Publish Date:Mar 13, 2026
కడప జిల్లా రాజంపేట మండలం బోయినపల్లి గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కష్టసుఖాల్లో తోడుండాల్సిన భర్తే కర్కశంగా ప్రవర్తించిన ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. భార్య ప్రాణాపాయంలో ఉన్న సమయంలో కాపాడాల్సింది పోయి, ఆమె ఉరి వేసుకునే దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన భర్త ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
బోయినపల్లి గ్రామానికి చెందిన శ్రీరామ్ శ్రీనివాస్ రైల్వేలో లోకో పైలట్‌గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య కృష్ణవేణితో తరచూ కుటుంబ కలహాలు జరుగుతుండేవి. గురువారం కూడా వీరి మధ్య తీవ్రమైన వాగ్వాదం జరిగింది. ఆ వాగ్వాదం తర్వాత తీవ్ర మనస్తాపానికి గురైన కృష్ణవేణి “నేను చచ్చిపోతాను” అంటూ ఉరి వేసుకునేందుకు ప్రయత్నించింది.
సాధారణంగా ఇలాంటి సమయంలో కుటుంబ సభ్యులు అడ్డుకుని సముదాయించే ప్రయత్నం చేస్తారు. అయితే శ్రీనివాస్ మాత్రం అలా చేయకుండా, ఆమె ఉరి వేసుకునే క్షణాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించడం ప్రారంభించాడు. అంతేకాకుండా “ఉరి అలా కాదు… ఇలా వేసుకోవాలి” అంటూ ఆమెకు సూచనలు చేస్తూ వీడియో తీసినట్లు తెలిసింది. భార్య ప్రాణాలు పోతున్నా కనికరం చూపకుండా చిత్రీకరిస్తూనే ఉండటం అక్కడి వారిని తీవ్రంగా కలచివేసింది.
ఈ ఘటన తర్వాత కృష్ణవేణి విగతజీవిగా కనిపించడంతో గ్రామస్తులు షాక్‌కు గురయ్యారు. విషయం తెలుసుకున్న ఆమె బంధువులు, స్థానికులు శ్రీనివాస్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు అతడిపై దాడికి ప్రయత్నించగా పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. సెల్‌ఫోన్‌లో ఉన్న వీడియోలను సాక్ష్యాలుగా స్వాధీనం చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. భార్య ఆత్మహత్యకు ప్రేరేపించాడా అనే కోణంలో కూడా పోలీసులు కేసును విచారిస్తున్నారు. ఈ అమానుష ఘటనపై స్థానికంగా తీవ్ర చర్చ జరుగుతుండగా, మానవత్వం ఎక్కడికి పోతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kadapa-district-36-215431.html
ఇప్పుడు అమరావతికి చట్టబద్ధత విషయంలో కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ మౌనంగానే ఉండిపోయి ప్రేక్షకపాత్ర పోషిస్తున్నది. ఎందుకంటే.. అమరావతిని రాజధానిగా జగన్ వ్యతిరేకిస్తున్నారు కనుక. సపోజ్ ఫర్ సపోజ్ రేపు ఆయన అధికారంలోకి వస్తే అమరావతికి మద్దతుగా మాట్లాడిన వారిపై ప్రతీకార చర్యలకు దిగుతారన్న భయమే అందుకు కారణంగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కేరళ నుంచి కర్ణాటకకు వచ్చి ట్రెక్కింగ్ చేస్తూ తప్పిపోయిన జీఎస్ శరణ్య మిస్టరీలో నిజమెంత?
కృత్రిమ మేధ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఓపెన్ ఏఐ సంస్థ ఇప్పుడు ఉద్యోగ విధానాల్లోనూ సంచలన మార్పులకు తెరలేపుతోంది.
ఆర్‌ఆర్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీకి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఏపీలో వివిధ ప్రాంతాల్లో ఆర్ధిక కార్యకలాపాలకు ఊతమిచ్చేలా జాతీయ, రాష్ట్ర రహదారుల నిర్మాణం జరగాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
చిన్నపాటి సెలూన్ నడుపుకుంటూ జీవనం సాగించే ఒక సామాన్యుడికి జీఎస్టీ అధికారులు కళ్లు బైర్లు కమ్మే షాక్ ఇచ్చారు.
10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 1,53,820 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 1,41,000 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం 1,15,370 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది. ఈ రోజు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. కేజీ వెండిపై పది వేలు పెరిగి 2,65,000 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.
మేడ్చల్ మల్కాజిగిరి ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఇరాన్‌పై దాడులను తాత్కాలికంగా రెండు వారాల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ రెండు వారాల సమయంలో శాంతి చర్చలు కూడా జరగనున్నాయి. ఇరాన్ కూడా ఈ తాత్కాలిక ఒప్పందానికి అంగీకరించినట్లు ట్రంప్ పేర్కొన్నారు.
ఓ గర్భిణీని అంబులెన్స్ లో తరలిస్తున్న సమయంలో మార్గమధ్యంలో పురిటి నొప్పులు వచ్చాయి. ప్రసవ వేదనతో బాధపడుతున్న ఆ గర్భిణికి 108 సిబ్బంది సమయస్ఫూర్తితో అంబులెన్స్ లోనే కాన్పు చేసి తల్లి బిడ్డలను సురక్షితంగా కాపాడారు.
గచ్చిబౌలి మంగళ అపార్ట్ మెంట్ లో నివాసముంటున్న మెట్ల వెంకట కృష్ణ శ్రీ సాయి అనే యువకుడు వ్యాపారం చేస్తున్నాడు. ఈనెల 12వ తేదీన వెంకట కృష్ణ డెస్టినేషన్ మ్యారేజ్ జరగనుంది. ఒకవైపు అంగరంగ వైభవంగా వివాహం జరిపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ వివాహ ఏర్పాట్ల కోసం వెంకట కృష్ణ 20 లక్షల రూపాయలు ఖర్చు చేశాడు.
విమానాశ్రయంలో సాధారణ భద్రతా తనిఖీల సమయం లో స్కానింగ్‌లో బుల్లెట్లు బయటపడటంతో అధికా రులు వెంటనే అప్రమత్తమ య్యారు. ఆయుధాలకు సంబంధించిన సరైన అను మతులు, పత్రాలు చూపించ లేకపోవడంతో సంబంధిత వ్యక్తిని అదుపులోకి తీసుకు న్నారు.
పోలీసులు కథనం ప్రకారం సికింద్రాబాద్ బేగంపేటలోని ఒక ట్రైనింగ్ సంస్థకు పైలట్ కోర్సు కోసం వచ్చిన యువ తిని ట్రైనర్ నసిముద్దీన్ మాయ మాటలతో నమ్మించాడు. ట్రైనింగ్‌లో సహాయం చేస్తానని చెప్పి యువతిని తన వశం చేసు కున్నాడు. అనంతరం పలు మార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.