Publish Date:Mar 24, 2023
రాహుల్ గాంధీపై అనర్హత వేటును విపక్షాలన్నీ ముక్త కంఠంతో ఖండిస్తున్నాయి. అదానీ అంశంపై నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే కేంద్రంలోని మోడీ సర్కార్ లోక్ సభ సెక్రటేరియెట్ పై ఒత్తిడి తెచ్చి రాహుల్ పార్లమెంటు సభ్యుడిగా అనర్హుడని చెప్పించిందని విమర్శిస్తున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాహుల్ పై అనర్హత వేటును ఖండించారు. ఇది పూర్తిగా రాజ్యాంగానికి తప్పుడు అన్వయమేనని అన్నారు. రాహుల్ పై అనర్హత వేటు విషయంలో మోడీ సర్కార్ చూపిన వేగం చూస్తుంటే రాహుల్ పై అప్రజాస్వామికంగా అనర్హత వేటు వేశారన్న సంగతి తేటతెల్లమౌతోందని కేసీఆర్ పేర్కొన్నారు.
మోడీ సర్కార్ ఇప్పుడు క్రిమినల్ డిఫమేషన్ ను విపక్షాలను లక్ష్యంగా చేసుకుని వేధించడానికి ఉపయోగించుకుంటోందని విమర్శించారు. కేంద్రం ఇప్పటి వరకూ ఈడీ, సీబీఐలను ఎలా అయితే దుర్వినియోగం చేసిందో అలా క్రిమినల్ డిఫమేషన్ ను విపక్ష నేతలపై అనర్హత వేటు వేయడానికి ఉపయోగించుకుంటోందని, ఇది చాలా దారుణమని కేసీఆర్ పేర్కొన్నారు. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఇదొక చీకటి రోజుగా కేసీఆర్ అభివర్ణించారు. మోడీ దురహంకారానికి, నియంతృత్వానికీ ఇది పరాకాష్ట అని పేర్కొన్నారు. అత్యున్నత స్థాయి ప్రజాస్వామ్య వేదిక అయిన పార్లమెంటును సైతం మోడీ సర్కార్ తన ప్రత్యర్థులను వేధించే హేయమైన చర్యలకు వినియోగించుకోవడం దారుణమన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం ప్రజాస్వామ్య వాదులంతా కలిసి కేంద్ర ప్రభుత్వ దుర్మార్గాలను సమష్టిగా ప్రతిఘటించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kcr-says-un-democratic-25-152899.html
కడప పులివెందుల మున్సిపాలిటీ ఛైర్పర్సన్ ఎన్నికల కౌంటింగ్లో తెలుగుదేశం పార్టీ విజయపథంలో దూసుకుపోతోంది
ఆ పసివాడికి చట్టాలు తెలియవు.. నిబంధనలు అసలే తెలియవు. తెలిసిందల్లా అమ్మానాన్నల ప్రేమ మాత్రమే!
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు. ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు నగర పంచాయతీల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఎటువంటి పెద్ద అవాంతరాలు
YS Jagan Mohan Reddy, Pulivendula Elections, YS Jagan Protest, YSRCP, Bengaluru, Municipal Elections, Polling Irregularities, Andhra Pradesh Politics, YS Jagan News, Pulivendula Polling
దిల్లీలోని ప్రఖ్యాత కనాట్ ప్లేస్ ప్రాంతంలో దుకాణాలను అధికార భారతీయ జనతా పార్టీ (BJP) బలవంతంగా మూసివేయించిందని లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
పులివెందుల మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ అక్రమాలు చోటుచేసుకున్నాయని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోపించారు
ఆంధ్రప్రదేశ్లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ వేళ.. కడప జిల్లా పులివెందులలో రాజకీయ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.