మాజీ డీజీపీ హెచ్‌జె దొర కన్నుమూత

Publish Date:Mar 13, 2026

Advertisement

 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ హెచ్‌జె దొర కన్నుమూశారు. గత కాలంగా ఆయన కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. ఇవాళ ఉదయం డయాలసిస్ చేయించుకునేందుకు నిమ్స్‌కు వెళ్లారు. తిరిగి ఇంటికి వెళ్లిన తర్వాత ప్రమాదవశాత్తూ బాత్‌రూమ్ పడిపొయినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు మళ్లీ ఆయన్ను నిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. 1965 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అయిన దొర, ఉమ్మడి ఏపీలో 1996 నుండి 2002 వరకు డీజీపీగా సుదీర్ఘ కాలం సేవలందించారు.

ఏపీ డీజీపీగా పదవీ విరమణ చేసిన తర్వాత, కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం డైరెక్టర్ జనరల్‌గా మరియు కేంద్ర విజిలెన్స్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించారు. తన వృత్తి జీవితంలోని అనుభవాలను వివరిస్తూఅనే పేరుతో ఆయన తన ఆత్మకథను కూడా రచించారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, మాజీ మరియు ప్రస్తుత ఐపీఎస్ అధికారులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఆయన చూపిన చొరవ, పోలీస్ శాఖలో ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణలు మరువలేనివని కొనియాడారు.

 

 

 

By
en-us Political News

  
చరిత్రలో అమెరికాకు తగిలిన అతిపెద్ద మిలిటరీ సెట్ బ్యాక్ ను గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. చరిత్ర పునరావృతమవుతుంది అని పేర్కొంటూ.. 1980లో అమెరికా ఎదుర్కొన్న ఘోర పరాజయాన్ని ఆ పోస్టులో ఇరాన్ పేర్కొంది.
ఇటీవల ఇరాన్ ప్రభుత్వం దాదాపు 18 అమెరికన్ కంపెనీలను ఉగ్రవాద సంస్థలుగా పేర్కొంటూ విడుదల చేసిన జాబితాలో డెల్‌తో పాటు మెటా, టెస్లా, బోయింగ్, ఇంటెల్ వంటి దిగ్గజ సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలు అమెరికా, ఇజ్రాయెల్‌కు గూఢచారి సంస్థలుగా వ్యవహరిస్తున్నాయని, ఇరాన్ నాయకులపై దాడులకు సహకరిస్తున్నాయని ఐఆర్‌జీసీ ఆరోపించింది.
స్టెల్త్ విమానాలు, క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్లు మరియు బాలిస్టిక్ క్షిపణులతో సహా ముప్పులను గుర్తించి, పసిగట్టి, నిర్వీర్యం చేయగల ఒక శక్తివంతమైన రక్షణ గొడుగును సృష్టిస్తాయి. ఈ సమీకృత వ్యవస్థ, ఆధునిక వైమానిక యుద్ధ సవాళ్లకు ప్రతిస్పందించే భారతదేశ సామర్థ్యాన్ని పెంచుతుందని భావిస్తున్నారు.
మావోయిస్టు కీలక నేత, కొంత కాలం కిందట ఎన్ కౌంటర్ లో హతమైన హిడ్మా గతంలో పీఎల్ జీఏ బాధ్యతల నుంచి తప్పుకుని దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ వైపు వెళ్లిన తరువాత దళాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. అప్పట్లో పీఎల్ జీఏ బెటాలియన్ కమాండర్‌గా బడ్సే దేవాను నియమించగా, డిప్యూటీ కమాండర్ బాధ్యత లను సోది కేశాలకు అప్పగిం చారు.
మల్లె, కనకాంబరం, రోజా, చామంతి వంటి సుగంధ పుష్పాలతో పాటు తులసి వంటి పవిత్ర పత్రాలతో స్వామివారికి పుష్ప నీరాజనం సమర్పించారు. గంటల తరబడి సాగిన ఈ పుష్పాభిషేకం చూసి భక్తులు పులకించిపోయారు.
కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు చెందిన 8 మంది యువకులు ఫ్రంట్‌లైన్ ప్రెస్ పేరుతో ఒక బృందంగా ఏర్పడి షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నారు. వీరంతా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమయ్యారు. చిత్రీకరణ కోసం పుష్పగిరి వద్దనున్న పెన్నా నది వద్దకు వీరు ఆదివారం వెళ్లారు.
ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ, మహ్మద్ షమీ అదిరిపోయే వ్యూహంతో వారిని దెబ్బతీశాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ చివరి బంతికే షమీ వేసిన స్లోయర్ డెలివరీని అర్థం చేసుకోవడంలో అభిషేక్ పూర్తిగా విఫలమయ్యాడు. బంతి బ్యాట్ అంచుకు తగిలి షార్ట్ థర్డ్ దిశగా వెళ్లగా, అక్కడ ఉన్న మనిమారన్ సిద్ధార్థ్ అద్భుతమైన డైవ్‌తో క్యాచ్ పట్టాడు.
మంగళవారం ) పవర్ ప్లాంట్స్‌పై దాడులు, బ్రిడ్జ్‌పై దాడులు అన్నీ కలగలిపి ఉంటాయి. ఇలాంటిది మునుపెన్నడూ చూసి ఉండరు. హోర్ముజ్‌ను తెరవకపోతే మీకు నరకం కనిపిస్తుంది.. చూస్తూ ఉండండి అంటూ అని బూతులతో ట్రంప్ చెలరేగిపోయారు.
చైనాకు చెందిన పలు సాంకేతిక సంస్థలు శాటిలైట్ ఛాయాచిత్రాలు, విమానాల రాకపోకల డేటా, షిప్పింగ్ సమాచారాన్ని విశ్లేషించడానికి ఏఐని వినియోగిస్తున్నాయి. ముఖ్యంగా మిజార్‌విజన్ వంటి సంస్థలు ఓపెన్-సోర్స్ ఇంటెలిజెన్స్ ద్వారా సేకరించిన సమాచారాన్ని అత్యంత వేగంగా క్రోడీకరించి, అమెరికా సైన్యం ఎక్కడెక్కడ మోహరించి ఉందో ఇట్టే కనిపెట్టేస్తున్నాయి.
ఈ మ్యాచ్ లో ఆర్సీబీ 43 పరుగుల తేడాతో చైన్నైని చిత్తు చేసింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 250 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఐపీఎల్ 2026 సీజన్ లో ఇప్పటి వరకూ ఇదే అత్యధిక స్కోరు.
కుటుంబాల్లో కలహాలు పెరిగి విషాదాంతాలకు దారి తీస్తున్న ఘటనలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. అలాంటి దుర్ఘటన ఒకటి భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.
తారామతి డ్రగ్స్ కేసులో ముంబైకి చెందిన నటుడు సహా ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేశామని ఈగిల్ టీం తెలిపారు
తెలంగాణ రాష్ట్ర న్యాయవ్యవస్థ చరిత్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.