ఓ హెచ్చరిక పంచిన వినోదం

Publish Date:Jun 5, 2022

Advertisement

ఎదుటివాడిని చూసి నేర్చుకోమంటారు పెద్దలు. ఎదుటివారి అధికార దాహాన్ని జీర్ణించుకుని, అదే జీవము, జీవితేచ్ఛగా జీవించమని కాదు. భారతీయజనతా పార్టీవారికి చిన్నపుడు బడి పాఠాలు ఎవరు చెప్పారో, ఏం చెప్పారోగానీ ఆసేతు హిమాచలం బిజెపి నేతలంతా ఒకేవిధంగా ఉపన్యాసాలతో బెదిరించడం అలవర్చుకున్నారు. దేశమంతా కాషాయపరం చేయాలన్న దీక్షబూని  ఆ తీరుగా ప్రసంగాలతో ఊదరగొట్టేస్తున్నారు. సభలు సమావేశాల్లో, టీవీల్లో, నలుగురితో మాట్లాడేప్పుడు కూడా గొంతు చించుకోవడం బాగా అలవడింది. ఈ కంచు కంఠీవరులు 2024 ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాలు కూడా బిజెపిపరం అవుతాయనే అంటున్నారు. ఇక్కడ మురళీధర రావు మాట్లాడితే అచ్చం అమిత్‌ షా అన్నట్టే శ్రోతలకు వినపడుతోంది. అదే బిజెపి స్పెషల్‌!

చిన్నపాటి పోటీ అయినా, ఎన్నికలయినా తప్పకుండా మంచి స్థాయిలో గెలవాలనే అందరూ అనుకుంటారు. అందుకు కృషి చేస్తారు. కానీ కాల క్రమంలో బిజెపివారు మాత్రం అధికార దాహానికి ప్రతీకగా నిలుస్తున్నారు. పూర్వం కాంగ్రెస్‌ మీద పడి ఏడ్చిన నేతలే ఇప్పుడు అదే పంథాలో అరవడం, హెచ్చరించడమూ చేయడం ఏపాటి ధర్మవెూ కమల నాధులే చెప్పాలి. అసలు పార్టీలు, నాయకులు గెలవడం ఏమిటి ప్రజలు, ఓటర్లే గెలిపిస్తున్నారన్న ధ్యాస బిజెపి నేతలకు పోతోంది. అందు క్కారణం 18 రాష్ట్రాల్లో అధికారం చెలాయిస్తున్నామనే ఎల్పీ వినిపిస్తూండటమే. చెప్పిందే చెబుతుంటే అదే చెవికి ఎక్కుతుందని, మర్చిపోకుండా వుంటారని పూర్వం స్కూళ్లలో లెక్కల టీచర్లు అనుసరించిన పద్ధతి. దాన్ని రాజకీయాల్లో ఇలా ఊక దంపుడు ఉపన్యాసాలకు, ప్రతిపక్షాలను బెదిరించడానికి కూడా చక్కగా ఉపయోగించవచ్చన్నది బిజెపి వారికే తెలియడం ఇతరుల దురదృష్టం.

తెలంగాణా, ఆంద్రాలకు అన్నీ చేస్తాం, అభివృద్ధికి కావలసినంత వెన్నుదన్నుగా వుంటామని కొత్తల్లో ప్రధాని వెూడీ నుంచి ఇక్కడి మురళీధరరావు వరకూ అన్నారు. వారి మాటలను పాపం అమాయక తెలుగు ప్రజలు, నాయకులు తెగ నమ్మే రు. కానీ ఎనిమిదేళ్ల తర్వాత ఇప్పుడు అసలు కాషాయం రంగు మీరు భావిస్తున్నది కాదురా నాయనలారా అని ప్రభువుల వారే బంటుల చేత చెప్పిస్తున్నారు! అసలు రంగు ఏమిటంటే.. తెలుగు రాష్ట్రాలకు అన్నీ చేస్తాం. అయితే మేం అధికారంలోకి వస్తేనే అన్నది నాడు మోడీ అన్నమాటకు, ఇప్పుడు అమిత్ షా గొంతుతో ఏపీ బీజేపీ నేత మురళీధరరావు ప్రసంగానికీ అర్ధం. ప్రతీ చిన్న అంశంలోనూ నలుగుర్ని పోగేసుకుని గోలచేయడం, బెదిరించడం రాజకీయ ప్రత్యర్ధులకు తమ సత్తా ఇది అని నిరూపించడానికి ఒక సులభ మార్గం చేసుకున్నది బిజెపి. ఏదో ఒక సమస్యను సృష్టించి దాని మీద రచ్చ చేసి చేస్తూండటం ఒక పద్ధతిగా పెట్టుకోవడం పాపం మహా నేతల కాంగ్రెస్‌వారికీ తట్టని విద్య! ఏదో విధంగా లోబర్చుకోవడం తర్వాత వారి మీద స్వారీ చేయడం చక్కగా అమలు చేయడంలో బిజెపీవారి తర్వాతే ఎవరయినా.

రాబోయే ఎన్నికల్లో ఎవరిపైనా ఆధారపడటం, భుజానికి ఎత్తుకోవడం ససేమిరా జరగదని కుండబద్దలు కొట్టేరు బిజెపి నాయకులు. మొన్నటివరకూ వారి అండ కూసింత వుంటుంది 2024లో ఏకంగా సీఎం అయిపోవచ్చని సినిమాటిక్ గా కలలు కంటున్న జనసేన నాయకుడు పవన్‌ కళ్యాణ్‌కి అసలు సంగతి బిజెపి నేతలు గట్టిగానే తెలిపారు. బిజెపి జాతీయ రాజకీయ పార్టీ తప్ప,స్వచ్ఛంద సంస్థ కాదనీ, ఇతరులను ముఖ్యమంత్రులను చేయడానికి పని చేయదని స్పష్టం చేసేశారు. బిజెపిది ఒకే దెబ్బకి రెండు పిట్టలు కొట్టేయాలన్న ఆతృత. అందుకే కేంద్ర నాయకులు తెలుగు రాష్ట్రాల్లో పర్యటనలు చేస్తున్నారు. అసలు అన్నింటికీ మించిన చిత్రమేమంటే మొన్న తెలంగాణ ఆవిర్భావోత్సవం ఢిల్లీలో పర్యాటకమంత్రి కిషన్‌ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం, త్వరలో పార్టీ సమావేశాన్ని తెలంగాణాలో నిర్వహించాలనుకోవడం, అందుకు ప్రధానిని కూడా ఆహ్వానించడం!
తెలుగురాష్ట్రాల్లో బిజెపి నాయకులు ఎలాగయినా తమ పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్న పట్టుదలతో పాలనా వ్యవహారాల్లో వీలయినన్ని అడ్డంకులు సృష్టించి లోపాల్ని చూపడానికి జనాన్ని సమీకరించడంలో తలమునకలవుతున్నారు. వారికి ఈ తరహా దాడి మహా సరదా!

రేపు తెలంగాణా మాదే, ఇటు ఆంధ్రప్రదేశ్‌ కూడా మాదేనని ధీమా వ్యక్తం చేయడానికి ఏమాత్రం సంకోచించడం లేదు. ఏపీ ముఖ్యమంత్రి తన కేసులు, రాష్ట్ర అవసరాలకోసం ప్రధాని చుట్టూ ప్రదక్షిణాలు చేస్తుం డటం కేంద్రంలో అందరికి బాగా అలుసయిపోయింది. ఆయన సాధించి తెచ్చిందేమి లేదన్న అభిప్రాయాలు రాష్ట్రంలో వ్యక్త మవుతున్నాయి. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి జగన్‌ రెడ్డి విశ్వయత్నాలే చేస్తున్నారు. తెలంగాణా ఇందుకు కాస్తంత విరు ద్ధం. అక్కడ సీఎం కేసిఆర్‌కి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలన్న పిచ్చి బాగా పట్టి తిరుగుతున్నారు. అంతా ఎక్కే గడపా, దిగే గడపే కానీ ఒరిగేది ఏమీలేదని అంటున్నారు. కుమారరత్నం కేటీఆర్‌ విదేశీ పారిశ్రామికవేత్తలతో చర్చలతో రాష్ట్రానికి ఏదన్నా సాధించి అధికారాన్ని నిలబెట్టుకోవాలన్న ఆతృతలో వున్నారు.ఈ రెండు శక్తిహీనమయినవే అని బిజెపి నేతల ధీమా.
జనసేన హాస్యం బిజెపివారికి వినోదం. బిజెపివారి ధీమా ప్రజలకు తల భారం. పవర్‌స్టార్‌వి హెచ్చరికలు కావు సరదా బెదిరింపు, బిజెపి వారి ధీమా పవన్‌గారికి హెచ్చరిక.. వెరసి టిడీపివారికి గొప్ప వినోదం!
 

By
en-us Political News

  
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్‌ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు
మియాపూర్ మెడికో సృజన హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొద్దికొద్దిగా కొలిక్కి వస్తోంది.
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీఆర్ఎస్, హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.
దేశ రక్షణ రంగంలో అత్యంత కలకలం రేపిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
సినిమా తరహాలో పక్కా ప్లాన్ వేశాడు.. పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకవని భావించాడు.. కానీ చివరకు చేసిన చిన్న పొరపాటే అతడిని పోలీసులకు పట్టించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.