స్కూల్ పిక్నిక్‌లో విషాదం..ఊయల తగిలి పదేళ్ల విద్యార్థి మృతి.!

Publish Date:Nov 24, 2026

Advertisement

పిల్లల కేరింతలు.. ఆటపాటలు.. ఆనందోత్సాహాల మధ్య సాగాల్సిన స్కూల్ పిక్నిక్ ఓ చిన్నారి కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. సరదాగా గడపాల్సిన విహారయాత్రలో మృత్యువు ఊయల రూపంలో దూసుకొచ్చింది. పది మంది పిల్లలు ఎక్కిన భారీ ఇనుప ఊయల.. చివరకు పదేళ్ల అభిరామ్ ప్రాణాలను బలిగొంది. బిడ్డను సంతోషంగా పిక్నిక్‌కు పంపిన తల్లిదండ్రులకు చివరకు కన్నీళ్లే మిగిలాయి.

హైదరాబాద్‌లోని నార్సింగికి చెందిన హ్యాపీ స్కాలర్స్ స్కూల్ విద్యార్థులను యాజమాన్యం విహారయాత్ర కోసం మొయినాబాద్‌లోని లోటస్ పాండ్ పార్క్‌కు తీసుకెళ్లింది. అక్కడ పిల్లలంతా సరదాగా ఆడుకుంటున్న సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పార్క్‌లోని భారీ ఇనుప ఊయలపై సుమారు పది మంది చిన్నారులు ఎక్కారు. వెనుక వైపు నుంచి మరో నలుగురు విద్యార్థులు ఊయలను వేగంగా ఊపడంతో దాని వేగం క్రమంగా పెరిగింది.

ముందుకు వేగంగా దూసుకెళ్లిన ఊయల.. అంతే వేగంతో వెనక్కి వస్తున్న సమయంలో సమీపంలో ఉన్న అభిరామ్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఊహించని ప్రమాదంతో అక్కడున్న చిన్నారులు భయాందోళనకు గురయ్యారు. ఊయల బలంగా తగలడంతో అభిరామ్ నుదురు, ఛాతీ భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. మరో విద్యార్థి యశ్వంత్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు.

ఈ ప్రమాదంలో పదేళ్ల అభిరామ్ ప్రాణాలు కోల్పోయాడు. మరో విద్యార్థి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. కాసేపటి క్రితం వరకు పిల్లల కేరింతలతో సందడిగా ఉన్న పిక్నిక్ ప్రాంగణం.. ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ ఘటనతో షాక్‌కు గురయ్యారు.

అయితే, ఈ ప్రమాదం వెనుక స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో పిల్లల వద్ద ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది పర్యవేక్షణ లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పిల్లల భద్రతను పట్టించుకోకుండా వారిని గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడ చదవండి: ఈ నెల 26 కోటి మంది మహిళలకు చీరలు పంపిణీ.!

తమ బిడ్డను స్కూల్ యాజమాన్యాన్ని నమ్మి పిక్నిక్‌కు పంపిస్తే.. తిరిగి ప్రాణాలతో ఇంటికి రాలేదంటూ అభిరామ్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. మరోవైపు పాఠశాల యాజమాన్యం, పార్క్ నిర్వాహకుల బాధ్యతపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రమాదం జరిగిన విషయం బయటకు రాకుండా చేసేందుకు ప్రయత్నాలు జరిగాయనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిర్లక్ష్యంతో బాలుడి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. పాఠశాలల విహారయాత్రల్లో విద్యార్థుల భద్రత, ఉపాధ్యాయుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండేలా విద్యాశాఖ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఆటపాటలతో ఆనందంగా గడవాల్సిన బాల్యం.. ఒక్క క్షణం ప్రమాదంతో అర్ధాంతరంగా ముగిసింది. స్కూల్ పిక్నిక్ అంటేనే ఉత్సాహంగా ఎదురుచూసే చిన్నారుల మధ్య జరిగిన ఈ విషాదం.. అభిరామ్ కుటుంబానికి జీవితాంతం తీరని వేదనగా మిగిలిపోయింది. పిల్లలను నమ్మకంగా పాఠశాలలకు పంపిస్తున్న తల్లిదండ్రులకు వారి భద్రతపై ఎన్నో ప్రశ్నలను మిగిల్చింది.

మీకు నచ్చవచ్చు: Hyderabad: సెప్టిక్ ట్యాంక్‌లో పడి ముగ్గురు మృతి.!

మీకు నచ్చవచ్చు: Nvidia CEO జెన్సన్ హువాంగ్  ప్రసంగిస్తుండగా  కౌగిలించుకున్న మహిళా ఉద్యోగి.!


  

[ Abhiram, Lotus Pond Park, Moinabad Accident, Bachupally School Picnic, Happy Scholars School, Narsingi, School Picnic Tragedy, Swing Accident, Iron Swing Accident, Ten Year Old Boy Dead, Student Death ]

By
en-us Political News

  
కుటుంబాలను పోషించేందుకు రోజూ పనికి వెళ్లిన ఆ ముగ్గురు కార్మికులకు అదే పని చివరి రోజవుతుందని ఎవరూ ఊహించలేదు
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
చనిపోయిన రోగుల పేర్లపైనా బిల్లులు..ఏసీబీ దాడుల్లో బట్టబయలు.!
నడవడానికి కేటాయించిన ఫుట్‌పాత్‌పై కూడా ప్రశాంతంగా అడుగులు వేయలేని పరిస్థితి.. రోడ్లపై ట్రాఫిక్ రద్దీని తప్పించుకోవడానికి కొందరు వాహనదారులు ఏకంగా పాదచారుల దారినే ఆక్రమిస్తున్నారు.
బంగారం ధరలు భారీగా పడిపోవడం ఆభరణాల కొనుగోలుదారులకు ఊరటనిస్తుంటే.. పసిడిని తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్న వారికి మాత్రం కొత్త కష్టాలు తెచ్చిపెడుతోంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
అందంగా కనిపించాలని ఎవరికి మాత్రం ఉండదు? ముఖంపై చిన్న మొటిమ వచ్చినా.. చర్మంపై నల్లటి మచ్చ కనిపించినా అమ్మాయిలు ఆందోళన చెందుతారు.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బెంగళూరుకు చేరుకోవడంతో యలహంక ప్యాలెస్ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) రంగంలో లోతైన సాంకేతిక నైపుణ్యం కలిగిన నిపుణులకు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ నెలకొంది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.