Publish Date:Apr 24, 2022
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పీకే విషయంలో తన సహజ స్వభావానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనిపిస్తున్నది. రాష్ట్రంలో తెరాసను మరోసారి అధికారంలోనికి తీసుకు రావడానికి కేసీఆర్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో మంతనాలు జరిపారు. ప్రశాంత్ కిషోర్ బృందం రాష్ట్రంలో చేసిన సర్వేలను బట్టే తను ముందడుగు వేయాలని నిర్ణయించుకున్నారు. ఆ దిశగా కొంత ట్రావెల్ కూడా ఇరువురి మధ్యా జరిగింది. కేసీఆర్ ఫామ్ హౌస్ లో పీకే, కేసీఆర్ రెండు మూడు సార్లు భేటీ అయ్యారన్న వార్తలు కూడా విశ్వసనీయంగా వినవచ్చాయి.
ఇంత దాకా బానే ఉంది...కానీ పీకే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కు చేరువ అయ్యారు. కేంద్రంలో కాంగ్రెస్ ను అధికారంలోనికి తీసుకురావడమే ధ్యేయంగా పని చేయడానికి ఉద్యుక్తుడయ్యారు. ఇక్కడ రాష్ట్రంలో తెరాస కు పని చేస్తూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ను మరింత బలహీనం చేయాలన్న కేసీఆర్ వ్యూహాలను అనుగుణంగా పని చేస్తారా? ఒక వేళ అలా చేసేందుకు ఆయన సిద్ధమైనా కేసీఆర్ అందుకు అంగీకరిస్తారనీ, పీకేతో కలసి ముందుకు నడుస్తారనీ ఆయన నైజం తెలిసిన వారెవరూ నమ్మరు. కానీ కేసీఆర్ తన సహజ సిద్ధ స్వభావానికి విరుద్ధంగా శనివారం పీకేతో భేటీ అయ్యారు. ఆయన బృందం సర్వేలపై కూలంకషంగా చర్చించారు. ఈ సారి ఫామ్ హౌస్ లో కాకుండా తన అధికార నివాసం ప్రగతి భవన్ లోనే పీకే- కేసీఆర్ భేటీ జరిగింది. రాష్ట్రంలో తెరాస మరింత బలోపేతం కావాలంటే ఏం చేయాలన్నదానిపై పీకే కేసీఆర్ కు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. సర్వే నివేదికలు సమర్పించారు. ఒక వైపు హస్తినలో కాంగ్రెస్ అగ్రనేతలతో కలిసి పని చేస్తూ తెలంగాణ దగ్గరకు వచ్చే సరికి తెరాసతో కలిసి పని చేస్తానంటూ పీకే ముందుకు వచ్చినా కేసీఆర్ ఆయనను ఎలా దరి చేరనిస్తున్నారన్న విషయంలో తెరాస శ్రేణులనే ఆశ్చర్య పరుస్తున్నది. కాంగ్రెస్ ను కేంద్రంలో అధికార పీఠంపై కూర్చో పెట్టడమే లక్ష్యంగా దేశ వ్యాప్తంగా తిరిగి పని చేస్తానంటూ స్పష్టంగా ప్రకటించిన పీకే...తెలంగాణలో మాత్రం తెరాస కోసం పని చేస్తానంటే కేసీఆర్ ఎందుకు నమ్మారు. ఎందుకు అంగీకరించారు? అన్న ప్రశ్నలకు బదులు లభించక తెరాస శ్రేణులే తలలు బద్దలు కొట్టుకుంటున్నాయి. ఎందుకంటే కేంద్రంలో కాంగ్రెస్ ను అధికారంలోనికి తీసుకురావాలంటే రాష్ట్రాలలో కాంగ్రెస్ ను బలోపేతం చేయాలి. ఆ వ్యూహంతో ముందుకు సాగేతున్న పీకే తెలంగాణలో మాత్రం అందుకు భిన్నమైన వ్యూహాన్ని ఎలా అమలు చేస్తారు? ఒక వేళ ఆయన చెబుతున్నా..ఒక రాజకీయ పార్టీ అధినేతగా. ప్రత్యర్థి పార్టీ తరఫున పని చేస్తున్న వ్యక్తిని ఎలా చేరతీస్తారు? పరిశీలకులు మాత్రం కేసీఆర్ పూర్తిగా పీకే మాయలో పడిపోయారని విశ్లేషిస్తున్నారు. ఎంత ముందుగా చేసుకున్న ఒప్పందమైనా....ఆ తరువాత కాంగ్రెస్ తో జట్టుకట్టిన తరువాతైనా పీకేను కేసీఆర్ దూరం పెట్టి ఉండాల్సింది.
అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవలసినదేమిటంటే...తెలంగాణ రాష్ట్రంలో విజయాలకు దూరంగా ఉన్నప్పటికీ ఇప్పటికీ కాంగ్రెస్ బలీయమైన శక్తే. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కు గట్టి పట్టు ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ కూడా ఒకటి. అటువంటి రాష్ట్రంలో పీకే కాంగ్రెస్ ను బలహీనపరి చే వ్యూహాలు రచిస్తారంటే ఎవరైనా సరే నమ్మడానికి సందేహిస్తారు. అలాంటిది రాజకీయ దురంధరుడిగా పేరొందిన కేసీఆర్ మాత్రం పూర్తిగా నమ్మేసినట్లు కనిపిస్తున్నారు.
అయితే బీజేపీని అధికారం నుంచి దూరంగా ఉంచే వ్యూహంలో భాగంగానే కేసీఆర్, పీకే జట్టు కట్టారన్న వాదన కూడా వినిపిస్తున్నది. ఏది ఏమైనా ప్రశాంత్ కిశోర్ అటు కాంగ్రెస్ కు, ఇటు తెరాసకు పని చేస్తారంటే తెలంగాణలో మాత్రం కాంగ్రెస్, తెరాసలు రెండూ వ్యతిరేకిస్తున్నాయి. అయినా పార్టీల అధిష్టానాల ఆదేశాలను ధిక్కరించడం వీలు కాదు కనుక జరుగుతున్న రాజకీయ తంతును, లేదా తంత్రాన్ని మౌనంగా గమనిస్తున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kcr-39-134874.html
రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారాయి.
న్ని ఎన్నికలలో విచిత్రాలు జరగవు. ప్రతిసారీ ఒకటే జరిగితే, దాన్ని విచిత్రం అనరు కదా? ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాకముందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటి పలుకు వినపడుతున్నది. కొందరు ప్రముఖులు పక్కదారులు చూస్తున్నారని, పక్క పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని కూడా వినపడుతున్నది.
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పంథాను మార్చుకోలేదనేది స్పష్టమవుతోంది. ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల మంత్రం జపించిన జగన్.. ఇప్పుడు మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపి ఒక మెగా సిటీగా మార్చాలనే సరికొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.
మూడు రాజధానుల అంశం గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలలో ఒకటి అన్న విషయాన్ని విస్మరించి.. మళ్ళీ అదే తరహా ప్రత్యామ్నాయ వాదనలు వినిపించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది. పార్టీ కేడర్ సైతం మావిగన్ ఏంటి అదేదో పంటకు పట్టే తెగుల్లా ఉందని నెత్తీ నోరూ బాదుకుంటోంది.
ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై చెయ్యి చేసుకున్నారని పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున కృతజ్ణతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే... తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. మాకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ సంస్కృతి ఒక పెను సవాలుగా మారింది. ఇటీవలి కాలంలో రాజకీయ నాయకులు, ప్రముఖుల పేర్లు డ్రగ్స్ కేసుల్లో వినిపిస్తుండటం సమాజంలో తీవ్రసంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వాస్తవ వేదిక చర్చలో డోలేంద్ర ప్రసాద్, కంఠంనేని రవిశంకర్ లు ఇది కేవలం శాంతిభద్రతల సమస్య మాత్రమే కాదనీ, సమాజ భవిష్యత్తుకు పెనుముప్పుగా పరిణమించిన ఒక సామాజిక రుగ్మత అని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో విజయ్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే జననాయగన్ సినీమా విడుదలపై నెలకొన్న అనిశ్చితిని ఆయన ప్రజల ముందు ఉంచారు. అలాగే.. కరూర్ ప్రాంతంలో చోటుచేసుకున్న విషాద ఘటనను ప్రస్తావిస్తూ.. అది యాధృచ్ఛికంగా జరిగింది కాదని, దాని వెనుక కూడా లోతైన కుట్ర దాగి ఉందన్న అనుమానాలున్నాయన్నారు.
నిజానికి తాను రాజకీయ సన్యాసం చేసినట్టు చెబుతూనే ఉన్నా.. ఇప్పటికీ ఆయన తన టీం ద్వారా అకౌంట్ సర్వీసెస్ అందిస్తూనే ఉన్నారు. ఆపై జగన్ కి లోపాయికారిగా సహకరించేందుకే ఈ రాజీనామా డ్రామాలని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బేసిగ్గా విజయసాయిరెడ్డి కామెంట్ చేయాల్సింది ఏదైనా ఉందంటే.. ఇటీవల జగన్ అర్ధంపర్దం లేకుండా చేసిన మావిగన్ అనే ప్రతిపాదన మీదే. కానీ రేణుక చౌదరి సభలో లేవనెత్తిన కమ్మరావతిని పట్టుకుని.. పోస్టులు పెట్టడం సరికాదంటున్నారు.
రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, టీఎంసీ, ఆప్, బీజేడీ, ఆర్జేడీ, బీఆర్ఎస్, జేడీ(యూ), శివసేన మద్దతు ఇచ్చాయి. రాజ్యసభలో అమరావతి చట్టబద్ధతపై జరిగిన చర్చలో 11 పార్టీలు పాల్గొన్నాయి.
గురువారం సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇక 2015లో దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన పవిత్ర జలాలు, మట్టిని ఉంచిన ఉద్దండరాయునిపాలెంలో పర్యటించి, రాజధాని సంకల్పంలో పాల్గొన్నారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును రాజ్యసభలో సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఏపీ రాజధాని విషయంలో ఉన్న చట్టపరమైన అస్పష్టతను తొలగించేందుకు ఈ సవరణ అత్యవసరమని పేర్కొన్నారు. బిల్లుపై జరిగిన చర్చ అనంతరం, సభాపతి సి.పి. రాధాకృష్ణన్ క్లాజ్ వారీగా ఓటింగ్ నిర్వహించగా సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి రాజ్యసభ ఆమోదం లభించింది.
. తాము అమరావతిని వ్యతిరేకించడం లేదనీ, అయితే రాజధాని పేరుతో సాగుతున్న పరిణామాలు, ఆర్థిక భారాలనే ప్రశ్నిస్తున్నామన్నారు. రైతుల నుంచి భూములు సేకరించి ఇన్నాళ్లు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని ఆయన విమర్శించారు.