బీఆర్ఎస్ లో చీలికకు బీజం కేసీఆర్ మౌనం!

Publish Date:Sep 30, 2024

Advertisement

మాటల మాంత్రికుడు, రాజకీయ చాక్యుడు.. ప్రత్యర్థుల కంటే రెండడుగుల ముందే  ఉంటారు. వారు వ్యూహ రచన చేయడానికి ముందే వాటికి విరుగుడు వ్యూహాలను అమలు చేసి వారిని నిరుత్తరులను చేస్తారు. ఇవీ బీఆర్ఎష్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి ఆయన అధికారంలో ఉన్న పదేళ్లూ వినిపించిన మాటలు. కేసీఆర్ రాజకీయాలను తట్టుకోవడం కష్టమని అప్పట్లో ఆయన ప్రత్యర్థులు సైతం అంగీకరించేసిన పరిస్థితి. కానీ ఒక్క ఓటమి.. ఔను ఒకే ఒక్క ఓటమి కేసీఆర్ ను నిర్వీర్యుడిగా మార్చేసింది. ఆయన వ్యూహ రచన సంగతి పక్కన పెడితే.. అసలాయన రాజకీయంగా ఓనమాలు కూడా మరిచిపోయారా అన్న అనుమానాలు వ్యక్తమయ్యేలా చేసింది.  తెలంగాణలో రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టి పది నెలలు కావస్తున్నది. ఈ పది నెలల కాలంలోనూ కేసీఆర్ వినిపించింది, కనిపించిందీ చాలా తక్కువ. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే సాహసం కూడా చేయలేదు. ఏదో మొక్కుబడికి అన్నట్లు ఒక్క రోజు మాత్రం అదీ రేవంత్ సర్కార్ బడ్జెట్ ప్రవేశ పెట్టిన రోజు హాజరయ్యారు. ఇన్ని నెలలూ ఆయన పూర్తిగా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. ఇక బీఆర్ఎస్ వ్యవహారాలన్నీ ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చక్కబెడుతున్నారు. హరీష్ రావు పార్టీని రాజకీయంగా యాక్టివ్ గా ఉంచడానికీ, లేదా యాక్టివ్ గా ఉందని ప్రజలను నమ్మించడానికి  తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. 

హైడ్రా వివాదంతో ఇప్పుడు బీఆర్ఎస్ కు మంచి రోజులు వచ్చాయని ఆ పార్టీ శ్రేణులు సంబరపడుతున్నారు. అయితే ఇప్పుడు కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ వదిలి బయటకు రాకపోతే అంది వచ్చిన అవకాశం కూడా చేజారిపోయే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయని బీఆర్ఎస్ క్యాడర్ ఆందోళనలో ఉంది.  అయితే ఆయనను గట్టిగా అభిమానించేవారంతా మాత్రం ఆయన పెద్ద వ్యూహంలో ఉన్నారనీ, తెరవెనుక పార్టీ పటిష్టత కోసం  గట్టిగా పని చేస్తున్నారనీ అంటున్నారు. రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలో పరిస్థితులను ఆయన ఎప్పటికప్పుడు తెలుగసుకుంటున్నారని అంటున్నారు.  అయితే పరిశీలకులు మాత్రం కేసీఆర్ రాజకీయంగా అస్త్రసన్యాసం చేసినట్లేని ఆయన మౌనాన్ని ఉటంకిస్తూ విశ్లేషణలు చేస్తున్నారు.  బీఆర్ఎస్ లో రెండు పెద్ద తలకాయల మధ్య విభేదాలు ఆ పార్టీని నిట్టనిలువుగా చీల్చే పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు. 

బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్, అలాగా పార్టీలో ట్రబుల్ షూటర్ గా గుర్తింపు పొందిన మాజీ మంత్రి హరీష్ రావుల మధ్య ఆల్ ఈజ్ నాట్ వెల్ అని చెబుతున్నారు. హైడ్రా కూల్చివేతలకు వ్యతిరేకంగా, మూసీ ఆక్రమణల కూల్చివేతలకు నిరసనగా ప్రజలలో పెల్లుబుకుతున్న ఆగ్రహావేశాలను పార్టీకి ప్రయోజనం చేకూర్చేలా మలచుకునే విషయంలో కేటీఆర్, కేటీఆర్ లు ఒకరితో ఒకరు పోటీ పడుతున్న పరిస్థితి కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. హరీష్ రావు క్షేత్ర స్థాయిలో ప్రజలతో మమేకమౌతూ ఉద్యమాలు నిర్మించడానికి సమాయత్తమౌతుంటే.. కేటీఆర్ సోషల్ మీడియాకు పరిమితమైపోవడం ఇదే సూచిస్తోందని అంటున్నారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరాజయం పాలైన నాటి నుంచీ హరీష్, కేటీఆర్ ల మధ్య ఆధిపత్య పోరు ప్రారంభమైందని, ఇందుకు అసెంబ్లీలో విపక్ష నేత ఎన్నిక ఏకగ్రీవం కాకపోవడాన్ని ఉదహరిస్తున్నారు. అందుకే గత్యంతరం లేని పరిస్థితుల్లో కేసీఆర్ ఆ పదవి చేపట్టారని అంటున్నారు.  

ఇప్పుడు కూడా కేసీఆర్ బయటకు వచ్చి పార్టీలో పరిస్థితిని చక్కదిద్దడానికి చర్యలు తీసుకోకుంటే బీఆర్ఎస్ లో చీలిక అనివార్యమౌతుందని పార్టీ వర్గాలే అంటున్నాయి.  కేసీఆర్ ప్రజాకర్షణ ఉన్న నేత అనడంలో ఎలాంటి సందేహం లేదు. అటువంటి నాయకుడు పార్టీ ఓటమి తరువాత ప్రజలకు కనిపించకుండా ముఖం చాటేయడమంటే.. తన పాలనలో తప్పులు జరిగాయనీ, ప్రజా హితంగా పాలన సాగించలేదనీ అంగీకరించడమే ఔతుందని.. సుదీర్ఘకాలంగా ఆయన ప్రజలతో  మమేకం కాకుండా ఫామ్ హౌస్ కు పరిమితం కావడం క్యాడర్ కు సైతం తప్పుడు సంకేతాలు ఇస్తున్నదనీ పార్టీ నేతలే అంటున్నారు.  ఇప్పటికైనా కేసీఆర్ మౌనం వీడి ప్రజలలోకి రాకుంటే ఆయన మౌనమే బీఆర్ఎస్ చీలికకు బీజం వేస్తుందని అంటున్నారు. 

By
en-us Political News

  
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి
జగన్ ప్రతిపాదిత మావిగన్ ప్రాంతం నుంచే అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల ప్రజలలో అయితే మావిగన్ పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అమరావతికి చట్టబద్ధత వచ్చిందని అంతా పండుగ వాతావరణం నెలకొన్న ఈ పరిస్థితుల్లో మావిగన్ ఏమిటి అంటూ ఓ రేంజ్ లో జగన్ ప్రతిపాదనపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నితీశ్‌కుమార్ బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. అలాగే ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు వేర్వేరుగా లేఖలు రాశారు. ఆ లేఖల్లో ఆయన వారి మద్దతు కోరారు. ఆశ్చర్యపోవద్దు చంద్రబాబు వారి మద్దతు కోరతూ లేఖ రాశారు. అయితే ఆ మద్దతు ఏ విషయంలో అంటే మహిళల రాజకీయ సాధికారతకు కీలక మైలురాయిగా నిలిచే మహిళా రిజర్వేషన్ బిల్లుకు. ఆ బిల్లుకు మద్దతు పలకాల్సిందిగా కోరుతూ చంద్రబాబు ఈ లేఖలు రాశారు.
మాజీ మంత్రి, సీనియర్ పొలిటీషియన్ జీవన్ రెడ్డి అధికారికంగా బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకునే వేదికగా ఆ సభ జరగబోతున్నది. ఈ భారీ బహిరంగ సభలో కేసీఆర్ అఫీషియల్ గా జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ లో చేర్చుకుంటారు. ఈ సభను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ భారీగా ఏర్పాట్లు చేస్తోంది.
బెంగాల్ అభివృద్ధి కేవలం రాజధాని కోల్‌కతా, దాని చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమైందన్నారు. ముఖ్యంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న జిల్లాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని దుయ్యబట్టారు.
ఈ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు డీలిమిటేషన్ ఏ విధంగా అవరోధంగా మారుతుందన్నది ఇండియా కూటమి పార్టీలకు వివరించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ హస్తిన పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
రాజకీయంగా ఎదుర్కొనలేకే.. దర్యాప్తు సంస్థల ద్వారా తమ విజయాన్ని అడ్డుకోవాలని కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రయత్నిస్తున్నదని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనాభా నియంత్రణ శిక్షా? బహుమతా? అని నిల‌దీస్తున్నారు సీఎం రేవంత్. కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన ఎంపీ సీట్లను పెంచాలని చూస్తోంది. ఆనాడు కేంద్రం పిలుపునిచ్చిందని దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక కుటుంబ నియంత్రణను పక్కాగా అమలు చేశాయి. ఫలితంగా ఇక్కడ జనాభా పెరగలేదు.
ఈ కేసులన్నీ ప్రజలకు టికెట్ లేని సినిమా చూపిస్తున్నాయన్నారు. ఈ కేసుల్లో ఎవరికి శిక్షలు పడవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.
ఆ వ్యూహం అమరావతి విధ్వంసమేనని నొక్కి వక్కాణిస్తున్నారు. విజయవాడ మీడియాతో మాట్లాడిన ఏబీ వెంకటేశ్వరరావు జగన్ మావిగన్ ప్రతిపాదన కేవలం చంద్రబాబుపై విమర్శకే పరిమితం కాదన్నారాయణ. ఈ మావిగన్ ప్రతిపాదన వెనుక అమరావతి అస్థిత్వాన్నే ప్రశ్నార్థకం చేసే అతి బయంకరమైన కుట్ర కోణం ఉందని ఏబీ వెంకటేశ్వరరావు వివరించారు.
బీఆర్ఎస్ అఫీషియల్ సోషల్ మీడాయా ఖాతాలలో అంగన్ వాడీలకు సెల్ ఫోన్ల వ్యవహారంలో భారీగా అవినీతి జరిగిందంటూ వచ్చిన వరుస పోస్టులు తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించాయని సీతక్క ఆ నోటీసులో పేర్కొన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.