కేసీఆర్ కుటుంబ అవినీతి అక్షరాలా 9లక్షల కోట్ల రూపాయలు.. సీబీఐకి కేఏ పాల్ ఫిర్యాదు

Publish Date:Jun 24, 2022

Advertisement

కేఏ పాల్ .. తెలుగు రాష్ట్రాలలో ఇది పరిచయం అక్కర్లేని పాల్. గత ఎన్నికలలో ఏపీలో హడావుడి చేసిన పాల్.. ఈ సారి తెలంగాణలో తన హంగామా చూపుతున్నారు. తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లంటారు. ఆయన మాటను ఎవరూ కాదనరు. ఎందుకంటే అసలు ఆయన మాటలను ఎవరూ పట్టించుకోనే  కోరు కనుక. వరుస పెట్టి అందర్నీ ఆయన కలిసేస్తూ ఉంటారు. అమిత్ షా అయినా, కేసీఆర్ అయినా, జగన్ అయినా ఇలా ఎవరైనా సరే ఆయన కలుస్తానంటే వద్దని అనరు ఎందుకొచ్చిన గొడవ ఆయన చెప్పేదేదో చెప్పనిచ్చి పంపిస్తే పోలా  అనుకుంటారు.   ఇప్పుడు ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతి భరతం పడతానంటున్నారు. అని ఊరుకోలేదు.  కేసీఆర్ కుటుంబం అవినీతిపై  సీబీఐకి  ఫిర్యాదు చేశారు.  సీబీఐ కార్యాలయానికి వెళ్లి సీబీఐ డైరెక్టర్  సుభోద్ కుమార్ జైశ్వాల్ కు కేసీఆర్ అవినీతిపై ఫిర్యాదు చేశారు. కేసీఆర్ ఆయన కుటుంబం ఏకంగా 9 లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందనీ, ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి, ఇంతటి అవినీతిని తాను చూడలేదనీ ఆయనా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎందుకంటే కేఏ పాల్ ప్రపంచం చుట్టి వచ్చిన వీరుడు కదా. ఎక్కడా కనని, వినని అవినీతి తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం పాల్పడిందని, వెంటనే విచారణ జరిపించాలన్నది ఆయన ఫిర్యాదు సారాంశం. ఇది తన ఒక్కడి మాటే కాదనీ యావత్ తెలంగాణ ప్రజ  కేసీఆర్, ఆయన కుటుంబం పాల్పడిన అవినీతిపై విచారణ జరగాలని కోరుకుంటోందని ఫిర్యాదులో పేర్కొన్నారు.  

రాష్ట్ర విభజనతో 60వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ తో ఆవిర్భవించిన తెలంగాణ కేసీఆర్ ఎనిమిదేళ్ల పాలనలో నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందన్నారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి కేసీఆర్ కుటుంబ అవినీతికి ఆకాశమే హద్దు అన్నట్లుగా చెలరేగిపోయిందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతే కాకుండా తెలంగాణ సహా సింగపూర్ దుబాయ్, అమెరికాలలో కూడా ఆ కుటుంబం ఆస్తులు కూడబెట్టిందని పాల్ ఫిర్యాదులో పేర్కొన్నారు.

 కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా బడ్జెట్ లక్షా 5వేల కోట్ల రూపాయలైతే కేవలం 35 వేల కోట్ల రూపాయలే ఖర్చు చేశారని, ఏకంగా కాళేశ్వరం ప్రాజెక్టు పేరు చెప్పి 75 వేల కోట్ల రూపాయలు దోచుకున్నారనీ ఫిర్యాదులో పేర్కొన్నారు. యాదాద్రి విషయంలోనూ అంతులేని అవినీతికి పాల్పడ్డారని సమగ్ర విచారణ జరిపితే అన్నీ బయటకు వస్తాయనీ పాల్ సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఆయన మాటలు ఎవరు నమ్మినా నమ్మకపోయినా.. కేంద్ర దర్యాప్తు సంస్థకు ఫిర్యాదు చేశారు కనుక ఆ సంస్థ దర్యాప్తు ప్రారంభిస్తుందా.. లేక  రాజకీయ విదూషకుడి చర్యగా నవ్వుకుని వదిలేస్తుందా అన్నది చూడాలి. సీబీఐ ఏ దర్యాప్తునూ తనంత తానుగా చేపట్టదు కనుక పాల్ ఇచ్చిన ఫిర్యాదుపై సీబీఐ దర్యాప్తునకు కదులుతుందని భావించలేం.

వార్తల్లో నిలవడానికి ఇదో మార్గంగా ఎంచుకుని పాల్ సీబీఐ ఫిర్యాదు అంటూ  హడావుడి చేశారని పరిశీలకులు అంటున్నారు. అయితే కేసీఆర్ కుటుంబ అవినీతిపై దర్యాప్తునకు తాను పూర్తి సహకారం అందిస్తాననీ పాల్ సీబీఐకి హామీ ఇచ్చారు. కేసీఆర్ అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే తెలంగాణలో తనపై దాడులు జరుగుతున్నాయని పాల్ ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఫిర్యాదు కాపీలను కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సైతం పంపారు. 

By
en-us Political News

  
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
మైగ్రేన్ తలనొప్పితో ఆసుపత్రికి వెళ్లిన బెక్కీ జోన్స్‌కు బ్రెయిన్ క్యాన్సర్ ఉందంటూ 11 ఏళ్ల పాటు కీమోథెరపీ ఇచ్చారు. కానీ చివరికి అసలు క్యాన్సరే లేదని తెలిసిన షాకింగ్ వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.