అమీ కేసులో కడుపుబ్బ నవ్వుకున్న జడ్జి!
Publish Date:Jun 19, 2022

Advertisement
దారిన వెళుతూంటే హఠాత్తుగా ఎవరన్నా కిందపడితే పరుగున వెళ్లి లేవడానికి సాయం చేస్తాం. ఏదన్నా పిల్లో, కుక్కపిల్లో గాయ పడితే దాన్ని పక్కకు తీసికెళ్లి తెలిసిన చికిత్సా చేస్తాం లేదా వాటి యజమానికి అప్పజెప్పడం జరుగుతుంది. అలాంటి సందర్భా ల్లో మనకే గాయమయితే నోరులేని జీవాలు గదా అని వాటిని వదిలేసి దగ్గర్లో ఆస్పత్రికి వెళ్లి ఫస్ట్ ఎయిడ్ చేయించుకోవడం జరుగుతుంది. తప్ప ఆ జీవాల యజమానితో గొడవ పడతామా? వాళ్లు పట్టించుకుంటారా? పట్టించుకున్నా కేవలం సారీ చెప్పి పంపించేస్తారు. అంతకన్నా మనమూ ఏమీ ఆశించం. కానీ అమీ సోమ్లిక్ అందుకు పూర్తి విరుద్ధంగా చేసింది.
ఆ మధ్య ఒకరోజు అనీ అలా షికారుగా వెళుతోంది. ఆమెకు ఓ కుక్క పిల్ల రోడ్డు పక్కనే వున్న కాలవలో పడిపోవడం చూసింది. అంతే ఆమె పరుగున వెళ్లి దాన్ని పట్టుకుని గట్టు మీదకి లాగింది. కుక్క పిల్ల అలా బతికిపోయింది. ఈ క్రమంలో అనీకి గాయాల య్యాయి. కానీ ఆమె దగ్గరలో వున్న ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవడంతోనే ఆగలేదు. తను ఎంతో కష్టపడి ఆ కుక్కపిల్లను రక్షించానని, తానూ గాయపడినందుకు ఆ కుక్కపిల్ల యజమాని తన ఖర్చుల డబ్బు చెల్లించాలని డిమాండ్ చేసింది. తీరా చూస్తే ఆయన ఆమె పక్కింటి వాడే! అయినా సరే తనకు ఖర్చలకింద డబ్బు చెల్లించాల్సిందేనని మొండి కేసింది. కుక్కపిల్లను రక్షించినందుకు ఎంతో థాంక్స్. నీ సేవకు నేను మెచ్చుకుంటున్నానని ఆయన చాలా స్నేహపూర్వకంగానే చెప్పాడు. కానీ అనీ అదేమీ పట్టించుకోలేదు. ఆయనకూ కోపం వచ్చింది. తిట్ట లేదు గానీ ఐదు పైసలిచ్చేది లేదని తెగేసి చెప్పేడు.
అమీకి అంతులేని కోపం వచ్చి కోర్టుకెళ్లింది. మా పక్కింటాయన కుక్కపిల్లను కాలవలో పడి చావకుండా కాపాడాను. ఆ సమయంలో ఎంతో గాయపడ్డాను. అందుకు తగిన ఖర్చులు ఇప్పించాలని కోరింది. కోర్టులో అంతా ఘొల్లున నవ్వారు. జడ్జి గారికీ నవ్వు ఆగలేదు. పొట్టచెక్కలయ్యేలా నవ్వేడాయన! ఏమమ్మా ఏం డిమాండ్ చేస్తున్నావో అర్ధమవుతోందా? అని ప్రశ్నిం చాడాయన. మీరు సరిగానే విన్నారు, నేను అడిగింది అర్ధవంతమయినదే కుక్కపిల్ల యజమాని నుంచి నాకు నష్టపరిహారం ఇప్పించండి అని మళ్లీ కోర్టులో అందరూ వినేలా అరిచి మరీ చెప్పింది. మళ్లీ కోర్టంతా గొల్లున నవ్వారు. ఇలా చిన్న చిన్నవాటికి కోర్టు మెట్లు ఎక్కకూడదు. నువ్వు ఆ మూగజీవి పట్ల ఎంతో ప్రేమతో మంచి పనే చేశావు, దాన్ని చావకుండా బతికించేవు అందు కు కోర్టు నిన్ను మంచి సిటజన్‌గా అభినందిస్తున్నది అన్నాడాయన.
కానీ అమీ మాత్రం మొండికేసింది. రోడ్డు మీద ప్రమాదాలు జరుగుతున్నప్పుడు గాయపడినవారికి నస్టపరిహారం ఇప్పిస్తుంటారు గదా మరి ఈ కేసులో నాకు నష్ట పరిహారం ఇవ్వడానికి ఎందుకు కాదంటున్నారని కోర్టును అమీ నిలదీసింది. ఇది కేవలం మూగజీవుల రక్షణ విషయంలో నిన్ను అభినందించడం తప్ప ఆ యజమానిని కోర్టుకు ఈడ్చడానికి కుదరదని తేల్చి చెప్పింది. ఇలాంటి అర్ధంలేని వాదనలు చేయవద్దని హెచ్చరించింది. నీకు గాయమయింది. అందుకు కుక్కపిల్ల యజమానితో మాట్లాడి నీవే ఆయన నుంచి ఏదయినా పొందవచ్చుగాని ఇలా కోర్టుకు ఎక్కడంలో అర్ధంలేదని జడ్జి కేసును కొట్టేసి ఆమెను మందలించి పంపించేసేరు. ఇది న్యూజెర్సీ వాసులు చాలారోజులు గుర్తు తెచ్చుకుంటూ సరదాగా నవ్వుకుంటారేమో!
http://www.teluguone.com/news/content/judge-cint-stop-laughing-in-that-case-25-137970.html












