గచ్చిబౌలిలో ఘోరం... ఉన్మాది దాడిలో యువతి మృతి!

Publish Date:Aug 29, 2024

Advertisement

హైదరాబాద్ నగరంలో మరో కామోన్మాది రెచ్చిపోయాడు. ఒక యువతిని దారుణంగా హత్య చేశాడు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. గచ్చిబౌలి ప్రాంతంలోని గోపనపల్లి తండాలో ప్రేమ పేరుతో ఒక ఉన్మాది దాడి చేయడంతో దీపన తమాంగ్ అనే 32 సంవత్సరాల యువతి మరణించింది. ఉన్మాది దాడిలో మరో ముగ్గురు గాయపడ్డారు. బుధవారం రాత్రి ఈ ఘోరం జరిగింది. 

కర్ణాటకలోని బీదర్‌కి చెందిన రాకేష్ పశ్చిమ బెంగాల్‌కి చెందిన దీపన తమాంగ్‌కి కొన్నేళ్ళుగా పరిచయం వుంది. రాకేష్, దీపన చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు. తనను పెళ్ళి చేసుకోవాలని దీపనని రాకేష్ చాలాకాలం నుంచి అడుగుతున్నాడు. అయితే దీపన నిరాకరిస్తోంది. బుధవారం రాత్రి దీపన ఇంటికి రాకేష్ వెళ్లాడు. అక్కడే ఉన్న కూరగాయల కత్తితో దీపనపై దాడి చేశాడు. దీంతో దీపన అక్కడికక్కడే మరణించింది. అడ్డుకునేవారి మీద కూడా రాకేష్ దాడి చేయడంతో వాళ్ళు కూడా గాయపడ్డారు. దాడి తర్వాత రాకేష్ మొయినాబాద్ సమీపంలోని కనకమామిడి వద్ద ఆత్మహత్యకు యత్నించాడు. విద్యుత్ స్తంభం ఎక్కేందుకు ప్రయత్నించడంతో షాక్ తగిలి గాయాలయ్యాయి. గచ్చిబౌలి పోలీసులు రాకేష్‌ని ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

By
en-us Political News

  
కనీస ధర రూ.30కి పెంపునకు సిఫార్సు.!
వెబ్‌సిరీస్‌ ల్లో ఎక్కువగా బ్యాంకులు, బంగారు దుకాణాల్లో దోపిడీలకు సంబంధించిన వీడియోలే చూసేవాడు.. ఆ తర్వాత తనకున్న ఆర్మీ అనుభవాన్ని ఉపయోగించుకోని సికింద్రాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌ను ఎంచుకున్నాడు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వ్యవహారశైలిని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
హైదరాబాద్ నగరవాసుల ప్రయాణ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది.
కొత్త కారు కొనుక్కోవాలని ఎన్నో రోజులుగా కలలు కంటారు.. ఆ కల నెరవేరిన రోజు ఆ ఆనందమే వేరు! ఎంతో ఇష్టపడి కొత్త బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేసిన ఓ వ్యక్తి..
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త వాతావరణం నెలకొంది.
మహారాష్ట్రలోని ప్రఖ్యాత హిందూ హృదయసమ్రాట్ బాలాసాహెబ్ థాకరే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్‌పై జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి కెప్టెన్‌‌పై జరిగిన కత్తిదాడి అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.
మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు వేగవంతమైంది.
హైదరాబాద్‌ నగరంలో శాంతిభద్రతల నిర్వహణను మరింత సమర్థంగా చేపట్టేందుకు పోలీస్‌ శాఖలో భారీ పునర్వ్యవస్థీకరణ చేపట్టారు.
దసరా పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.