Publish Date:May 29, 2025
మైనింగ్ మాఫియా డాన్ గాలి జనార్ధనరెడ్డి ఎఫెక్ట్ న్యాయవ్యవస్థపై తీవ్ర స్థాయిలో రిఫ్లెక్ట్ అవుతోంది. ఒకే కేసుకు సంబంధించి ఒకే రోజు ముగ్గురు న్యాయమూర్తులు విచారణ నుంచి తప్పుకున్నారు. తెలంగాణ హైకోర్టు చరిత్రలో అలా జరగడం ఇదే మొదటిసారి. దాంతో గాలి అండ్ కో బ్యాచ్ కేసుల విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది.
Publish Date:May 29, 2025
బీఆర్ఎస్ అధినేత కుటుంబంలో అంతర్గత విభేదాల రచ్చకెక్కాయి. ఆ పార్టీ ఆవిర్భావం తరువాత ఎన్నడూ లేని విధంగా సంక్షోభంలో కూరుకుపోయింది. 2023 ఎన్నికలలో పరాజయం తరువాత కూడా పార్టీ ఇంతటి సంక్షాభాన్ని ఎదుర్కొనలేదు. ఇంత వరకూ నివురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగమయ్యాయి. కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఒకే సారి గుప్పిట తెరిచేశారు. తన ధిక్కారం, తిరుగుబాటు సోదరుడు కేటీఆర్ పైనే అని కుండబద్దలు కొట్టేశారు.
Publish Date:May 29, 2025
ప్రభుత్వ భూములను రక్షిస్తాం, చెరువులు, నాలాలు పరిరక్షిస్తాం, హైదరాబాద్ నగరాన్ని వరదల నుండి కాపాడుతాం.. హైడ్రా ఏర్పాటు లక్ష్యం ఇదే అన్నట్లు ప్రభుత్వ పెద్దలు గొప్పగా సెలవిచ్చారు. అయితే ఆ దిశగా మొదట్లో కొంత వేగంగా వెళ్లిన హైడ్రా ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తోంది. ఎఫ్టీఎల్ , బఫర్ జోన్లలో ఆక్రమణలు ఉంటే తప్పనిసరిగా తొలగిస్తామని చెప్పిన హైడ్రా ఆ తర్వాత మానవతా దృక్పథం అంటూ తన వైఖరి మార్చుకుంది.
Publish Date:May 29, 2025
మద్యం కుంభకోణం కేసులో కింగ్ పిన్ గా భావిస్తున్న కీలక నిందితుడు రాజ్ కేశిరెడ్డి వాంగ్మూలాన్ని ఈడీ అధికారులు నమోదు చేశారు.
Publish Date:May 29, 2025
Publish Date:May 29, 2025
కడప వేదికగా జరుగుతున్న తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడు గురువారం ( మే 29) తో ముగియనుంది. మంగళవారం (మే 27)న ప్రారంభమైన మహానాడు తొలి రెండు రోజులు అత్యంత విజయవంతంగా జరిగాయి. జగన్ పార్టీకి పెట్టని కోటగా చెప్పుకునే కడప వేదికగా జరిగిన ఈ మహానాడు పలు ప్రత్యేకతలక వేదికైంది.
Publish Date:May 29, 2025
తెలుగుదేశంపార్టీ మహిళ నాయకురాలు చిప్పగిరి మీనాక్షి ఆత్మహత్య చేసుకుంటానంటూ కడప ఎన్టీఆర్ సర్కిల్ లోని సెల్ టవర్ ఎక్కి హల్ చల్ చేశారు. దీంతో దాదాపు రెండు గంటల పాటు ఆ ప్రాంతంలో ఉత్కంఠ నెలకొంది.
Publish Date:May 29, 2025
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా ప్రభుత్వంలో తాను నిర్వహిస్తున్న డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్) ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు.
Publish Date:May 28, 2025
సర్కమ్ స్టెన్స్ ఆఫ్ ఎవిడెన్స్ యాక్ట్.. అంటూ ఒకటుంటుంది. దీని అర్ధమేంటంటే వారి వారి మానసిక- శారీరక- సామాజిక- రాజకీయ- ఆర్ధిక- స్థితిగతులను అనుసరించి వారెలా బిహేవ్ చేస్తారో.. ఒక అంచనాకు రావడం.
Publish Date:May 28, 2025
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు ముగింపు దశకు వస్తుండటంతో భక్తులు తిరుమలేశుని దర్శనానికి పోటెత్తుతున్నారు.
Publish Date:May 28, 2025
కరోనాతో పంజాబ్ చండీగఢ్‌లో ఓ వ్యక్తి మృతి చెందాడు. చండీగఢ్‌లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలోని సెక్టార్-32లో బుధవారం 40 సంవత్సరాల వ్యక్తి కొవిడ్ బారినపడి చనిపోయాడని ఓ అధికారి పేర్కొన్నారు.
Publish Date:May 28, 2025
అస్సాం ప్రభుత్వం ప్రజల రక్షణ కోసం కీలక నిర్ణయం తీసుకుంది. మైనార్టీలు ఎక్కువ ప్రాంతాలో స్థానికులకు ఆయుధ లైసెన్సులు ఇవ్వాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయంచింది.
Publish Date:May 28, 2025
తెలుగుజాతి ఉన్నంత కాలం తెలుగు దేశం పార్టీ ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన అనంతరం ఆయన మాట్లాడారు. దేవుడి ఇచ్చిన శక్తి మేరకు పార్టీని సమర్థవంతంగా నడిపిస్తాని ఆయన అన్నారు. నా బలం, బలగం టీడీపీ నాయకత్వమే అన్నారు.