. 
సర్వేల వ్యవహారం పక్కన పెడితే ఇటీవలి కాలంలో పలువురు మంత్రులు వివాదాలలో ఇరుక్కుని ప్రతిష్టను మసకబార్చుకోవడం, ఆ ప్రభావం ప్రభుత్వంపై కూడా పడుతుందన్న భావనలో ఉన్న కేసీఆర్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ఇదే తరుణమని  భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే మంత్రివర్గ కూర్పుపై తనకు సన్నిహితులతో ఒక దఫా చర్చించినట్లు కూడా చెబుతున్నారు. తీవ్రమైన ఆరోపణలను ఎదుర్కొంటున్న కేబినెట్ మంత్రులకు ఉద్వాసన పలికి....వారి స్థానంలో ఉత్సాహంగా పని చేసే యువకులను నియమంచాలని సీఎం భావిస్తున్నారని చెబుతున్నారు.
ఏపీలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ మంటలు సృష్టించిన నేపథ్యంలో తెలంగాణలో కేబినెట్ లో మార్పులు, చేర్పులూ అనగానే సహజంగానే
అందరిలో ఉత్కంఠ, ఆసక్తి నెలకన్నాయి. ఎన్నికల ముంగిట కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై కేసీఆర్ కసరత్తుకు కారణం ఈ కేబినెట్ టీమ్ తో ఎన్నకలకు వెళితే నష్టం ఉంటుందన్న భావనే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుత కేబినెట్ లోని కొందరు మంత్రులపై తీవ్ర నేరారోపణలు ఉన్నాయి. వివాదాలలో ఇరుక్కున్న వారూ ఉన్నారు. వారి పట్ల ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉందని సర్వేలలో తేలంది. వీటన్నిటినీ పరిగణనలోనికి తీసుకునే కేబినెట్ పునర్వ్యవస్థీకరణ అనివార్యమని కేసీఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. వివాదాల మంత్రుల కారణంగా పార్టీ ప్రతిష్టకు భంగం వాటిల్లుతున్నదనీ, అటువంటి వారిని ఇంకా మంత్రులుగా కొనసాగిస్తే అది ఎన్నికలలో ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని కేసీఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.

By
en-us Political News

  
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన సమాజిక మాధ్యవ వేదిక ఎక్స్ లో పెట్టిన పోస్టులో.. ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తూ… రాష్ట్ర భవిష్యత్తుకు బాటలు వేస్తున్నామన్నారు.
ఆమె నామినేషన్ తిరస్కరణను బీజేపీ పక్కా ప్రణాళికతో చేసిన రాజకీయ కుట్రగా అభివర్ణించారు. జాతీయ మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి.. మధ్యప్రదేశ్ లోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌ను పావుగా వాడుకుని, ఉద్దేశపూర్వకంగానే మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను అడ్డుకుందని ఆరోపించారు.
ఈ ఆందోళన చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధమైన పద్ధతుల్లో, ఎలాంటి హింసకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో జరుగుతుందని నిర్వాహకులు స్పష్టం చేశారు. డిజిటల్ స్క్రీన్‌ల నుండి నేరుగా రోడ్లపైకి వస్తున్న ఈ జెన్-జీ ఉద్యమం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటికీ, క్షేత్రస్థాయిలో పాలనా పరమైన విధానాలు మరియు లబ్ధిదారుల శైలి మారలేదనే తీవ్ర అసంతృప్తి రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
దేశ రాజకీయాల్లో తెరవెనుక జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవంగా పూర్తయ్యాయి.
దిల్లీలో నీట్ పరీక్షల లీకేజీకి సంబంధించి పక్కా ఆధారాలు బయటపడటంతో అక్కడ కేంద్ర ప్రభుత్వంపై యువత తిరగబడింది. కానీ ఏపీలో మెగా డీఎస్సీ పారదర్శకంగా ముగిసి, నియామక పత్రాలు కూడా అభ్యర్థులకు అందజేశారు. ఏపీ విద్యాశాఖ కూడా విపక్షాలు చేసిన ప్రతి ఆరోపణకూ రికార్డులతో సహా పక్కాగా వివరణ ఇచ్చింది.
కవిత పార్టీ పేరుపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 14 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో టీఆర్ఎస్ అనే పేరు తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉందనీ, ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు బీఆర్ఎస్‌ను టీఆర్ఎస్‌గానే గుర్తిస్తున్నారని పేర్కొంటూ ఆ పేరును ఇతరులకు కేటాయించవద్దని ఈసీఐకి అధికారిక ఫిర్యాదు చేసింది.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తరువాత టీఎంసీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎన్నికల ఫలితాల తరువాత పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. మమతా బెనర్జీని ధిక్కరిస్తూ ఒక్కరొక్కరుగా కీలక నేతలు పార్టీని వీడుతున్నారు.
దేశంలో ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేసిన మోడీ.. ఇప్పడు పాలనలో రికార్డు అంటూ సంబరాలు చేసుకోవడమేంటని ప్రశ్నించారు. మోడీ పాలనా మైలురాయి కేవలం స్వయం ప్రకటిత అంశం మాత్రమేనన్నారు.
రాబోయే రోజుల్లో ఏ ప్రాంతీయ పార్టీని దగ్గరకు చేర్చుకొనే అవకాశం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి బుధవారంతో 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో మంగళవారం (జూన్ 9) ఢిల్లీలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఈ సోలో ఎజెండా ప్రకటించారు.
మొత్తంగా తెలుగు రాష్ట్రాలలో బీజేపీ వ్యూహం ఏమిటన్న విషయాన్ని అమిత్ షా తేటతెల్లం చేసేశారు. దేశవ్యాప్తంగా కూటమి రాజకీయాలు నడుస్తున్న తరుణంలో.. కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు జనసేనకు ఒకింత ఇబ్బందికలిగేలా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి బయటకు వచ్చేస్తున్నారు. తాజాగా టీఎంసీకి చెందిన రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వారం రోజుల వ్యవధిలో టీఎంసీకి గుడ్ బై చెప్పిన రెండో రాజ్యసభ సభ్యురాలు సుస్మితాదేవ్.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.