Publish Date:Aug 18, 2025
తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు 14 నెలల తరువాత వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగుపెట్టనుండటమే ఇందుకు కారణం. నియోజకర్గంలో ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరిస్తానంటూ పెద్దారెడ్డి తాడిపత్రి రానున్నారు. ఆయన తాడిపత్రి ప్రవేశానికి కోర్టు నుంచి అనుమతి కూడా లభించింది.
తాము విధించిన షరతులకు లోబడే తాడిపత్రి పర్యటన ఉండాలన్న షరతు విధించింది. దీంతో సోమవారం (ఆగస్టు18) తాడిపత్రిలో అడుగుపెట్టేందుకు పెద్దారెడ్డి రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం నేత జేసీ ప్రభాకరరెడ్డి అడ్డుకునే ప్రయత్నాలు చేస్తారన్న భావనతో ఆయనకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మొత్తం మీద పెద్దారెడ్డి ఎంట్రీ నేపథ్యంలో తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని రాకుండా మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి గత కాలంగా అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే . ఈ నేపథ్యంలోనే పెద్దారెడ్డి హైకోర్టును ఆశ్రయించి తాడిపత్రి లోకి ప్రవేశించేందుకు అనుమతి తెచ్చుకున్నారు.కోర్టు కూడా పెద్దారెడ్డికి భద్రత కల్పించి తాడిపత్రిలోకి అనుమతించాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో పెద్దారెడ్డి సోమవారం (ఆగస్టు 18) తాడిపత్రి బయలుదేరారు. అయితే ఇదే సమయంలో జేసీ ప్రభాకరరెడ్డి తాడిపత్రిలో శివుడి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమానికి భారీగా హాజరుకావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. దీంతో ఉద్రిక్తతలు పెచ్చరిల్లి ఘర్షణకు దారి తీసు ప్రమాదం ఉందన్న భావనతో తాడిపత్రికి బయలుదేరిన పెద్దిరెడ్డిని పోలీసులు మార్గమధ్యంలో నే అడ్డుకున్నారు. శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా తాడిపత్రికి రావద్దంటూ పెద్దిరెడ్డికి చెబుతున్నారు. కోర్టు అనుమతితో వస్తున్న తననెలా అడ్డుకుంటారని పెద్దారెడ్డి పోలీసులను నిలదీస్తున్నారు. మొత్తం మీద తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం పోలీసులను ఇరకాటంలో పడేసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/hi-tenssion-in-tadipatri-25-204428.html
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!