కేంద్రంపై మళ్ళీ అవే విమర్శలు అయినా , ట్రాక్ తప్పింది ..

Publish Date:Jun 2, 2022

Advertisement

తెలంగాణ ముఖ్యమత్రి కేసీఆర్ మరోసారి  కేంద్ర ప్రభుతం పై కత్తులు దుశారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్స వేడుకల్లో భాగంగా, హైదరబాద్ పబ్లిక్ గార్డెన్స్ లో   నిర్వహించిన వేడుకలలో సుదీర్ఘ ప్రసంగం చేసిన ముఖ్యమత్రి, ఈ ఎనిమిదేళ్ళ కాలంలో రాష్ట్రం సాధించిన విజయాలను ఏకరవు పెట్టారు. పనిలో పనిగా, కేంద్ర ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. హెచ్చరికలు చేశారు. అయితే, ఎందుకనో ఏమో కానీ, ముఖ్యమంత్రి ప్రసంగలో, ముఖ్యంగా కేంద్రంపై విమర్శల విషయంలో కొంత పదును తగ్గిందని, ముఖ్యమత్రి ప్రసంగాన్ని ప్రత్యక్షంగా విన్న పార్టీ నాయకులు కొందరు చెవులు కోరుకుంటున్నారు.

నిజానికి, ముఖ్యమంత్రి ప్రసంగాన్ని, మొదటి నుంచి చివరి వరకు వింటే, కేంద్రంపై విమర్శల భాగం, ఒక విధంగా అతికించినట్లు ఉందని పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు చెప్పు కొచ్చారు. నిజానికి, ముఖ్యమంత్రి ప్రసంగంలో ఈ ఎనిమిదేళ్ళలో రాష్ట్రం సాధించిన ప్రగతిని మాత్రమే ప్రస్తావించాలని, విమర్శల అంశాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టాలని భావించారు. అయితే, రాత్రికి రాత్రి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కేంద్రం పై విమర్శలను చేర్చారని  విశ్వసనీయ వర్గాల సమాచారం. అందుకే, లవ్ స్టోరీలో సెపరేట్ కామెడీ ట్రాక్ లాగా, ప్రధాన ఉపన్యాసంతో సంబంధం లేకుండా, చివర్లో విమర్శల స్పీచ్’ నడిచిందని అంటున్నారు. 

అయితే, ముందు విమర్శలు వద్దని ఎందుకు అనుకున్నారు, చివర్లో విమర్శలను ఎందుకు అతికించారు, అంటే అందుకు సంబంధించి విభిన్న కథనాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ దూకుడును తగ్గించేందుకు, గత కొంత కాలంగా ముఖ్యమంత్రి కేసీఆర్, తెరాస నాయకులు వ్యూహాత్మకంగా కేంద్రం బుజాన తుపాకి పెట్టి రాష్ట్రంలో బీజేపీని లేపే ప్రయత్నం చేశారు. అయితే, నువ్వొకందుకు పోస్తే, నేనొకందుకు తాగుతున్నాను అన్నట్లుగా, బీజేపీ రాష్ట్రంలో ఏకు మేకై కూర్చొంది. మరో వంక తాజాగా నిర్వహించిన సర్వేలో, ఇప్పటికీ ఎడ్జి, తెరాసకే ఉన్నా, బీజీపీ30 ప్లస్ స్థానలో సెకండ్ ప్లేస్’లో నిలుస్తోంది.

దీంతో, కేసీఆర్ కాంగ్రెస్ ను బలహీన పరిచి, తప్పుచేశామనే విషయాన్ని కొంత ఆలస్యంగా తెలుసు కున్నారు. అందుకే, ఇక బీజేపీ మైలేజిని పెంచే విమర్శలు తగ్గించాలనే నిర్ణయానికి వచ్చారు. అందుకే, రాష్ట్ర అవతరణ దినోత్సవం ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు వద్దని కేసీఆర్ నిర్ణయించారు. అందుకు అనుగుణంగానే, స్పీచ్ కాపీ తయరైంది. 

అయితే, నిన్న (బుధవారం) కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ‘ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)’ నోటీసులు జారీ చేయడం, అందుకు ఒక రోజు ముందు ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్’ ను ఈడీ అరెస్ట్ చేయడం, మొన్న కశ్మీరులో ఫరూక్‌ అబ్దుల్లాను ఈడీ ప్రశ్నించడం.. కర్ణాటకలో డీకే శివకుమార్‌ అరెస్టు.. నెక్స్ట్ టార్గెట్ తెరాస నాయకులే అన్నవదంతులు వినవస్తున్న నేపధ్యంలో ఇంతవరకు కేంద్రం పై విమర్శలు చేసి, ఇప్పుడు సైలెంట్ అయిపోతే,  జనంలోకి తప్పుడు సంకేతాలు వెళ్ళే ప్రమాదం ఉందని, భావించడం వల్లనే, ఆఖరి క్షణంలో, విమర్శల చాప్టర్ చేర్చారని అంటున్నారు.

అయితే, ముఖ్యమంత్రి చేసిన విమర్శలలో   కొత్తదనం ఏమీ లేదని, గత కొంత కాలంగా చేస్తున్న ఆరోపణలనే మళ్ళీ వినిపించారని పరిశీలకులు అంటున్నారు. నిజమే, కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల తెలంగాణ అనేక రకాలుగా నష్టపోయిందని  ముఖ్యమంత్రి, ఇతర తెరాస మంత్రులు గత కొన్ని రోజులుగా ఆరోపిస్తూనే ఉన్నారు. ఇప్పడు ముఖ్యమంత్రి అదే ఆరోపణ చేశారు. కొత్త రాష్ట్రానికి అదనపు నిధులు ఇవ్వాలని అనేక సార్లు ప్రధానిని అడిగినా ఫలితం లేదని అన్నారు. రాష్ట్రానికి రావాల్సిన న్యాయ పరమైన నిధులపై కేంద్రం కోత విధించిందని విమర్శించారు.  ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం దారుణంగా విఫలం అయిందన్నారు.

రైతాంగ సమస్యలపై కేంద్ర మంత్రులు హేళనగా మాట్లాడారని చెప్పారు. దేశంలో రైతులు బిక్షగాళ్ళు కాదని... రైతులతో పెట్టుకోవద్దని కేసీఆర్ మరోసారి కేంద్రాన్ని  హెచ్చరించారు.నిజానికి ఇవేవీ కూడా ఇప్పుడే కొత్తగా చేసిన ఆరోపణలు కాదు. అయితే భాషలో మాత్రం కొంత మార్పు కనిపించిందని అంటున్నారు. అయితే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఇప్పటికే పతాక స్థాయికి చేరిన యుద్ధం ఇక ముందు కూడా ఇలాగే సాగుతుందా.. కొంచెం ఆలస్యంగానే అయినా తత్త్వం బోధపడుతుందా, అనేది చూడవలసి ఉందని పరిశీలకులు అంటున్నారు.

By
en-us Political News

  
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్‌ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.