కేటీఆర్ కు పగ్గాలు... హరీష్ కు జాతీయ బాధ్యతలు.. కేసీఆర్ వ్యూహమిదేనా?

Publish Date:Nov 14, 2022

Advertisement

ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి స్థాయిలో జాతీయ రాజకీయాల్లో మునిగి పోవడం ఖాయంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ ప్రకటన తరువాత నుంచే కేసీఆర్, రాష్ట్రంలో కంటే ఢిల్లీలో, కాదంటే ఇతర రాష్ట్రాల పర్యటనలలోనే ఎక్కువగా ఉంటారనే సంకేతాలు విస్పష్టంగా కనిపించాయి. ఆ పర్యటనల కోసమే ‘ఛార్టర్డ్ ఫ్లైట్’ ను కూడా కొనుగోలు చేసి సిద్ధం చేసుకున్నారు. ఈ నేపధ్యంలో, రాష్ట్ర రాజకీయాల్లో, మరీ ముఖ్యంగా అధికార పార్టీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున మార్పులు చోటు చేసుకునే అవకాశాలపై తెరాస శ్రేణుల్లోనే కాదు పరిశీలకుల్లోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వాస్తవానికి దసరా రోజున కేసీఆర్ బీఆర్ఎస్ ఆవిర్భావ ప్రకటన రోజునే ఈ సంకేతాలు ఇచ్చారు.

పార్టీ ముఖ్య నేతలకు బీఆర్ఎస్ లో కీలక బాధ్యతలను అప్పగిస్తాననీ చెప్పారు.  ఈ నేపద్యంలో, కొందరు ‘ముఖ్య’ నేతలను ఇక్కడి బాధ్యతల నుంచి  తప్పించి, జాతీయ బాధ్యతలు అప్పగించడమో, లేక రాష్ట్ర బాధ్యతలకు అనుగుణంగా జాతీయ బరువును అదనంగా వారి మీద మోపడమో అనివార్యమన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది. మునుగోడు ఉప ఎన్నిక కారణంగా జాతీయ కార్యాచరణ వేగం ఒకింత తగ్గిందని పార్టీ శ్రేణులే అంటున్నాయి. ఇప్పుడిక మునుగోడు ఉప ఎన్నిక ఫలితం అనుకూలంగా వచ్చిన నేపథ్యంలో కేసీఆర్ జాతీయ రాజకీయాలలో దూకుడు పెంచే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.

అందులో భాగంగానే  మంగళవారం (నవంబర్ 15) పార్టీ లెజిస్లేచర్ పార్టీ, పార్లమెంటు సభ్యులు, కార్యవర్గ సభ్యుల సమావేశం ఏర్పాటు చేశారని కూడా అంటున్నారు. ఈ సమావేశంలోనే పార్టీ, ప్రభుత్వ బాధ్యతల బదలీపై ప్రకటన కూడా జరిగే అవకాశం ఉందంటున్నారు. అన్నిటికీ మించి   ముఖ్యమంత్రి కేసీఆర్, ఒక మాట మాట్లాడారంటే, ఆ మాటకు టీకా తాత్పర్యం, నానార్దాలు చాలానే ఉంటాయని తెరాస శ్రేణులే అంటున్నాయి. అలాగే, ఇప్పడు, ముఖ్యమంత్రి పార్టీ నేతలు జాతీయ బాధ్యతలకు సిద్ధం కావాలని సంకేత మాత్రంగా చేసిన వ్యాఖ్యల వెనక ప్రత్యేక  లక్ష్యం ఏదో ఉండే ఉంటుందంటున్నారు. ఆ అక్ష్యం ఏమిటన్నదానిపై పలు రకార ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే కేసీఆర్ ఏ ఉద్దేశంతో సీనియర్ నేతలకు జాతీయ బాధ్యతలు అన్నారన్న విషయం మంగళవారం (నవంబర్ 15) జరిగే కీలక సమావేశంలో తేలిపోనుంది.

 అయినా ముఖ్యమంత్రి ‘జాతీయ బాధ్యతలు’ అన్న మాటలో అలాంటి అర్థాలు ఉన్నా, లేకున్నా నిజంగా సీరియస్ గా జాతీయ రాజకీయాల్లో ముందుకు పోవాలంటే,అది కేవలం కేసీఆర్ వల్ల అయ్యే పని కాదు, ఒకరిద్దరు కాదు.. చాలా మంది చాలా త్యాగాలు చేయవలసి ఉంటుందని, ముఖ్యంగా తెరాస  నిర్మాణం నుంచీ కీలకంగా వ్యవహరించిన హరీష్ రావు వంటి ముఖ్య నేతలు ముందుగా త్యాగాలకు సిద్ధం కావాల్సి ఉంటుంది. అందుకే కేసీఆర్ రాష్ట్ర నాయకులకు జాతీయ బాధ్యతలు అనగానే పార్టీలో, పరిశీలకుల్లో ఎన్నో రకాల సందేహాలు, అనుమానాలు వ్యక్తమయ్యాయి. త్యాగాలకు సిద్ధం కావాల్సిన నేత లెవరన్న చర్చలూ సాగాయి.

ఇప్పటికే ఢిల్లీ రాజకీయలలో సంబంధాలున్న  వినోద్ కుమార్, ప్రస్తుత మాజీ ఎంపీలతో పాటుగా సంస్థాగత నిర్మాణంలో,. సంస్థాగత వ్యవహారాలను చక్క పెట్డంలో ప్రతిభ చాటిన  హరీష్ రావు  వంటి వారి అవసరం జాతీయ పార్టీకి మరింత ఎక్కువ ఉంటుందని అంటున్నారు. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు అన్ని విధాల నమ్మిన బంటుగా ఉండే మేనల్లుడు హరీష్ రావుకే బీఆర్ఎస్ కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయని పార్టీ శ్రేణులు కూడా భావిస్తున్నాయి. 

 ముఖ్యమంత్రి కేసీఆర్, జాతీయ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే, ఆటోమేటిక్’గా ప్రస్తుతం సెకండ్ ఇన్ కమాండ్ గా ఉన్న తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు,  కేటీఆర్ జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పగ్గాలు చేపడతారు.

అలాగే, ముఖ్యమంత్రి జాతీయ రాజకీయాలో బిజీ అయిన తర్వాత, అవసరాన్ని బట్టి, ముఖ్యమంత్రి పదవి కూడా కేటీఆర్ కే దఖలు పడతాయి. అదే జరిగితే, జాతీయ స్థాయిలో కేసీఆర్ నాయకత్వంలో, రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేటీఆర్ నాయకత్వంలో ఎన్నికలకు వెళితే, ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి ఎవరనే, ప్రశ్న రాకుండా, ముందుకుసాగి పోయే అవకాశం ఉంటుందన్నది కేసీఆర్ వ్యూహంగా చెబుతున్నారు.  అదే సమయంలో పార్టీకి కొంతలో కొంత కేటీఆర్ కు పోటీగా ఉంటారని భావించే హరీష్ రావును దూరం పెట్టడంలో భాగంగానే హరీష్ రావుకు జాతీయ బాధ్యతలు అప్పగించడమే మేలన్నది కూసీఆర్ వ్యూహంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కరోనా మహమ్మారి బారినపడి కోలుకున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఇప్పటికీ లాంగ్ కొవిడ్ తీవ్ర దుష్ప్రభావాలతో సతమతమవుతున్నారు.
సంతానం కలగలేదన్న కారణంతో భార్యను తప్పుబడుతూ విడాకులు కోరలేరని మద్రాసు హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
శారీరక వైకల్యాన్ని జయించి..అమెజాన్‌లో కొలువు కొట్టిన నిట్ గ్రాడ్యుయేట్.!
వాతావరణ మార్పుల ఎఫెక్ట్: కిడ్నీ ఆరోగ్యంపై షాకింగ్ రిపోర్ట్.!
బతుకమ్మ సంబరాల నుంచి ఇంటికి వెళ్తుండగా విషాదం.!
రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధం తెలుగు రాష్ట్రాల్లో ఒక కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది.
భారత యువ క్రికెటర్ పృథ్వీ షా, నటి ఆకృతి అగర్వాల్ వ్యక్తిగత జీవితంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ గోల్ఫ్ ఎడ్జ్ అపార్ట్‌మెంట్స్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది.
అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరో అవినీతి బాగోతాన్ని వెలుగులోకి తెచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.