చేతివృత్తుల్లో సృజనాత్మకతను కనబరుస్తూ సమాజాభివృద్ధికి వెన్నెముకగా ఉన్న బీసీ వర్గాల పిల్లలు చదువులతో పాటు సాంస్కృతిక కళా వారసత్వంలో తమ ప్రతిభను చాటుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హాస్టల్ విద్యార్థులకు నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరంలో లలిత కళల్లో మంచి ప్రావీణ్యం సాధించారు. స్వల్పకాలం శిక్షణలోనే వారు త కళాకారులుగా సత్తా చాటారు. సాంస్కృతి కార్యక్రమాలతో పాటు అనంతవిశ్వంపై ఆసక్తిని కనబరిచారు.
గత కొన్ని రోజులుగా జిల్లా స్థాయిలో నిర్వహించిన నృత్య పోటీల్లో ఎంపికైన వారితో రాష్ట్ర రాజధానిలోని రవీంద్రభారతిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో విద్యార్థుల ప్రదర్శన ప్రముఖ నృత్య గురువులైన న్యాయనిర్జేతలే ఔరా అనేలా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బిసి హాస్టల్స్ నుంచి ఎంపిక చేసిన మూడు వందల మంది విద్యార్థులు 45 బృందాలుగా ఏర్పడి నృత్య ప్రదర్శనలతో అలరించారు. నాగర్ కర్నూలు జిల్లా విద్యార్థులు ప్రదర్శించిన భారత్ మాతాకి జై నృత్యం ప్రధమ బహుమతి అందుకోగా, కామారెడ్డి జిల్లా విద్యార్థులు ప్రదర్శించిన అల్లా నేరేల్లో రెండవ బహుమతి, మెదక్ జిల్లా విద్యార్ధులు ప్రదర్శించిన తూరుపు కొండల్లో నృత్య ప్రదర్శన మూడో బహుమతి అందుకుంది.
సాహిత్యాన్ని, కళలను రేపటి తరానికి అందించాలంటే ఈ తరం పిల్లలకు వాటిని చేరువ చేయాలని, అందులో భాగంగానే బిసి హాస్టల్ విద్యార్థులకు గతంలో ఎన్నడూ లేని విధంగా కళల్లో శిక్షణ ఇచ్చామని బిసి వెల్పేర్ డిపార్ట్ మెంట్ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం అన్నారు.
చిన్నారుల్లో దాగిన ప్రతిభను గుర్తించి తగిన శిక్షణ ఇస్తే అంతరీక్షంలోకైనా వెళ్లతారని ఆకాంక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, బిసి సంక్షేమ శాఖ మంత్రి ప్రోత్సాహంతో రానున్న ఐదేళ్ల కాలంలో బిసి విద్యార్థులను శాస్రవేత్తలుగా రోదసీ లక్ష్యంగా తీర్చిదిద్దుతామని ఆయన అన్నారు. బిసి విద్యార్థుల నుంచి పదిమందిని ఇస్రోకు, మరో పదిమందిని నాసాకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తామన్నారు.
విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీయడం ద్వారా వారిని అత్యున్నత స్థాయికి చేర్చవచ్చని అంతరిక్ష శాస్త్రవేత్త, ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎన్. రఘునందన్ అన్నారు. విశ్వంలోని వింతల గురించి ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bc-students-cultural-programme-superb-25-136899.html
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్