జగన్ వైఫల్యంపై కేసీఆర్ చురకలు

Publish Date:Jun 23, 2023

Advertisement

తెలంగాణలో ఎకరం అమ్మితే ఇప్పుడు ఆంధ్రాలో యాభై ఎకరాలు కొనొచ్చు. ఇదీ తెలంగాణ సాధించిన ప్రగతి. సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్రాలో ఎకరం కొనాలంటే తెలంగాణలో పది ఎకరాలు అమ్మాల్సిందేనని అన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి తారుమారైంది. ఈ విషయాన్నీ చంద్రబాబునాయుడే చెప్పారు.

మనం ఏం సాధించామో ఇంతకంటే ఆధారాలు కావాలా?.  పటాన్ చెరులో ఎకరం కొనాలంటే రూ.మూడు కోట్లు కావాలి.  ఇవీ పటాన్ చెరులో రూ.143 కోట్ల వ్యయంతో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం కోసం భూమి పూజ చేసిన సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు. గతంలో కూడా మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ లాంటి వాళ్ళు కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేయగా.. ఇప్పుడు సాక్షాత్తు సీఎం కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేయడం.. అది కూడా ఆనాడు చంద్రబాబు ఇలా అన్నారని గుర్తు చేయడంతో ఇది మరోసారి హాట్ టాపిక్ గా మారింది.

సీఎం కేసీఆర్ తెలంగాణ అభివృద్ధి సూచికగా ఈ వ్యాఖ్యలు చేసినా.. అది ఇప్పటి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చురకలే. ఎందుకంటే గతంలో ఆంధ్రా, తెలంగాణ మధ్య ఉన్న వ్యత్యాసం తారుమారైందంటే.. తెలంగాణ ప్రభుత్వం ఎంత సక్సెస్ అయిందని చెప్పుకుంటున్నారో.. ఆంధ్రా ప్రభుత్వం అంత ఫెయిల్ అయినట్లేనని చెప్పినట్లే అవుతుంది. అంతెందుకు రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వ హయంలో ఏపీలో భూముల ధరలకు ఎక్కడలేని రెక్కలొచ్చాయి.

అమరావతి ప్రాంతమైన కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాల నుండి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో రియల్ ఎస్టేట్ మూడు వెంచర్లు, ఆరు ప్లాట్లు అన్నట్లుగా బూమ్ లోకి వచ్చింది. ఆ సమయంలో హైదరాబాద్ మహా నగరంలో పెట్టుబడులు పెట్టాలని అనుకున్న వాళ్ళు కూడా.. ఏపీ వైపు వచ్చేశారు. టీడీపీ హయం ఐదేళ్లలో ఏపీ రియల్ ఎస్టేట్ లో ఇదే జోరు, జోష్ కనిపించింది.

కానీ, ఏపీలో ప్రభుత్వం మారి వైసీపీ అధికారంలోకి వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. విజయవాడ, గుంటూరు, విశాఖ లాంటి నగరాలతో పాటు రాజధాని అమరావతిలో సైతం ఎలాంటి అభివృద్ధి లేక రియల్స్ ఎస్టేట్ ఢమాల్ మంది. జగన్ ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజుల నుండే రాష్ట్రంలో ఇసుక కొరత, ఇసుకపై విధించిన ఆంక్షలు, రియల్ ఎస్టేట్ లో వైసీపీ నేతల ఆగడాలు, అయోమయమమైన చట్టాలతో నిర్మాణ పనులు ఎక్కడివక్కడ ఆగిపోయి రియల్ ఎస్టేట్ పై భారీగా ప్రభావం కనిపించింది.

ఒకవైపు అభివృద్ధి లేక మరోవైపు నిర్మాణం జరగక ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని భావించే వారంతా తెలంగాణ వైపు వెళ్లిపోయారు. ఏపీలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా దెబ్బతినడంతోనే చాలామంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు తెలంగాణ వైపు మొగ్గు చూపారన్నది ఓపెన్ టాక్. వ్యాపారస్తులను ఆకట్టుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు కలిసి తెలుగు రాష్ట్రాలలో తెలంగాణలో మాత్రమే రియల్ ఎస్టేట్ అనేలా రియల్టర్లు ఫిక్సయిపోయారు.

ఇప్పుడు సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు, అప్పుడు తెలంగాణ మంత్రులు చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తి చూపడమే  అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, గతంలో మంత్రులు ఇలాంటి కామెంట్స్ చేసిన సమయంలో ఏపీ నుండి వైసీపీ నేతలు  వారిపై మాటల దాడి చేశారు. మరి ఇప్పుడు సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై సీఎం జగన్, వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారన్నది చూడాలి.

ఇక సీఎం కేసీఆర్ సాక్షాత్తు చేసిన ఈ వ్యాఖ్యలను టీడీపీ నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. చంద్రబాబు లాంటి నాయకుడిని కాదనుకోవడం వలన రాష్ట్రానికి జరిగిన నష్టం ఇదని.. ఓ అసమర్ధుడిని ముఖ్యమంత్రి చేయడం వలన పొరుగు రాష్ట్రాలలో మనం పరువు పోతుందని.. పక్క రాష్ట్రాలు మనపై జాలి చూపిస్తున్నాయని సోషల్ మీడియాలో కామెంట్లు, పోస్టులు వైరల్ అవుతున్నాయి.

By
en-us Political News

  
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కరోనా మహమ్మారి బారినపడి కోలుకున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఇప్పటికీ లాంగ్ కొవిడ్ తీవ్ర దుష్ప్రభావాలతో సతమతమవుతున్నారు.
సంతానం కలగలేదన్న కారణంతో భార్యను తప్పుబడుతూ విడాకులు కోరలేరని మద్రాసు హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
శారీరక వైకల్యాన్ని జయించి..అమెజాన్‌లో కొలువు కొట్టిన నిట్ గ్రాడ్యుయేట్.!
వాతావరణ మార్పుల ఎఫెక్ట్: కిడ్నీ ఆరోగ్యంపై షాకింగ్ రిపోర్ట్.!
బతుకమ్మ సంబరాల నుంచి ఇంటికి వెళ్తుండగా విషాదం.!
రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధం తెలుగు రాష్ట్రాల్లో ఒక కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది.
భారత యువ క్రికెటర్ పృథ్వీ షా, నటి ఆకృతి అగర్వాల్ వ్యక్తిగత జీవితంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ గోల్ఫ్ ఎడ్జ్ అపార్ట్‌మెంట్స్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.