వలసలు, అసంతృప్తి రాగాలు.. టీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి

Publish Date:Jul 12, 2022

Advertisement

ఎనిమిదేళ్లు ఏకఛత్రాధిపత్యంగా తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ఇప్పుడు వలసలు, అసమ్మతి రాగాలతో ఉక్కిరిబిక్కిరి అయిపోతోంది. ఒక వైపు పార్టీని వీడుతున్న నేతలు, మరో వైపు తమ అసమ్మతిని బహిర్గతం చేస్తున్న నాయకులతో టీఆర్ఎస్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ముందు వెనుకలాలోచించకుండా  ఆపరేషన్ ఆకర్ష్ అంటూ ఇతర పార్టీల వారికి తలుపులు బార్లా తెరిచేసిన ఫలితమే ఇప్పుడు ఈ పరేషాన్ అని తెరాస వర్గాలే అంటున్నాయి.

పార్టీ నిర్మాణం నుంచీ తెరాలలో ఉండి ఆటుపోట్లు తట్టుకుని రాటు తేలిన టీఆర్ఎస్ నేతలకు ఇప్పడు పార్టీలో పరిణామాలు ఇబ్బందికరంగా మారాయి. అసహనం, అసంతృప్తి వారిలో పెల్లుబుకుతోంది.  ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారికి పెద్ద పీట వేసి, కేసీఆర్  తమను నిర్లక్ష్యం చేశారన్న ఆవేదనలో ఉన్న వారు పార్టీ తరఫున గట్టిగా నిలబడే అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలా అని ఇతర పార్టీల నుంచి వచ్చి చేరి టీఆర్ఎస్ లో అందలం ఎక్కి పదవులు అనుభవిస్తున్న వారు రేపు ఎన్నికలలో పార్టీ అటూ ఇటూ అయితే టీఆర్ఎస్ ను అంటిపెట్టుకు ఉంటారా అంటే అదీ అనుమానమేనని వారు అభిప్రాయపడుతున్నారు.  

ప్రస్తుతం మొదటి నుంచీ టిఆర్ఎస్ లో ఉన్న నాయకులకు.. మధ్యలో వచ్చి చేరి పదవుల అందలాలు అందుకున్న నాయకులకు మధ్య సయోధ్య కొరవడింది. అదే సమయంలో పార్టీ అగ్రనాయకత్వం వీరిని సమన్వయపరచడంలో పూర్తిగా విఫలమైంది.  ఫలితంగా రాష్ట్రంలోని ఏ నియోజకవర్గం తీసుకున్నా.. అక్కడ రెండు మూడు గ్రూపులు ఏర్పడి.. ఒక గ్రూపుతో మరో గ్రూపునకు వైరుధ్యం, విభేదాలతో పార్టీలో సఖ్యత కొరవడిన పరిస్థితి నెలకొని ఉంది. ప్రస్తుతానికి చాలా చోట్ల ఈ అసంతృప్తి, అసమ్మతి నివురు గప్పే ఉన్నా.. ఎన్నికల నాటికి నివురు తొలగిపోయి అసంతృప్తి జ్వాలలు, అసమ్మతి అగ్ని రాజుకునే అవకాశాలే మెండుగా ఉన్నాయని అంటున్నారు.  అసెంబ్లీ టిక్కెట్టు ఆశావాహులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు తమతమ వర్గాలను బలోపేతం చేసుకోవడానికే పరిమితం కావడం లేదనీ, తమకు పోటీ వస్తారని భావిస్తున్న వారిని బలహీన పరిచేందుకు వ్యూహాలు పన్ను తున్నారనీ, అందుకే నియోజకవర్గాలలో గ్రూపు తగాదాలు రోడ్డున పడుతున్నాయనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇక ప్రత్యర్థులు పార్టీలో తమను ఎదగనివ్వరన్న నిర్ధారణకు వచ్చేసిన వారు మాత్రం ఎన్నికల సమయం వరకూ ఆగడం ఎందుకన్న భావనతో పార్టీని వీడుతున్నారు.

 ముఖ్యంగా తాండూరు, కొల్లాపూర్, మహేశ్వరం, భువనగిరి, నకిరేకల్, జనగాం, ఉప్పల్, మేడ్చెల్, ఆర్మూర్, హుజూరాబాద్ నియోజకవర్గాలతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లోనూ పార్టీలోని ఆశావాహులు శరవేగంగా పావులు కదుపుతున్నారు. రానున్న ఎన్నికల్లో పోటీదారుడిని వెనుకకు నెట్టి టిక్కెట్టు తెచ్చుకోవడంపైనే దృష్టిసారించారు. ఈ మారు అసెంబ్లీ టిక్కెట్టు కోసం ఆశావాహుల్లో పోటీ తీవ్ర స్థాయిలో ఉన్నది. దీంతో ఈ పాటికే తాండూరులో నేనే పోటీచేస్తానని, తనతో  పాటు తన  సోదరుడు కూడా పోటీ చేస్తారనే ధీమాను ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి వ్యక్తం చేస్తున్నారు. భువనగిరిలోనూ చింతల వెంకటేశ్వర్ రెడ్డి కూడా ఈ విషయాన్ని బహిరంగంగా చెబుతున్నారు.

నకిరేకల్ లో వేముల వీరేశం కూడా టిక్కెట్టు తనదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కొల్లాపూర్ లో జూపల్లి కృష్ణారావు బహిరంగంగా చర్చకు రావాలని సిట్టింగ్ ఎమ్మెల్యేకు షాక్ ఇచ్చారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మహేశ్వరం నియోజకవర్గంలో ప్రస్తుత మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై తీగల కృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఉప్పల్ నియోజకవర్గంలో బొంతు రామ్మోహన్ తానే అభ్యర్థినంటూ విస్తృత ప్రచారం ప్రారంభించేశారు. ఇలా చాలా నియోజకవర్గాల్లోని ఆశావాహులు పోటీదారులపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించడమే కాకుండా తామే అభ్యర్థులమంటూ బహిరంగ ప్రకటనలకు దిగుతున్నారు.

 ఇవిలా ఉంటే.. దివంగత నేత పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి, రెండు మార్లు టీఆర్ఎస్  నుంచి కార్పొరేటర్ గా గెలిచి కూడా పార్టీలో గుర్తింపు దక్కడం లేదంటూ సొంత గూటికి అంటే కాంగ్రెస్ గూటికి చేరారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని బడంగ్ పేట్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి కూడా టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు.  మొత్తం మీద టీఆర్ఎస్ లో ఆల్ ఈజ్ వెల్ కాదు.. ఆల్ ఈజ్ నాట్ వెల్ అన్న వాతావరణం కనిపిస్తున్నది. ముందు ముందు రోజుల్లో ఇది మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

By
en-us Political News

  
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
నారా లోకేష్ నాయకత్వానికి ఈ ఆమోదం, ఈ అంగీకారం అంత సులభంగా ఏమీ రాలేదు. అసలు నారా లోకేష్ రాజకీయాలలో తొలి అడుగులు పడకముందే ఆయన నడకను ఆపేయాలని చూశారు. రాజకీయాలలో ఓనమాలు దిద్దడానికి ముందే ఆయన ఎదుగుదలను అణచివేయాలన్న ప్రయత్నాలు జరిగాయి.
ఆ పార్టీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఈ అంశంపై స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై ప్రశంసలు కురిపించారు. పెరుగుతున్న జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ మరియు లోక్‌సభ స్థానాలను సుమారు 50 శాతం మేర పెంచాలని కేంద్రం భావించడం అభివృద్ధికి సంకేతంగా అభివర్ణించారు. ఈ ప్రక్రియ కోసం ఒక స్పష్టమైన విధివిధానాన్ని అనుసరిస్తుండటం పట్ల వైసీపీకి ఎలాంటి అభ్యంతరాలూ లేవని వాకృచ్చారు.
మహిళా రిజర్వేషన్ ను డిలిమిటేషన్‌తో లింక్ చేయడం కేంద్రం చేస్తున్న పెద్ద కుట్రగా అభివర్ణించారు. మహిళా బిల్లు, డిలిమిటేషన్ రెండూ వేర్వేరు అంశాలన్న కల్వకుంట్ల కవిత.. ఈ రెంటినీ లింక్ చేసి.. మహిళల భుజాలపై తుపాకీ పెట్టి డిలిమిటేషన్ అంశాన్ని కాల్చాలని కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు.
తృణమూల్ నేతల వాహనాలను సోదాలు చేస్తున్న అధికారులు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ కీలక నేతల కాన్వాయ్‌లను ఎందుకు తనిఖీ చేయడం లేదని నిలదీశారు. నిబంధనలు అందరికీ సమానంగా ఉండాలని, కానీ బెంగాల్‌ లో మాత్రం పక్షపాత వైఖరి కనిపిస్తోందన్నారు.
కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సభలో రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును కూడా ప్రవేశపెట్టారు. అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లును సభ ముందు ఉంచారు. నారీ శక్తి వందన్ అధినియమ్ ద్వారా 2029 ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరి అని ప్రభుత్వం పేర్కొంటోంది.
నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత క్రియాశీలక నాయకుడు.
బిహార్ రాజకీయ ముఖచిత్రం మరోసారి అనూహ్య మలుపు తిరిగింది.
2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించి అధికారపగ్గాలు చేపట్టడం వెనుక నిస్సందేహంగా లోకేష్ యువగళం పాత్రదే ప్రధాన, కీలక భూమిక. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో లోకేష్ అత్యంత క్రీయాశీల పాత్ర పోషిస్తున్నారడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు.
నారా లోకేష్ గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు చేరువయ్యారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడమే కాకుండా, పార్టీ ఎన్నికల ప్రచారంలోనూ కీలక పాత్ర పోషించారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించిన తర్వాత పార్టీలో ఆయన ప్రాధాన్యత ఒక్కసారిగా పెరిగింది.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె పర్యటనకు హాజరుకాకూడదని స్థానిక మత్స్యకారులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ నిబంధనను అతిక్రమించి ఎవరైనా జగన్ పర్యటనకు వెడితే.. వారికి ఏకంగా ఒక లక్ష రూపాయల భారీ జరిమానా విధిస్తామని మత్స్యకార సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు.
పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని, పార్టీ సిద్ధాంతాలే నాయకత్వానికి బలం అని విద్య, ఐటి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పిలుపునిచ్చారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.