కే.ఏ.పాల్ ప్రొడక్షన్స్ ‘గోప్ఫ’ కామెడీ

Publish Date:Jun 5, 2022

Advertisement

వెర్రి వేయివిధాలన్నారు. ఈ పాలుగారిది మరొక విధం. ప్రభు దర్శనం అయిందని ప్రచారం చేసుకున్న కె.ఎ.పాలు గారిది పాలుతాగే వయసు కాదు. ఆయన దృష్టిలో మనమే పిల్లలం.. దేశ ప్రధానితో సహా! పాలుగారికి విదేశాల్లో వూహించనంత వీర ఫాలోయింగ్‌ వుందని ఆయన అనుచరులతో పాటు స్వయంగా ఆయనే తెగ ప్రచారం చేసుకుంటుంటారు. లోకంలో ఏ దేశ ప్రధాని, ప్రెసిడెంట్‌ ఆఫ్‌ అమెరికా అయినా సరే పాలుగారి సువార్త చచ్చినట్టు వినితీరాల్సిందే. లేకపోతే ఆయనకు దేశ పాలన సాగదు. కె.ఎ.పాల్‌ గారికి భగవంతుడు ఇచ్చిన గొప్పవరం అది. దీన్ని కాదనే హక్కు స్వయానా పాల్‌ గారికే లేదు. ఎందుకంటే ఆయన నిఝంగానే ప్రపంచనేతలతో మాట్లాడేంత చనువు, వీలయితే ప్రపంచ యుద్ధాలను అమాంతం ఆపేయగల శక్తి కలిగినవాడు గనుక. చిత్రమేమంటే, అవేమీ చేయలేదు, అంత సులువుగా జరిగిపోయేవీ కావు.

లోకాన్ని వుద్ధరంచాలని దైవాంశసంభూతులకు వుంటుంది. వారు మంత్రిలాగా సలహాలు.. అపుడపుడూ ఇవ్వడం విన్నాం, సినిమాల్లోనూ చూసేం. కానీ లోకాన్ని వుద్ధరించడమన్నది నావల్లే సాధ్యం.. లాభంలేదు మిత్రమా.. ధైర్యం చేయి ఢింభకా.. అని లోలోపల నాలుగు ధైర్య వచనాలు చెప్పుకుని ఏకంగా రాజకీయరంగంలోకి దిగడాన్ని పిచ్చికి పరాకాష్టగాక మరేమంటారు. ఏపీలోని ఉత్తరాంధ్రలో ఎక్కడో మారుమూల గ్రామంలో న్మించి దేశాన్ని ఉద్దరించే పాత్రలో దేశాటన చేస్తూ చక్కగా నవ్వుతూ తన అజ్ఞానాన్ని చాలా సరదాగా, చాలా సీరియస్‌గానూ తెలియజేసుకోవడం కేవలం కె.ఎ.పాల్‌ కి మాత్రమే సాధ్యం! తాను ఏది చెబితే అది ప్రపంచ నేతలు వింటారు, వింటున్నారని అంటూంటారు. మరి మన ప్రధానితో టీ తాగుతూ.. 'నాయనా, ముందు ప్రజలను ఉద్దరించు, వారి కష్టాలను తెలుసుకుని వారి అభివృద్ధికీ నాలుగు అడుగులు వేయి, ఎంతసేపూ అంబానీ, అదానీలే కాదు ఇంకా ప్రజలు వున్నారు' అని చెప్పారా! లేదు.

సామాజంలో అన్యాయాలు, అక్రమాలు, హింసా పెరిగిపోతున్నాయి. సామాన్యులను ఆదుకోవాలని పాల్‌ చాలా అనుకుని రాజకీయాల్లోకి వచ్చేరట. మతప్రచారకులుగా ఎంతో పేరున్న పాల్‌గారికి రాజకీయాల రొంపిలో దిగితేనే అనుకున్నవి సాధ్యమవుతాయని గట్టి నమ్మకం కలగడమే విచిత్రం. ఈ ఆలోచన మరే ఆధునిక భక్తాగ్రేసుడుకీ తట్టలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తనకు వెన్నంటి వుండే వీరాభిమానులు లెక్కకు మించి వున్నారని ప్రతీ సందర్భంలో పాల్‌ అందరికీ గుర్తు చేస్తుంటారు. ఎవరైనా మైకులో మాట్లాడుతూంటే అమాంతం గుమిగూడడం ఇక్కడి ప్రజల తత్వం. వాళ్లకో సరదా, కాలక్షేప మూను. దాన్ని వీరాభిమానం అనుకోవడం, ఓటుబ్యాంకు అనుకోవడమే అమాయకత్వం. అన్ని రాజకీయపార్టీల వారి మాదిరిగానే పాల్‌గారూ ఆ అమాయకత్వంలో పడ్డారు.

నలుగుర్ని వెంటేసుకుని గట్టిగా మాట్లాడ్డం వంటపట్టించుకున్నారు. కానీ ఏంమాట్లాడుతున్నాను అనేదే అప్పుడు దారితప్పుతుంటుంది. ఓటు బ్యాంకును కొల్లగొట్టి రాజ్యాధికారం చేపట్టడానికి తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయపార్టీలవారు విశ్వయత్నం చేస్తుంటారు. కానీ పాల్‌ మాత్రం హేమాహేమీలయిన పార్టీలవారినే అంటే ఎన్నో ఏళ్ల రాజకీయానుభవం, బలగం వున్న నాయకులనే చచ్చుకుంటూ తనకు మద్దతునివ్వమని, అది వారి భవితకు ఎంతో మంచిదన్నది పాల్‌ ప్రవచనం. వొట్టి బోళామనిషి అనుకునేరు.. వొట్టి వెర్రితనం! లేకపోతే ఏ పార్టీ అయినా తన వల్లనే గెలుస్తుంది, తనను ఆశ్రయిస్తేనే మనుగడ సాగిస్తుందని భావించడం ఎప్పుడూ కనీ వినీ ఎరుగం.

ప్రపంచదేశాధినేతలతో సరదా కబుర్లు చెప్పగలిగేంత పాల్‌ భారతదేశంలో, మీదుమిక్కిలి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి అవమానాలు పడాలా తనను చాలా ఈజీగా తీసుకుంటున్నారు జాగ్రత్త అని హెచ్చరించాలా బైబుల్‌ పాఠాలు చెప్పి వేలాదిమందిని దగ్గరచేసుకోవచ్చు, భక్తులుగా మార్చుకోవచ్చు. ఆయనకు ఆ సత్తా వుండవచ్చు. కానీ ఈ రొంపి రాజకీయాల్లో, వ్యూహకర్తల మధ్య, ఏనుగులు, సింహాల నడుమ పిరికితనంతో కూడిన భయంతో మాటలు తడబడుతూ తిరగడం దేనికి లోకాన్ని వుద్ధరించడానికి అవతరించారా మహామహా నాయకులే పావులు నడపలేక ఏదో ఒక సమయంలో దెబ్బతిన్నారు. ఎంతోకాలం నుంచీ రాజకీయబురదలో కొట్టుకుంటున్నవారున్నారు. విదేశాల్లో ప్రవచనాలు చెప్పుకుంటూ ప్రశాంతంగా జీవితాన్ని సాగించుకోవలసిన కె.ఎ.పాల్‌గారికి ఈ రాజకీయాల నదిలో తలమునకలు కావాలని ఎవరు ప్రవచించారో వారికి పాదాభివందనాలు.

ఏమయినప్పటికీ, కె.ఎ.పాల్‌ రాజకీయ ప్రవేశం, ప్రయాణం ఈ కాలపు గొప్ప కామెడీ! దీనికి రచన, దర్శకత్వం అన్నీ ఆయనే. అహింసామార్గాన పయనించాల్సినవారు ఈ దారుణమార్గంలోకి మళ్లడానికి గల గట్టి కారణాలు తెలిస్తే బాగుండు. స్క్రిప్ట్‌ మరో విధంగా మార్చమని దేవుని ప్రార్ధించేది దేశమంతా!

By
en-us Political News

  
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్‌ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు
మియాపూర్ మెడికో సృజన హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొద్దికొద్దిగా కొలిక్కి వస్తోంది.
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీఆర్ఎస్, హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.
దేశ రక్షణ రంగంలో అత్యంత కలకలం రేపిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
సినిమా తరహాలో పక్కా ప్లాన్ వేశాడు.. పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకవని భావించాడు.. కానీ చివరకు చేసిన చిన్న పొరపాటే అతడిని పోలీసులకు పట్టించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.