కొత్త రాగాలు ఆలపిస్తున్న కేసీఆర్

Publish Date:Apr 14, 2014

Advertisement

 

రాజకీయాలలో అపర చాణక్యుడని పేరుగాంచిన తెరాస అధ్యక్షుడు ఎప్పటికప్పుడు వేసే కొత్త ఎత్తులు, పన్నే సరికొత్త వ్యూహాలను పసికట్టడం ప్రత్యర్ధ పార్టీలకు కూడా సాధ్యం కాదు. ఆయన ఏ రోజు ఏమీ మాట్లాడి ఎవరి మీద ఎటువంటి బాంబులు పేలుస్తారో, ఎప్పుడు ఏ ఎత్తుగడతో ఏ దిశలో ముందుకు సాగుతారో ఎవరికీ అంతుపట్టదు. నిన్న కరీంనగర్ లో తెరాస నిర్వహించిన బహిరంగ సభలో ఎవరూ ఊహించని విధంగా ఆయన మరో సరికొత్త పల్లవి అందుకొన్నారు.

 

“తెరాస నూటికి నూరు శాతం సెక్యులర్ పార్టీ అని, అందువలన ఎట్టి పరిస్థితుల్లోనూ మతతత్వ పార్టీలతో చేతులు కలపబోమని, అదేవిధంగా బీజేపీ నేతృత్వం వహిస్తున్న ఎన్డీయే కూటమిలో కానీ, కాంగ్రెస్ నేతృత్వం వహిస్తున్న యూపీఏ కూటమిలో గానీ చేరబోమని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తమ పార్టీ థర్డ్ ఫ్రంట్ లో చేరుతుందని, ఫ్రంట్ నేతలతో ఇప్పటికే సంప్రదింపులు మొదలయ్యాయని ఆయన తెలిపారు. బీజేపీ చెప్పుకొంటున్నట్లుగా ఆ పార్టీకి కనీసం 200 సీట్లు కూడా రావని, అందువల్ల ఎన్డీయే కూటమి కేంద్రంలో అధికారంలోకి రావడం, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావడం అసంభవమని తేల్చి చెప్పేశారు. అందుకు మంచి బలమయిన కారణం కూడా ఆయనే చెప్పారు. ఈసారి ఎన్నికలలో దేశమంతటా ప్రాంతీయ పార్టీలే అధికారంలోకి వస్తాయని, అందువల్ల వారందరూ కలిసి ఏర్పాటు చేసుకొన్నా థర్డ్ ఫ్రంట్ కూటమే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం తధ్యమని” ఆయన జోస్యం చెప్పారు.

 

అయితే కొద్ది రోజుల క్రితమే, ఆయన మీడియాతో మాట్లాడుతూ తాము కాంగ్రెస్ పార్టీతో ఎన్నికల పొత్తులు పెట్టుకోకపోయినప్పటికీ, ఎన్నికల తరువాత ఆ పార్టీకి మద్దతు ఇస్తామని చెప్పారు. కానీ, ఆ తరువాత బీజేపీతో పొత్తులకు కూడా  కేసీఆర్ ప్రయత్నించారు. ఇప్పుడు వాటికి మద్దతు ఈయబోమని చెపుతున్నారు. ఇంతవరకు తమది ఉద్యమపార్టీ అని చెప్పుకొంటున్నఆయన అకస్మాత్తుగా తమ పార్టీకి సెక్యులర్ రంగు వేసుకోవడం, బీజేపీకున్న మతతత్వ ముద్ర గురించి ప్రత్యేకంగా ఇప్పుడు ప్రస్తావించడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది.

 

అయితే దేశమంతా మోడీ హవా నడుస్తున్నసంగతి కేసీఆర్ కి తెలియదని భావించలేము. అందుకే ఆయన కాంగ్రెస్ పార్టీతో కంటే బీజేపీతోనే ఎన్నికల పొత్తులకి ఆసక్తి చూపారు. కానీ బీజేపీ తమను కాదని తెదేపాతో పొత్తులు పెట్టుకోవడంతో సహజంగానే బీజేపీ శత్రువుగా మారింది. అందువల్లనే ఆయనకు ఇప్పుడు బీజేపీలో మతత్వం మరింత స్పష్టంగా కనబడుతోంది. అదేవిధంగా ఇప్పుడు తెరాస ఎన్నికలలో కాంగ్రెస్, బీజేపీలతో పోరాడుతోంది గనుకనే ఆ రెండు పార్టీలకు మద్దతు ఈయమబోమని చెపుతూ, ప్రజలను నమ్మించేందుకు ఎక్కడా కనబడని థర్డ్ ఫ్రంట్ గురించి చెపుతున్నారు. ఇక ఈ ఎన్నికలలో గెలిచేందుకు కాంగ్రెస్, తెదేపా-బీజేపీ కూటమి చాలా బలంగా ప్రయత్నిస్తున్న సంగతి అందరికీ తెలుసు. అందువల్ల ఆయన కూడా వాటిని అంతే గట్టిగా విమర్శిస్తూ ఎదిరిస్తూ మాట్లడినప్పుడే ప్రజలు తెరాసను విశ్వసించే అవకాశం ఉంది.

 

అయితే, ఎన్నికల తరువాత కాంగ్రెస్, బీజేపీలలో ఏపార్టీ అధికారంలోకి వచ్చినా అప్పుడు కూడా కేసీఆర్ ఇలాగే మడికట్టుకొని కూర్చొంటారని అనుకోనవసరం లేదు. ఇంతవరకు ఆయన అనేక చేసిన హామీలను ఏవిధంగా పక్కనబెట్టి ముందుకు సాగుతున్నారో అప్పుడు కూడా అదేవిధంగా ఏదో ఒక కుంటిసాకు చెప్పి కేంద్రంలో ఏ కూటమి అధికారంలోకి వస్తే దానికే మద్దతు ఇవ్వడం ఖాయం.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.