Publish Date:Aug 18, 2025
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో అభ్యర్థిని ఎంపికచేయడంలో బీఆర్ఎస్ మల్లగుల్లాలు పడుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతితో ఏర్పడిన ఖాళీకి త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఉప ఎన్నిక కోసం అప్పుడే కాంగ్రెస్ ప్రచారం ఆరంభించేసింది. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, గడ్డం వివేక్ లు ఇప్పటికే నియోజకవర్గంలో పర్యటనలు మొదలెట్టేశారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరన్నది ఖరారు కాకపోయినప్పటికీ, అభ్యర్థితో సంబంధం లేకుండా పార్టీ అభ్యర్థి విజయం కోసం వ్యూహరచన చేస్తున్నారు.
గతంలో ఈ నియోజకవర్గంలో ని ఒక వర్గం ఓటర్లతో పరిచయాలు ఉన్న మంత్రి తుమ్మలకు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బాధ్యతలు అప్పగించింది. దీంతో మంత్రి పొన్నంతో కలిసి ముఖ్య కార్యకర్తల సమావే శాలు నిర్వహిస్తూ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలన్న పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ లు మాత్రం నోటిఫికేషన్ వచ్చాక, అభ్యర్థుల ఎంపిక తరువాత అన్నట్లుగా సైలెంట్ గా ఉన్నాయి. అయితే సిట్టింగు సీటును ఎలాగైనా దక్కించుకోవాలని భావిస్తున్న బీఆర్ఎస్ ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసొస్తుందన్న ఆశతో బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. అయితే అభ్యర్థి ఎంపిక విషయంలో మాత్రం బీఆర్ఎస్ లో అయోమయం నెలకొంది. దివంగత ఎమ్మెల్యే మాగంటి కుటుంబంలో ఒకరిని బరిలో దింపాలని చూస్తున్నారు.
దీనికి కొంత వ్యతిరేకత వస్తుందనే అభిప్రాయమూ వ్యక్తమౌతోంది. పి. జనార్దన్ రెడ్డి తనయుడు జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణు పేరును కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులలో అన్నీ హంగులు ఉన్న వ్యక్తిని ఎంపికచేయాలనే ఆలోచనా చేస్తున్నారు. ఉప ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వం పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని నిరూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాని అభ్యర్థి ఎంపిక విషయంలో మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఇక బీజేపీ పార్టీలో స్థానికంగా ఉన్న వారిలో ఒకరిని ఎంపికచేసే ఆలోచన చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా హైకమాండ్ ఎవరిని ఖరారు చేస్తే వారిని గెలిపించుకుని సత్తా చాటాలన్న పట్టుదలతో ఉంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jubleehills-bypoll-brs-in-confussion-25-204431.html
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!