కవిత బిజీ.. సీబీఐ విచారణకు అగ్లా తారీఖ్

Publish Date:Dec 5, 2022

Advertisement

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు సీబీఐ నోటీసులు పంపిన క్షణం నుంచీ ఆమె విచారణ వ్యవహారం తెలుగు సినిమాలోని మలుపులను మించి తిరుగుతోంది. ఒక సస్పెన్స్ మూవీని తలపిస్తోంది. రాష్ట్రంలో సీబీఐకి జనరల్ కన్సెంట్ రద్దు అయినా.. సీబీఐ నోటీసులు పంపగానే ఎమ్మెల్సీ కవిత మా ఇంటికే వచ్చి విచారణ జరుపుకోండి అంటూ ఆహ్వానించేసింది. ఆ తరువాత తన తండ్రితో, న్యాయకోవిదులతో ప్రగతి భవన్ లో వరుస భేటీల తరువాత యూటర్న్ తీసుకున్నారు.

రిమాండ్ రిపోర్ట్ ను, ఎఫ్ ఐఆర్ కాపీనీ పంపితేనే విచారణకు అంగీకరిస్తానంటూ సీబీఐకి లేఖ రాశారు. ఆ లేఖపై స్పందనను బట్టి విచారణ విషయం ఆలోచిస్తానన్నారు. అయితే సీబీఐ ప్రాంప్ట్ గా కవిత లేఖకు స్పందించి రిమాండ్ రిపోర్ట్ ను, ఎఫ్ఐఆర్ కాపీనీ ఆమెపు అందజేసింది. ఆ విషయాన్ని కవిత స్వయంగా వెల్లడించారు. రిమాండ్ రిపోర్ట్ లో కవిత పేరు ప్రస్తావనకు రావడం వల్లే విచారణకు, కాదు కాదు ఆమె వివరణ తీసుకోవడానికి వస్తున్నామని సీబీఐ  నోటీసులో స్పష్టంగా ఉంది.

ఇప్పుడు అదనంగా ఎఫ్ఐఆర్ కాపీలో తన పేరు లేదని కవిత స్వయంగా వెల్లడించారు. అంతే కాదు.. నిన్నగాక మొన్న మంగళవారం (డిసెంబర్ 6)న విచారణకు రెడీ అని ప్రకటించిన కవిత ఇప్పుడు ఆ తేదీన తాను బిజీగా ఉన్నానంటూ వచ్చే వారం.. అంటే డిసెంబర్ 11, 12, 13, 15 తేదీలలో ఎప్పుడైనా తనను విచారించేందుకు రావచ్చని సీబీఐకి వర్తమానం పంపారు. అయితే కవిత ఆఫర్ చేసిన ఈ తేదీలపై సీబీఐ ఎలా స్పందిస్తుందన్నది వేచి చూడాలి.   సీబీఐ నోటీసులు అందుకున్న తరువాత శనివారం(డిసెంబర్3) ఉదయం ప్రగతి భవన్‌కు వెళ్లి తన తండ్రి , సీఎం కేసీఆర్‌తోనూ, ఆయన సమక్షంలో పలువురు న్యాయనిపుణులతోనూ చర్చించారు.  ఆ చర్చల మేరకే ఎఫ్ఐఆర్  కాపీలు తీసుకోవాలని లేఖ రాశారు. ఆ లేఖ సమాచారాన్ని మీడియాకు విడుదల చేశారు.

ఈ నేపథ్యంలోనే  సీబీఐ విచారణ సందర్భంగా   ఫిర్యాదు కాపీలు, ఎఫ్ఐఆర్ కాపీలు కవితకు అందజేస్తే వాటిని పూర్తిగా చదివి అర్థం చేసుకోవాల్సి ఉంది కనుక సీబీఐ ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం ఇవ్విలేనని కవిత నిరాకరించే అవకాశం ఉం ఉందని తెలుగువన్ ముందే చెప్పింది. ఆ మేరకే ఇప్పుడు కవిత మంగళవారం (డిసెంబర్ 6)న తాను విచారణకు అందుబాటులో ఉండబోనని సీబీఐకి వర్తమానం పంపారు. విచారణను సాధ్యమైనంత వరకూ వాయిదా వేయడమే లక్ష్యంగా కవిత పావులు కదుపుతున్నారని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ఇటీవల  కేంద్ర భద్రతా సలహాదారు అత్యంత రహస్యంగా హైదరాబాద్ లో పర్యటించి వెళ్లడం, తెలంగాణలో మోస్ట్ ఇన్ ఫ్లుయెన్స్ డ్ పొలిటికల్ లీడర్లు సీబీఐ, ఈడీ, ఐటీ విచారణను ఎదుక్కొంటుండడానికి ఏమైనా లింకుందా అన్న కోణంలో పరిశీలకుల విశ్లేషణలు సాగుతున్నాయి.

కొందరు ప్రముఖులను ఈడీ, సీబీఐ అదుపులోనికి తీసుకునే అవకాశం ఉండటంతోనే అలా జరిగితే పర్యవశానాలు ఎలా ఉంటాయన్న విషయాన్ని ఆరా తీయడానికే అజిత్ దోవల్ తెలంగాణలో పర్యటించారని పరిశీలకులు సైతం భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీబీఐ అధికారులు వివరణ కోసం అని వచ్చి ఎక్కడ అరెస్టు చేస్తారో అని కవిత భావించడం వల్లనే విచారణకు అగ్లా తారీఖ్ అంటూ వాయిదా కోరుతున్నారని అంటున్నారు. నోటీసులో ఎఫ్ ఐఆర్ ప్రస్తావన లేకపోయినా దానిని కోరడం.. ఆ తరువాత ఎఫ్ఐఆర్ లో తన పేరు లేదంటూ కవిత మీడియాకు తెలియజేయడం వెనుక సీబీఐ విచారణ వెనుక ఉన్నది రాజకీయ కక్ష సాధింపే అని చెప్పాలని చూస్తున్నారని అంటున్నారు. సీబీఐ కానీ, మరే దర్యాప్తు సంస్థ అయినా కానీ విచారణ చేయడానికి ఎఫ్ ఐఆర్ లో పేరు ఉండాల్సిన అవసరం లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కవిత ఆఫర్ చేసిన కొత్త తేదీలపై సీబీఐ ఎలా స్పందిస్తుందన్న ఆసక్కి సర్వత్రా నెలకొని ఉంది. 

By
en-us Political News

  
విజయసాయి ఈ వీడియో చేయడం వెనుక పొలిటకల్ స్ట్రాటజీ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తారకరత్న కుమార్తెతో వీడియో చేయడం ద్వారా తెలుగుదేశం శ్రేణుల మద్దతు పొంది తన పొలిటికల్ రూట్ లో ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు.
సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
పులివెందుల మునిసిపోల్ రణరంగంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులూ అప్రమత్తమయ్యారు. ఎలాంటి హింసాత్మక ఘటనలకూ తావులేకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అవసరమైతే  ఇటు తెలుగుదేశం కూటమి, అటు వైసీపీకి చెందిన ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేసేందుకైనా వెనుకాడబోమని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు.
గతంలో రాష్ట్ర రాజకీయాలలో  కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు  దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకున్నారు.   గతంలో కేటీఆర్ పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను  పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా  పేర్కొన్నారు. 
తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
అయితే, ప్రస్తుతం సిద్ధమవుతున్న చార్జ్‌షీట్‌ను మరింత పటిష్టంగా రూపొందించేందుకు ఉన్నతాధికారులు ఢిల్లీలోని ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సాంకేతిక సాక్ష్యాలు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఈ అదనపు చార్జిషీట్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
విపత్కర సమయంలో తెలుగు రాష్ట్రాల ఐక్యత.. ఏపీకి సాయం.!
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఒక్కోసారి చిన్న ప్రయత్నం కూడా ఊహించని విధంగా జీవితాన్ని మార్చేస్తుందనడానికి నిదర్శనంగా నిలిచింది ఒక ఉదంతం.
ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన అర్నబ్ తుఫాను ప్రభావంతో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ వ్యవస్థలకు నష్టం వాటిల్లింది.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన క్లిష్ట పరిస్థితుల్లోనూ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విద్యుత్ శాఖ సిబ్బంది సేవలందిస్తున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకమని
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.