Publish Date:Aug 29, 2024
జమ్మూకశ్మీర్ ఎన్నికలలో తాను పోటీ చేయడం లేదని పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ నాయకురాలు మెహబూబా ముఫ్తీ ప్రకటించారు. కేంద్ర పాలిత ప్రాంతంలో తమ పార్టీ తన విధానాలను అమలు చేయలేదని ఆమె చెప్పారు. తాను గతంలో సీఎంగా ఉన్నప్పుడు 12 వేల మందిపై ఉన్న ఎఫ్ఐఆర్‌లు రద్దు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు జమ్ము కాశ్మీర్‌లో లేవని అన్నారు. ముఖ్యమంత్రి పీఠం మీద వుండి కూడా ఒక్క ఎఫ్ఐఆర్‌ని కూడా వెనక్కి తీసుకోలేని స్థితిలో వుంటే, ఆ ముఖ్యమంత్రి పదవే అనవసరం అని ఆమె వ్యాఖ్యానించారు. ఇదిలా వుంటే, జమ్ము కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్నంతవరకు తాము ఎన్నికలకు దూరంగా ఉంటామన్న నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. త్వరలో జరగనున్న ఎన్నికలలో పోటీ చేయనున్నట్టు ప్రకటించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jk-elections-mehbooba-mufti-25-183852.html
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వ్యవహారశైలిని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
హైదరాబాద్ నగరవాసుల ప్రయాణ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది.
కొత్త కారు కొనుక్కోవాలని ఎన్నో రోజులుగా కలలు కంటారు.. ఆ కల నెరవేరిన రోజు ఆ ఆనందమే వేరు! ఎంతో ఇష్టపడి కొత్త బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేసిన ఓ వ్యక్తి..
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త వాతావరణం నెలకొంది.
మహారాష్ట్రలోని ప్రఖ్యాత హిందూ హృదయసమ్రాట్ బాలాసాహెబ్ థాకరే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్‌పై జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి కెప్టెన్‌పై జరిగిన కత్తిదాడి అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు వేగవంతమైంది.
హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతల నిర్వహణను మరింత సమర్థంగా చేపట్టేందుకు పోలీస్ శాఖలో భారీ పునర్వ్యవస్థీకరణ చేపట్టారు.
దసరా పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
ఖైరతాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది.