Publish Date:Sep 22, 2023
కారణాలేమైతేనేం కోర్టుల్లో వ్యాజ్యాలు తేలడానికి తీవ్ర జాప్యం జరుగుతోంది. ఆ విషయంలో ఎవరికీ మరో అభిప్రాయం ఉండే అవకాశం లేదు. అదే సమయంలో అరెస్టులు, కేసుల నమోదు నిబంధనలను, పద్ధతులు పాటించకుండా అడ్డగోలుగా జరిగిపోతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో అక్రమంగా అరెస్టయిన వారి పరిస్థితి ఏమిటి? కోర్టుల నిర్ణయం వెలువడే వరకూ కారాగారంలో ఎదురు చూడాల్సిందేనా? రిమాండ్ లో.. అది శిక్ష కాకపోయినా ఎంతకాలమైనా వేచి చూడాల్సిందేనా?
చంద్రబాబును స్కిల్ కేసులో అక్రమంగా అరెస్టు చేసిన నాటి నుంచీ అందరిలోనూ వ్యక్తమౌతున్న అనుమానాలూ సందేహాలూ ఇవే. ఎందుకంటే చంద్రబాబును స్కిల్ కేసులో కనీసం ఆయన పేరు కూడా ఎఫ్ ఐఆర్ లో లేకపోయినా అర్థరాత్రి అరెస్టు చేశారు. న్యాయం కోసం ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్లపై తీర్పులు వెలువడడం లేదు. వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తికే ఇటువంటి పరిస్థితి ఉంటే ఇక సామాన్యుల గతేమిటన్న భయం జనబాహుల్యంలో వ్యక్తం అవుతోంది.
గత నాలుగున్నరేళ్లకు పైగా జైలులో మగ్గుతున్న కోడికత్తి నిందితుడి శ్రీను పరిస్థితిని ఉదహరిస్తున్నారు. ఈ కేసులో బాధితుడిగా కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వాల్సిన జగన్.. అందుకు సిద్ధంగా లేరు. కేసును మరింత లోతుగా విచారించాలంటూ పిటిషన్లు వేస్తూ.. కోర్టుకు మాత్రం ముఖం చాటేస్తున్నారు. అదే సమయంలో ఆయన ఏ1గా ఉన్న అక్రమాస్తుల కేసులో గత పదేళ్లుగా బెయిలుపై ఉన్నారు. ముఖ్యమంత్రిని కనుక విచారణకు హాజరు కాకుండా మినహాయింపు పొందారు. ఆయన ఆ కేసులో బెయిలు పొంది దశాబ్దకాలం గడిచిపోయింది. ఆ కేసుల విచారణ ఏ స్థాయిలో ఉందో.. ఎప్పుడు విచారణ జరుగుతోందో కూడా ఎవరికీ తెలియని పరిస్థితి. జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ, సీబీఐల దర్యాప్తులో పలు ఆధారాలు స్పష్టంగా లభించాయి. ఆ కేసుకు సంబంధించి ఆస్తుల జప్తు కూడా జరిగింది. కానీ చంద్రబాబుపై కేసు విషయంలో సీఐడీ ఆయనకు నోటీసులు ఇవ్వలేదు. ఆయన పాత్రను ఎస్టాబ్లిష్ చేసే సాక్ష్యాలను కూడా చూపలేదు. కనీసం అరెస్టు చేసే నాటికి ఎఫ్ఐఆర్ లో ఆయన పేరు కూడా లేదు. అయినా రాత్రికి రాత్రి అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ కు తరలించింది. చంద్రబాబు దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ కు కౌంటర్ దాఖలు చేసేందుకు వారం రోజులు గడువు కోరింది.
ఇప్పుడు స్కిల్ కేసులో చంద్రబాబు పాత్రను ఎస్టాబ్లిష్ చేయడానికి ఆయన కస్టడీ కోరుతోంది. కస్టడీలోకి తీసుకుని విచారించి ఆధారాలను సేకరిస్తామని సీఐడీ చెబుతోంది. చంద్రబాబు రిమాండ్ గడువు పూర్తయిపోయింది. దీంతో కోర్టు ఆయన రిమాండ్ ను రెండు రోజులు పొడిగించింది. చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ పూర్తయ్యింది. తీర్పు రిజర్వ్ అయ్యింది. నేడు, రేపు అంటూ ఆ తీర్పు కోసం ఎదురు చూపుల పర్వం కొనసాగుతోంది. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తెలుగురాష్ట్రాలలోనే కాదు.. జాతీయ స్థాయి సహా ప్రపంచ దేశాలలోనూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై తీర్పు రాకముందే ఏపీ మంత్రులు అసెంబ్లీ వేదికగా చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని ప్రకటనలు చేసేస్తున్నారు. కోర్టులో ఉన్న అంశాలపై సభ వేదికగా ప్రసంగాలు దంచేస్తున్నారు. జస్టిస్ డిలైడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అంటారు.. మరి స్కిల్ స్కాం అంటూ చంద్రబాబును అరెస్టు చేసి రెండు వారాలు పూర్తయినా ఇంకా ఆయన పిటిషన్లపై తీర్పులు వెలువడేందుకు ఎదురు చూసే పరిస్థితి రావడాన్ని ఏమంటారు?
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/judgements-delay-in-skill-case-39-162170.html
మస్క్ పెట్టిన పార్టీపై ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఎందుకంటే అమెరికాలో ఒకరు అధ్యక్షులు కావాలంటే.. అందుకు ఫస్ట్ వారు జన్మతహ అమెరికా పౌరులై ఉండాలి. 35 ఏళ్ల పైబడి వయసుగల వారై ఉండాలి. ఆపై 14 ఏళ్ల పాటు అమెరికాలోనే నివాసం ఉండి తీరాలి. వీటిలో ఏవీ మస్క్ కి లేవు. ఆయన దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో పుట్టారు.
తెలంగాణలో మరో రెండున్నర మూడు నెలల్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రధాన పార్టీలు సిద్దమవుతున్నాయి. ముఖ్యంగా, తెలంగాణను రోల్ మోడల్ గా చూపించి జాతీయ స్థాయిలో పునర్జీవనం పొందేందుకు ప్రయత్నిస్తున్న అధికార కాంగ్రెస్ పార్టీ.. స్థానిక సంస్థల ఎన్నికలను, జాతీయ ధృక్కోణంతో చూస్తోంది. అందుకే.. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ సంస్థాగత వ్యవహారాల జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్వయంగా రంగంలోకి దిగారు.
అధికారంలో ఉండగా ఇష్టారీతిగా చెలరేగిపోయినా చెల్లినట్లు, అధికారం కోల్పోయిన తరువాత కూడా చెలరేగిపోతామంటే కుదరదన్న విషయం ఇప్పుడు వైసీపీ నాయకులు, క్యాడర్ కు బాగా ఇప్పుడు తెలిసివస్తోంది.
దేశంలో ఏ మూల ఏ స్కాం జరిగినా అందులో వైసీపీ నేతలు కచ్చితంగా ఉంటారు. గంజాయి స్మగ్లింగ్, డ్రగ్స్ అక్రమ రవాణా ఇలా ఏ నేరం జరిగినా.. అందులో వైసీపీ నేతల ప్రమేయం ఉందని దర్యాప్తు సంస్థలు తేలుస్తున్నాయి.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. సోమవారం (జులై 7) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ ఎన్జీ షెడ్ల వరకూ సాగింది.
కేరళలో నిపా వైరస్ కలకలం రేపుతోంది. వేగంగా విస్తరిస్తున్న ఈ వైరస్ కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాలలో కరోనా నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. క్వారంటైన్ జోన్లు, మాస్కులు అనివార్యం అయ్యాయి.
ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా ఎడ్జ్ బాస్టన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమ్ ఇండియా అద్భుత విజయాన్ని సాధించింది. స్కిప్పర్ శుభమన్ గిల్ ముందుండి జట్టును విజయం దిశగా నడిపించారు. ఈ విజయంతో సిరీస్ ను భారత్ 1-1తో సమం చేసింది.
తిరుమల లో ఈ నెల 15, 16 తేదీలలో శ్రీవారి బ్రేక్ దర్శనాలు ఉండవు. ఆ రెండు రోజులూ శ్రీవారి బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటనలో తెలిపింది.
శ్రీశైలం జలాశయం గేట్లను పరిశీలించిన నిపుణుడు కన్నయ్య నాయుడు..
శ్రీశైలం జలాశయాన్ని రిటైర్డ్ ఇంజినీర్, ప్రాజెక్టుల గేట్లు నిపుణుడు నాగినేని కన్నయ్య నాయుడు ఆదివారం పరిశీలించారు.
పొన్నూరు దాడి ఘటనపై వైసీపీ నాయకులు కావాలనే రాజకీయం చేస్తున్నారని టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో స్మార్ట్ కార్డుల రూపంలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. క్యూఆర్ కోడ్‌తో వివరాలు ప్రత్యక్షమయ్యేలా పాత కార్డుల స్థానంలో కోటిన్నర అగ్రిలో పంపిణీ చేయనుంది.
అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో కలకలం రేపిన ఉగ్ర భంధాలపై పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. రాయచోటిలో దొరి కిన ఉగ్రవాదులతో సన్నిహితంగా మె లిగిన వాళ్లకు సహకరించిన వాళ్లను పోలీసులు గత రెండు మూడు రోజులుగా రహస్యంగా విచారిస్తున్నట్లు సమాచారం.
తెలంగాణలో అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. భద్రాది కొత్తగూడెంలో పాల్వంచ, లక్ష్మీదేవి పల్లి, చుంచుపల్లి, సుజాతనగర్ మండలాలకు చెందిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరీ పత్రాలను స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అందజేశారు.