Publish Date:Apr 24, 2022
కల్వకుంట్ల చంద్రశేఖరరావు...బీజేపై పోరాటంలో తానే చాంపియన్ అని రుజువు చేసుకుని బీజేపీ యేతర కూటమికి సారథ్యం వహించాలని కలలు కంటున్నారు. అయితే కాంగ్రెసేతర బీజేపీ యేతర కూటమి పట్ల ఇరత పార్టీలేవీ అంత సుముఖంగా లేకపోవడంతో ఆయన బాటలో ఒక అడుగు ముందుకు మూడడుగులు వెనక్కు అన్నట్లుగా సాగుతున్నారు.
ఎవరూ కలిసి రావడం లేదన్న నిర్వేదంతో ఒకో సారి ఆయన ఫ్రంటూ లేదు గింటూ లేదంటూ నిర్వేదం ప్రదర్శించినా...ఏ మూలో ఆయనకు మోడీని దీటుగా ఎదుర్కొనే నేత తానేనన్న విశ్వసం ఇంకా తొలగిపోలేదు.
అయితే మోడీని బలంగా ఢీ కొనాలన్న ఆత్రంతో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, చర్యలు అంతిమంగా రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కావడానికే దోహదపడుతుండటం గమనర్హం.
ఒక విధంగా చెప్పాలంటే...తెలంగాణలో సొంత బలం చాలా పరిమితంగా ఉండే బీజేపీ ఈ రోజున ఈ స్థితిలో ఉందంటే అది కచ్చితంగా కేసీఆర్ పుణ్యమే.
బండి సంజయ్ ఒక రోజు దీక్ష భగ్నం నుంచి తీసుకుంటే...ఆయన రాష్ట్రంలో కమలం పార్టీని నిలువరిస్తున్నానన్న పేరుతో చేసిన ప్రయత్నం, చేపట్టిన ప్రతీ చర్యా ఆ పార్టీకి బలం చేకూరడానికే దోహదపడింది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఒక రోజు దీక్ష భగ్నం కోసం పోలీసుల ప్రయోగం...ఆ పార్టీ పట్ల సానుభూతి పెరగడానికే దోహదపడింది. ఆయన అధికార కార్యాలయం గేట్లను గ్యాస్ కట్టర్ తో తొలగించి మరీ పోలీసులు లోనికి వెళ్లి అరెస్టు చేశారు. ఇది ఆశించిన దానికి ప్రతి కూల ఫలితమే ఇచ్చింది. అలాగే రైతులను పరామర్శించడానికి బండి సంజయ్ వెళ్లిన సందర్భంగా టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు.
ఒక వైపు రాష్ట్రంలో బీజేపీ చేపట్టిన ఏ నిరసన కార్యక్రమం సజావుగా సాగేందుకు వీలు లేకుండా అడ్డంకులు కల్పిస్తూ, అనుమతులు నిరాకరిస్తూ వస్తున్న ప్రభుత్వం..అదే అధికార పార్టీ కేంద్ర నిర్ణయాలకు వ్యతిరేకంగా చేపట్టిన ప్రతి కార్యక్రమం విజయవంతంగా, ఇంకా చెప్పాలంటే యథేచ్ఛగా చేసుకోవడానికి దార్లు బార్లా తెరిచిన పరిస్థితి.
ఈ పరిస్థితే రాష్ట్రంలో ప్రజాస్వామ్య బద్ధంగా ఆందోళనలు చేసుకునే హక్కు, నిరసనలు తెలిపే హక్కు విపక్షాలకు లేదా అన్న సందేహం జనంలో కలగేలా చేసింది.
అదే విధంగా ధాన్యం కొనుగోలు విషయాన్ని విపరీతమైన రాద్దాంతం చేసి రైతుల్లోనూ బిజెపికి విస్తృత ప్రచారం కలిగేందుకు కేసీఆర్ తీరు దోహదపడింది. అదే సమయంలో ఇలా వచ్చిన ప్రతి అవకాశాన్ని బిజెపి సద్వినియోగం చేసుకుని.. తెలంగాణలో క్రమంగా బలపడుతోంది. కేసీఆర్ బిజెపి అణచివేసేందుకు అధికార బలాన్ని ప్రయోగిస్తున్నారంటే కమలం పార్టీ ప్రజలలో ప్రచారం చేసుకుంటోంది. ఆ అవకాశాన్ని స్వయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ పార్టీ అధినేత తమ చర్యలతో పువ్వుల్లో పెట్టి కమలానికి అందించారు. నిన్న మొన్నటి వరకూ బీజేపీ పట్ల సానుకూల ధోరణితో వ్యవహరించిన కేసీఆర్ ఒక్క సారిగా ఇంత వ్యతిరేకత ప్రదర్శించడం వెనుక ఏదైనా రాజకీయ కోణం దాగి ఉందా? రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రాబల్యాన్ని తగ్గించేందుకు ప్రణాళికా బద్ధంగా బీజేపీ బలోపేతం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kcr-deeds-to-control-bjp-became-plus-to-bjp-39-134871.html
న్ని ఎన్నికలలో విచిత్రాలు జరగవు. ప్రతిసారీ ఒకటే జరిగితే, దాన్ని విచిత్రం అనరు కదా? ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాకముందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటి పలుకు వినపడుతున్నది. కొందరు ప్రముఖులు పక్కదారులు చూస్తున్నారని, పక్క పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని కూడా వినపడుతున్నది.
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పంథాను మార్చుకోలేదనేది స్పష్టమవుతోంది. ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల మంత్రం జపించిన జగన్.. ఇప్పుడు మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపి ఒక మెగా సిటీగా మార్చాలనే సరికొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.
మూడు రాజధానుల అంశం గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలలో ఒకటి అన్న విషయాన్ని విస్మరించి.. మళ్ళీ అదే తరహా ప్రత్యామ్నాయ వాదనలు వినిపించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది. పార్టీ కేడర్ సైతం మావిగన్ ఏంటి అదేదో పంటకు పట్టే తెగుల్లా ఉందని నెత్తీ నోరూ బాదుకుంటోంది.
ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై చెయ్యి చేసుకున్నారని పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున కృతజ్ణతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే... తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. మాకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ సంస్కృతి ఒక పెను సవాలుగా మారింది. ఇటీవలి కాలంలో రాజకీయ నాయకులు, ప్రముఖుల పేర్లు డ్రగ్స్ కేసుల్లో వినిపిస్తుండటం సమాజంలో తీవ్రసంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వాస్తవ వేదిక చర్చలో డోలేంద్ర ప్రసాద్, కంఠంనేని రవిశంకర్ లు ఇది కేవలం శాంతిభద్రతల సమస్య మాత్రమే కాదనీ, సమాజ భవిష్యత్తుకు పెనుముప్పుగా పరిణమించిన ఒక సామాజిక రుగ్మత అని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో విజయ్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే జననాయగన్ సినీమా విడుదలపై నెలకొన్న అనిశ్చితిని ఆయన ప్రజల ముందు ఉంచారు. అలాగే.. కరూర్ ప్రాంతంలో చోటుచేసుకున్న విషాద ఘటనను ప్రస్తావిస్తూ.. అది యాధృచ్ఛికంగా జరిగింది కాదని, దాని వెనుక కూడా లోతైన కుట్ర దాగి ఉందన్న అనుమానాలున్నాయన్నారు.
నిజానికి తాను రాజకీయ సన్యాసం చేసినట్టు చెబుతూనే ఉన్నా.. ఇప్పటికీ ఆయన తన టీం ద్వారా అకౌంట్ సర్వీసెస్ అందిస్తూనే ఉన్నారు. ఆపై జగన్ కి లోపాయికారిగా సహకరించేందుకే ఈ రాజీనామా డ్రామాలని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బేసిగ్గా విజయసాయిరెడ్డి కామెంట్ చేయాల్సింది ఏదైనా ఉందంటే.. ఇటీవల జగన్ అర్ధంపర్దం లేకుండా చేసిన మావిగన్ అనే ప్రతిపాదన మీదే. కానీ రేణుక చౌదరి సభలో లేవనెత్తిన కమ్మరావతిని పట్టుకుని.. పోస్టులు పెట్టడం సరికాదంటున్నారు.
రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, టీఎంసీ, ఆప్, బీజేడీ, ఆర్జేడీ, బీఆర్ఎస్, జేడీ(యూ), శివసేన మద్దతు ఇచ్చాయి. రాజ్యసభలో అమరావతి చట్టబద్ధతపై జరిగిన చర్చలో 11 పార్టీలు పాల్గొన్నాయి.
గురువారం సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇక 2015లో దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన పవిత్ర జలాలు, మట్టిని ఉంచిన ఉద్దండరాయునిపాలెంలో పర్యటించి, రాజధాని సంకల్పంలో పాల్గొన్నారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును రాజ్యసభలో సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఏపీ రాజధాని విషయంలో ఉన్న చట్టపరమైన అస్పష్టతను తొలగించేందుకు ఈ సవరణ అత్యవసరమని పేర్కొన్నారు. బిల్లుపై జరిగిన చర్చ అనంతరం, సభాపతి సి.పి. రాధాకృష్ణన్ క్లాజ్ వారీగా ఓటింగ్ నిర్వహించగా సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి రాజ్యసభ ఆమోదం లభించింది.
. తాము అమరావతిని వ్యతిరేకించడం లేదనీ, అయితే రాజధాని పేరుతో సాగుతున్న పరిణామాలు, ఆర్థిక భారాలనే ప్రశ్నిస్తున్నామన్నారు. రైతుల నుంచి భూములు సేకరించి ఇన్నాళ్లు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని ఆయన విమర్శించారు.
అమరావతికి చట్టబద్ధత అమరావతి రైతుల నైతిక విజయంగా అభివర్ణించారు. సుదీర్ఘకాలం పాటు మొక్కవోని దీక్షతో రైతులు చేసిన పోరాటం వల్లే ఇది సాధ్యమైందన్నారు.
రాజధాని ఉద్యమ సమయంలో పాలకులు ప్రయోగించిన అణచివేత చర్యలను ఈ సందర్భంగా రేణుకా చౌదరి గుర్తు చేశారు.