తెలుగు ప్రజల ఐక్యతకు కల్వకుంట్ల కవిత పిలుపు.!

Publish Date:Jul 13, 2026

Advertisement

రాష్ట్రాలుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వేర్వేరు అయినా... ఉభయ తెలుగురాష్ట్రాల మధ్యా  ఎన్ని విభేదాలు ఉన్నా.. తెలుగు ప్రజలు ఎప్పుడూ ఐక్యంగానే ఉండాలని  టీఆర్ఎస్ (తెలంగాణ రక్షణ సేన)  అధినేత్రి  కల్వకుంట్ల కవిత అన్నారు. భౌగోళికంగా, రాజకీయంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు వేర్వేరు రాష్ట్రాలుగా విడిపోయినా, భాష, సంస్కృతి  పరంగా తెలుగు ప్రజల మధ్య బంధం విడదీయరానిదని అన్నారు.   తెలుగు సినిమా రంగానికి ప్రజలను ఏకం చేసే అద్భుతమైన శక్తి ఉందంటూ ఆమె వ్యాఖ్యానించారు.  ఇటీవల కాలంలో రెండు రాష్ట్రాల మధ్య ప్రాంతీయ భాషా యాసలు, సంస్కృతిపై జరుగుతున్న కొన్ని వివాదాల నేపథ్యంలో  కవిత వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.  ఇరు రాష్ట్రాల పరంగా విభేదాలు ఉండొచ్చు..  రాజకీయంగా భిన్నమార్గాలలో పయనిస్తుండొచ్చు.. కానీ..  ప్రజలుగా తెలుగువారు ఐక్యంగా ఉండాలన్నారు కల్వకుంట్ల కవిత.  రాజకీయాలకు అతీతంగా తెలుగు ప్రజలందరినీ ఒకే తాటిపైకి తెచ్చే   శక్తిమంతమైన మాధ్యమం సినిమా అన్న ఆమె.. సాంస్కృతిక బంధాలు రాజకీయాల కంటే మిన్నవన్నారు. 

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా వేదికగా ఆంధ్ర, తెలంగాణ యాసలపై, సంస్కృతిపై కొన్ని చిత్రాల విషయంలో   వివాదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఒకరి భాషను మరొకరు తక్కువ చేసి చూపిస్తున్నారంటూ ఇరు రాష్ట్రాల నెటిజన్ల మధ్య సామాజిక మాధ్యమంలో ఓ స్థాయిలో మాటల యుద్ధం జురుగుతోంది.. ఈ నేపథ్యంలో  టీఆర్ఎస్ అధినేత్రి  కతిత సాంస్కృతిక ఐక్యతకు పిలుపునివ్వడం విశేషం. 

రాష్ట్ర విభజన తర్వాత కూడా తెలుగు వారంతా ఒకే కుటుంబంగా ముందుకు సాగాలని, సినిమా వంటి కళా రూపాలు ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య సత్సంబంధాలను మరింత బలోపేతం చేయాలని కవిత ఆకాంక్షించారు. కవిత చేసిన ఈ వ్యాఖ్యలపై అటు సినీ వర్గాల నుంచి, ఇటు ఇరు రాష్ట్రాల ప్రజల నుంచి సానుకూలత వ్యక్తం అవుతోంది. 

Kavitha calls for unity og telugu people, Cinema, Cultural, Bridge, Telangana, Andhra Pradesh, Teluguone

By
en-us Political News

  
బెంగళూరు నగరంలోని ఒక ప్రతిష్టాత్మక లగ్జరీ హోటల్‌లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
అర్నబ్ తుపాను నష్టాల నుంచి రాష్ట్రాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చే పునరుద్ధరణ పనులను వేగవంతం చేయడంతో
ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ఉత్కంఠ రేకెత్తిస్తున్న మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది.
జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన వ్యక్తిగత జీవితంలో ఓ సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చిన భారీ నిరసన ర్యాలీ అంశం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రాప్తాడు పాఠశాలలో రక్తచరిత్ర.!
పేదరికం.. కష్టాలు.. రోజువారీ కూలీ పని! ఒకప్పుడు కనీస అవసరాల కోసం పోరాడిన మహిళ.. నేడు ప్రపంచంలోని ప్రముఖ టెక్నాలజీ కంపెనీలకు కీలక భాగస్వామిగా ఎదిగారు.
విజయసాయి ఈ వీడియో చేయడం వెనుక పొలిటకల్ స్ట్రాటజీ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తారకరత్న కుమార్తెతో వీడియో చేయడం ద్వారా తెలుగుదేశం శ్రేణుల మద్దతు పొంది తన పొలిటికల్ రూట్ లో ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు.
సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
పులివెందుల మునిసిపోల్ రణరంగంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులూ అప్రమత్తమయ్యారు. ఎలాంటి హింసాత్మక ఘటనలకూ తావులేకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అవసరమైతే  ఇటు తెలుగుదేశం కూటమి, అటు వైసీపీకి చెందిన ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేసేందుకైనా వెనుకాడబోమని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు.
గతంలో రాష్ట్ర రాజకీయాలలో  కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు  దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకున్నారు.   గతంలో కేటీఆర్ పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను  పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా  పేర్కొన్నారు. 
తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.