క్లైమాక్స్‌కు చేరిన కడపస్టోరీ.. జగన్‌ను దెబ్బకొట్టేది తమ్ముడు అవినాషే?!

Publish Date:Jun 19, 2023

Advertisement

 ఏపీలో ఎన్నికలకు ఇంకా ఇంకా తొమ్మిది నెలల సమయం ఉంది. ఇప్పటి రాజకీయాలను బట్టి చూస్తే ఇది చాలా తక్కువ సమయం. అందుకే అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం రోజు రోజూకీ పెరిగిపోతోంది. ఈ విమర్శల దాడిలో మనకి ఎప్పటికప్పుడూ వినిపించే మాట వివేకా హత్య కేసు. మాజీ సీఎం వైఎస్ఆర్ కు స్వయానా తమ్ముడు, ఇప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డికి చిన్నాన్న అయిన వైఎస్ వివేకానంద రెడ్డి గత టీడీపీ ప్రభుత్వ హయంలో హత్య కాబడిన సంగతి తెలిసిందే. హత్యకు గురైన వివేకా ఇంట్లోనే ఇప్పుడు అధికారం ఉండడం.. హత్య టీడీపీ హయంలో జరగడం.. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నేతలు.. ఆ హత్యను టీడీపీ కుట్రగా ఫోకస్ చేయడంతో ఇప్పుడు అదే కేసు విచారణకు వచ్చేసరికి ఎవరికి వారికి అస్త్రాలు దొరికినట్లయింది.

ఇప్పటికే ఎన్నో మలుపులు, అంతకి మించి కుదుపులు చోటు చేసుకున్న వివేకా హత్యకేసు క్లైమాక్స్ కి చేరింది. క్లైమాక్స్ కి చేరిందనే మాట చాలా కాలంగా వినిపిస్తున్నా.. గడువులు విధించి కేసు దర్యాప్తు పూర్తి చేయాలనీ న్యాయస్థానాలు ఆదేశాలిచ్చినా.. ఈ కేసు ఇంకా ఇంకా సాగుతూనే వచ్చింది. ఇంకా చెప్పాలంటే ఈ కేసు సాగదీత కోసం ఓ వర్గం సర్వశక్తులూ ఒడ్డింది. ఆ విషయాన్ని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా చూస్తూనే ఉన్నారు. అయితే  ఈసారి క్లైమాక్స్ కు చేరింది అంటే చేరింది అంతే. దాని వెనక కారణాలు కూడా లేకపోలేదు. నిన్న మొన్నటి వరకు ఈ కేసు సాగదీతలో కేంద్రం అంతో ఇంతో సాయపడుతోందని ఢిల్లీ నుండి గల్లీ వరకూ కోడై కూసింది. విశ్లేషకుల నుండి అతి సామాన్య ప్రజల వరకూ అందరి నోటా ఈ మాటే వినిపించింది. అయితే, ఇప్పుడు కేంద్రంలో పరిస్థితులు మారాల్సిన సమయం వచ్చేసింది.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఇప్పుడు పాత మిత్రుల అవసరం వచ్చింది పడింది.  కర్ణాటక ఎన్నికల ఫలితాల పుణ్యమా అని దేశవ్యాప్తంగా బీజేపీ పాత మిత్రుల వైపు చూస్తోంది. తమతో కలిసి వచ్చే స్నేహితులకు చేయి అందించాలని బీజేపీ పెద్దలే రాష్ట్ర నాయకత్వాలకు సూచనలు, సలహాలు ఇచ్చేశారు. ఇప్పటికే జనసేనతో దోస్తీకి ఫిక్సయిపోయిన తెలుగుదేశం తాజాగా చంద్రబాబు అమిత్ షా భేటీ తర్వాత ఆల్ మోస్ట్ ఇక పాత అలియన్స్ కి రాజమార్గం పడ్డట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈక్రమంలో ఇకపై వివేకా కేసులో కేంద్రం నుండి సాయం అంటే ఎడారిలో నీటి ఊటే అవుతుంది.  అదే జరిగితే సరిగ్గా ఎన్నికలకు ముందు వైసీపీకి తప్పించుకోలేని జంజాటమే అవుతుంది.

సరిగ్గా గత ఎన్నికల సమయంలో వైసీపీకి, జగన్ మోహన్ రెడ్డికి కలిసి వచ్చిన అంశాలలో వివేకా హత్యకేసు ప్రధానమైనది  అనే దానిలో ఎలాంటి సందేహం లేదు. రాజకోట లాంటి ఇంట్లో అతి కిరాతకంగా జరిగిన ఈ హత్యను వారికి తగ్గట్లుగా మలుచుకోవడంతో ఆ ఎన్నికలలో వైఎస్ కుటుంబం, వైసీపీ పార్టీ బంపర్ మెజార్టీ సాధించింది. అయితే  సరిగ్గా ఇప్పుడు మళ్ళీ ఎన్నికల సమయానికి అదే కేసు వైసీపీ మెడకి చుట్టుకోనుందా అంటే నిస్సందేహంగా ఔనని చెప్పవచ్చు. అప్పుడు వైసీపీకి ఈ కేసు  ఏ స్థాయిలో ఎన్నికల సమరంలో సానుభూతిని ఏరులై పారించిందో.. ఇప్పుడు టీడీపీ జగన్ మోహన్ రెడ్డిని నేరస్తుడిగా ముద్ర వేయడంలో అదే స్థాయిలో సర్వశక్తులు ఒడ్డుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే 2014 ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసేందుకు టీడీపీ రూ.వెయ్యి కోట్ల ప్రచారాన్ని ఏ విధంగా హైలెట్ చేసిందో.. ఈసారి జగన్ నేరస్థుడు అనేలా హైలెట్ చేయడం తధ్యం.

నిజానికి ఈ హత్య ఎవరు చేశారు.. ఎవరు చేయించారు అనేది కోర్టులు, శిక్షలకే పరిమితం. కానీ  రాజకీయాలలో చేసే ఆరోపణలలో బలం ఎటువైపు ఉంటే అటే ప్రజలు అదే నమ్మే ఛాన్స్ ఉంటుంది. ఆ లెక్కన ఈ కేసులో దాదాపు ఐదేళ్ల విచారణ, అప్పటి నుండి జరిగిన పరిణామాలు అన్నీ కూడా టీడీపీకి అనుకూలంగా, వైసీపీకి వ్యతిరేకంగానే ఉన్నాయి. అందులో ప్రధానంగా సీఎం జగన్ కు మరో చిన్నాన్న కొడుకైన ఎంపీ అవినాష్ ఈ కేసులో కీలక సూత్రధారిగా దర్యాప్తు సంస్థ సీబీఐ ఇప్పటికే తేల్చి చెప్పడం సీఎం జగన్ ను   దెబ్బకొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అంతేకాదు, ఈ కేసులో అవినాష్ తప్పించుకునేందుకు అప్పటి నుండి వేసిన ఎత్తులు కూడా వైసీపీకి తీరని నష్టమే అవుతున్నాయి. ఇంకా చెప్పాలంటే తమ్ముడిని కాపాడేందుకు స్వయంగా సీఎంనే  అధికారాన్ని అడ్డం పెట్టుకుని చే యాల్సిందంతా చేస్తున్నారనే  ప్రచారం ప్రజలలోకి బలంగా వెళ్లిపోయింది.

దీనిని బట్టి చూస్తే రానున్న ఎన్నికలలో వైసీపీకి వ్యతిరేక పవనాలు వీస్తే కనుక అందులో అవినాష్ వాటాయే సింహభాగంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. జూన్ నెలాఖరునే ఈ కేసు దర్యాప్తు ముగించాలని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చిన నేపథ్యంలో.. సిబిఐ అనుమానించిందే నిజమైతే.. ఆ తర్వాత ఏం జరిగినా అది జగన్ కు గ్రహపాటే!

By
en-us Political News

  
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.