Publish Date:Sep 30, 2024
జగన్ లడ్డూ వివాదంలో నిండా మునిగిపోయారు. ఆయనకు ఇక ఇందులోంచి బయటపడే దారులన్నీ మూసుకుపోయాయి. స్వతహాగా క్రైస్తవ మత విశ్వాసం ఉన్న జగన్ ను ఆ కారణంగా ఏపీలోని హిందూ ఓటర్లు ఎన్నడూ దూరం పెట్టలేదు. 2019 ఎన్నికలలో జగన్ పార్టీ ఘన విజయం సాధించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టగలగడమే ఇందుకు నిదర్శనం. 2024 ఎన్నికలలో జగన్ పార్టీ ఘోర పరాజయానికి కూడా ఆయన మత విశ్వాసం ఎంత మాత్రం కారణం కాదు. అధికారంలో ఉన్న సమయంలో అరాచక పాలన సాగించడమే ప్రజలు ఆయనను తిరస్కరించడానికి కారణం. ఈ విషయంలో ఎలాంటి సందేహాలకూ తావులేదు. అయితే ఇప్పుడు లడ్డూ వివాదంలో ఆయన హిందూ వ్యతిరేకిగా తనకు తానే ముద్ర వేసుకున్నారు.
తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు కలిసిన కల్తీ నెయ్యి వినియోగం ప్రపంచ వ్యాప్తంగా హిందువుల మనోభావాలను గాయపరిచింది. సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. కల్తీ నెయ్యి వినియోగంపై దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం సిట్ ను వేసింది. ఆ సిట్ దర్యాప్తులో నిజానిజాలు తేలుతాయి. అయితే ఈ సమయంలో జగన్ ప్రాయశ్చిత పూజలు అంటూ తిరుమల ప్రయాణం పెట్టుకోవడం, అయితే తిరుమల వెంకన్న దేవుడిపై నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇవ్వడానికి నిరాకరించి తిరుమల ప్రయాణాన్ని రద్దు చేసుకోవడంతో ఆయన ప్రజలలో విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయారు.
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ వ్యవహారం వెలుగులోకి రాగానే జగన్ తాను హిందూ వ్యతిరేకిని కాను అని చాటుకోవడానికి ఎన్ని చేయాలో అన్నీ చేశారు. అయితే.. గతంలో ఎన్నడూ లేని విధంగా లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించే నెయ్యి కొనుగోలుకు రివర్స్ టెండరింగ్ ఎందుకు అవసరం అయ్యిందో వివరించడంలో మాత్రం విఫలమయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ప్రాయశ్చిత పూజలు అంటూ తిరుమల పర్యటన పెట్టుకోవడాన్ని తెలివితక్కువ వ్యూహంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ఆయన తిరుమల పర్యటన సందర్భంగా డిక్లరేషన్ అంశం తెరమీదకు వస్తుందని మెడమీద తలకాయ ఉన్న ఎవరైనా ఇట్టే చెప్పగలరు. అయితే జగన్ మాత్రం తన పర్యటనను ప్రభుత్వం అడ్డుకుంటే వచ్చే పోలిటికల్ మెయిలేజ్ పై దృష్టి పెట్టారు తప్ప డిక్లరేషన్ అంశం బూమరాంగ్ అవుతుందని ఊహించలేదు. ఇప్పుడు అదే ఆయన మెడకు చుట్టుకుంది. జగన్ తిరుమల పర్యటనను ప్రభుత్వం అడ్డుకోలేదు సరికదా.. ఆయన పర్యటన సజావుగా సాగడానికి అవసరమైన ఏర్పాట్లు చేసింది. కూటమి పార్టీ శ్రేణులెవరూ జగన్ పర్యటనను అడ్డకోవద్దంటూ జనసేనాని పిలుపు కూడా ఇచ్చారు.
అన్యమతస్థులు ఎవరైనా తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవాలంటే దేవుడిపై విశ్వాసం ఉందన్న డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. జగన్ తన తిరుమల పర్యటన రద్దు చేసుకోవడంతో డిక్లరేష్ ఇవ్వడం ఇష్టం లేకే జగన్ తన పర్యటన రద్దు చేసుకున్నారని ధృవపడింది. ఇప్పుడు ఇక డిక్లరేషన్ ఇవ్వకపోవడానికి ఎన్ని కారణాలు చెప్పుకున్నా జనం నమ్మే పరిస్థితి ఉండదు. ఎందుకంటే తిరుమల పర్యటన రద్దు చేసుకోవడం ద్వారా జగన్ స్వయంగా తాను హిందూ వ్యతిరేకిననీ, తిరుమల దేవుని పట్ల తనకు విశ్వాసం లేదనీ తనకు తానే చాటుకున్నట్లైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-self-goal-in-laddu-dispute-39-185870.html
అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది, దీని ఫలితాన్ని అనేక నిర్మాణాత్మక మరియు రాజకీయ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి.
కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం తన చోటుకు ఎసరు వస్తున్నదా అన్న అనుమానంతో.. ఆ కాపు నేత తానేనని చాటుకోవడానికి తన వంతు ప్రయత్నాలు మొదలెట్టేశారంటున్నారు. నేను సైతం అంటూ ఆయన రంగంలోకి దిగినట్లు వైసీపీ వర్గీయులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ఇందుకు తార్కానాలు కూడా చూపుతున్నారు.
ఉభయ సభలలో ఆమోదం పొందిన ఆ బిల్లు ఇప్పుడు దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు చేరింది. ఇక ఆమె సంతకం పెట్టడానూ ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఆమె నేడో, రేపో ఈ బిల్లుపై సంతకం చేయడం ఖాయమని అంటున్నారు.
తమిళనాడులో 2026 ఎన్నికలు హోరాహోరీగా సాగే పోరుగా రూపుదిద్దుకుంటున్నాయి, ఇందులో స్పష్టమైన విజేత ఎవరూ లేరు. స్వల్ప ఓట్ల మార్పులు సీట్ల ఫలితాలపై నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపవచ్చు.
రాజకీయం అంటే కేవలం అధికారంలో ఉండటం మాత్రమే కాదని, ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ ముందుకు సాగాలని వైసీపీకి హితవు పలుకుతున్నట్లుగా మాట్లాడుతూనే.. ఆ పార్టీకి కర్తవ్యబోధ చేశారు.
బిజెపికి 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్‌తో పునాదులు పడ్డాయి. అక్కడి నుంచి ఈ పార్టీ అంచలంచలుగా ఎదిగి నేడీ స్థితికి చేరుకుంది. గతంలో వాజ్ పేయి ఈ పార్టీకి అధికార వాసన రుచి చూపడంతో.. ఇప్పుడు వరుసగా మూడు పర్యాయాల పాటు అధికారం చేజిక్కించుకుని.. ప్రస్తుతం అప్రతిహాత జైత్ర యాత్ర చేస్తోంది.
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక పోలవరం జిల్లా చింతూరు, ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో ఎండలు మండిపోతాయి. వడగాలుల ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుంది.
రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారాయి.
న్ని ఎన్నికలలో విచిత్రాలు జరగవు. ప్రతిసారీ ఒకటే జరిగితే, దాన్ని విచిత్రం అనరు కదా? ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాకముందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటి పలుకు వినపడుతున్నది. కొందరు ప్రముఖులు పక్కదారులు చూస్తున్నారని, పక్క పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని కూడా వినపడుతున్నది.
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పంథాను మార్చుకోలేదనేది స్పష్టమవుతోంది. ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల మంత్రం జపించిన జగన్.. ఇప్పుడు మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపి ఒక మెగా సిటీగా మార్చాలనే సరికొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.
మూడు రాజధానుల అంశం గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలలో ఒకటి అన్న విషయాన్ని విస్మరించి.. మళ్ళీ అదే తరహా ప్రత్యామ్నాయ వాదనలు వినిపించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది. పార్టీ కేడర్ సైతం మావిగన్ ఏంటి అదేదో పంటకు పట్టే తెగుల్లా ఉందని నెత్తీ నోరూ బాదుకుంటోంది.
ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై చెయ్యి చేసుకున్నారని పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున కృతజ్ణతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే... తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. మాకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు.