ముందస్తుకే కేసీఆర్ కసరత్తు

Publish Date:Nov 13, 2022

Advertisement

మునుగోడు ఉప ఎన్నిక ఫలితంతో మళ్లీ ముందస్తు తెరమీదకు వచ్చింది. ఈ విజయంతో తెరా శ్రేణుల్లో ఉత్సాహం వెల్లి విరుస్తోంది. పార్టీ శ్రేణుల్లో ఆ ఉత్సాహం అలా ఉండగానే ముందస్తుకు వెళ్లి లబ్ధి పొందాలని కేసీఆర్ యోచిస్తున్నారా అంటే పార్టీ శ్రేణులే కాదు పరిశీలకులు కూడా ఔననే అంటున్నారు.

మునుగోడు ఉప ఎన్నికల విజయం ఇచ్చిన ఉత్సాహంతో  తెలంగాణ‌లో ముందస్తు ఎన్నిక‌ల కోసం ముఖ్య‌మంత్రి కేసీఆర్  కసరత్తులు ప్రారంభించేశారనని అంటున్నారు.  గ‌తంలో కూడా ముందస్తు పార్టీకీ, కేసీఆర్ కు లబ్ధి చేకూర్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. మరో సారి కేసీఆర్ అదే బాటలో పయనించేందుకు ప్రయత్నాలు ప్రారంభించేశారని చెబుతున్నారు.

 మంగళవారం  (నవంబర్ 15) కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న టీఆర్ఎస్ లెజిస్లేటివ్, అలాగే పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశం  జరగనున్న నేపథ్యంలో ముందస్తు చర్చ పార్టీ శ్రేణుల్లో మరింత ముమ్మరంగా జరుగుతోంది. మునుగోడు ఉప ఎన్నిక‌లో విజయం సాధించడం, మ‌రోవైపు ప్ర‌ధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం క‌య్యానికి కాలు దువ్వుతుండ‌డంతో ఇక అమీతుమీ తేల్చుకోవాల‌నే ప‌ట్టుద‌ల‌తో కేసీఆర్ ముందస్తు నిర్ణయం తీసేసుకున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ లెజిస్లేటివ్‌, పార్ల‌మెంట‌రీ స‌భ్యుల‌తో పాటు పార్టీ రాష్ట్ర కార్య‌వ‌ర్గంతో మంగళవారం (నవంబర్ 15)సంయుక్త స‌మావేశం నిర్వ‌హించి ముందస్తుపై ఒక నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్ పేరుతో జాతీయ పార్టీగా మార్చిన నేపథ్యంలో మొద‌ట తెలంగాణ‌లో బ‌లాన్ని నిరూపించుకుని.. ఆపై జాతీయ స్థాయిలో జెండా ఎగురవేయాలన్నది కేసీఆర్ వ్యూహంగా చెబుతున్నారు.   ఆ ఉద్దేశమే లేకుండా ఇప్ప‌టిక‌ప్పుడు పార్టీ లెజిస్లేచర్ భేటీ, పార్లమెంట్ సభ్యులు, కార్యవర్గ సభ్యులతో  కీల‌క స‌మావేశం నిర్వ‌హించాల్సిన అవ‌స‌రం లేదని అంటున్నారు. అత్యంత కీల‌క‌మైన అంశంపై చ‌ర్చించేందుకే ఈ సమావేశాన్ని ఇంత హఠాత్తుగా కేసీఆర్ ఏర్పాటు చేశారని అంటున్నారు. ఆ కీలకమైన అంశం ముందస్తు ఎన్నికలేనని కూడా సూత్రీకరణలు చేస్తున్నారు. పరిశీలకులు విశ్లేషణలు సైతం ఆ దిశగానే ఉన్నాయి. అలాగే క్షేత్ర‌స్థాయిలోఎప్ప‌టిక‌ప్పుడు కేసీఆర్  ప‌లు స‌ర్వేలు చేయించుకుంటూ , వాటి ఫ‌లితాల‌కు అనుగుణంగా  వ్యూహాత్మకంగా ముందుకు నడుస్తున్నారని చెబుతున్నారు. మొత్తానికి   టీఆర్ఎస్ కీల‌క స‌మావేశంపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమౌతోంది. ఈ కీలక సమావేశం వేదికగానే తన వారసుడిగా పార్టీ పగ్గాలు, ప్రభుత్వ పాలనా బాధ్యతలను కేటీఆర్ కు అప్పగించే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు,

By
en-us Political News

  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కరోనా మహమ్మారి బారినపడి కోలుకున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఇప్పటికీ లాంగ్ కొవిడ్ తీవ్ర దుష్ప్రభావాలతో సతమతమవుతున్నారు.
సంతానం కలగలేదన్న కారణంతో భార్యను తప్పుబడుతూ విడాకులు కోరలేరని మద్రాసు హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
శారీరక వైకల్యాన్ని జయించి..అమెజాన్‌లో కొలువు కొట్టిన నిట్ గ్రాడ్యుయేట్.!
వాతావరణ మార్పుల ఎఫెక్ట్: కిడ్నీ ఆరోగ్యంపై షాకింగ్ రిపోర్ట్.!
బతుకమ్మ సంబరాల నుంచి ఇంటికి వెళ్తుండగా విషాదం.!
రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధం తెలుగు రాష్ట్రాల్లో ఒక కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది.
భారత యువ క్రికెటర్ పృథ్వీ షా, నటి ఆకృతి అగర్వాల్ వ్యక్తిగత జీవితంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ గోల్ఫ్ ఎడ్జ్ అపార్ట్‌మెంట్స్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది.
అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరో అవినీతి బాగోతాన్ని వెలుగులోకి తెచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.