ఖైరతాబాద్ ఉపఎన్నికపై ట్విస్ట్: ఈసీఐ కీలక ప్రకటన.!

Publish Date:Oct 1, 2026

Advertisement

ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉపఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఒకవైపు ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అనర్హతతో నియోజకవర్గం ఖాళీ కాగా.. మరోవైపు ఉపఎన్నిక నోటిఫికేషన్‌ విషయంలో హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది.ఖైరతాబాద్‌ ఉపఎన్నికకు సంబంధించి కాంగ్రెస్‌ నేత పి. విజయారెడ్డి దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్‌ తుది పరిష్కారం అయ్యే వరకు ఉపఎన్నిక నోటిఫికేషన్‌ జారీ చేయబోమని భారత ఎన్నికల సంఘం (ECI) హైకోర్టుకు తెలిపింది. విజయారెడ్డి 2024లోనే దానం నాగేందర్‌ ఎన్నికను సవాల్‌ చేస్తూ ఎన్నికల పిటిషన్‌ దాఖలు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్‌ నుంచి దానం నాగేందర్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా గెలిచారు. 

అనంతరం ఆయన కాంగ్రెస్‌లో చేరారు. పార్టీ ఫిరాయింపుపై దాఖలైన పిటిషన్ల నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు సెప్టెంబర్‌ 18న దానం నాగేందర్‌ను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించింది. ఆ తర్వాత ఖైరతాబాద్‌ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు గెజిట్‌ నోటిఫికేషన్‌ వెలువడింది. దానం నాగేందర్‌ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్‌ చేసినప్పటికీ.. సెప్టెంబర్‌ 24న ఆయన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. 

దీంతో ఖైరతాబాద్‌కు ఉపఎన్నిక జరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో 2024లో దానం నాగేందర్‌ ఎన్నికను సవాల్‌ చేస్తూ తాను దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్‌ తుది తీర్పు వచ్చే వరకు ఉపఎన్నిక నోటిఫికేషన్‌ ఇవ్వకుండా ఈసీఐని ఆదేశించాలని విజయారెడ్డి తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఎలక్షన్‌ పిటిషన్‌ పెండింగ్‌లో ఉన్నందున ఖైరతాబాద్‌కు ఉప ఎన్నిక నిర్వహించబోమని ఈసీఐ హైకోర్టుకు తెలిపింది. ఇప్పుడు ఈ పిటిషన్‌పై హైకోర్టు తీసుకునే నిర్ణయం కీలకంగా మారింది. కోర్టు విచారణ నేపథ్యంలో ఖైరతాబాద్‌ ఉపఎన్నిక నోటిఫికేషన్‌ ఎప్పుడు వెలువడుతుందన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. దీంతో ఖైరతాబాద్‌ ఉపఎన్నికపై రాజకీయ ఆసక్తితో పాటు న్యాయపరమైన ఉత్కంఠ కూడా కొనసాగుతోంది.

 

 

 

[ Khairatabad by-election notification, Telangana High Court, Danam Nagender, Election Commission, Vijaya Reddy, CM Revanth reddy, BRS Party, KTR, Telugu One, Telugu News ]

By
en-us Political News

  
ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ దాడిలో తీవ్రంగా గాయపడినా.. అసాధారణ ధైర్యసాహసాలతో 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన
కృత్రిమ మేధ (AI) ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తున్న వేళ.. దాని భవిష్యత్తుపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామంలో సెప్టెంబర్ 22న జరిగిన 18 ఏళ్ల నర్సింగ్ విద్యార్థిని ఇంద్రపల్లి హరిణి హత్య ఉదంతం
మోసపోయాం.. గోసపడుతున్నాం..సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఆగ్రహం.!
రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో కోకాపేట్‌ నియోపోలిస్‌ వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికల అంశం మరోసారి అత్యంత వేడెక్కింది
విద్యావలయంలో గంజాయి మొక్క కలకలం..!
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
రా బిడ్డా.. అసెంబ్లీకి’.. KTRకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్.!
భారతీయ రైల్వేలో ప్రయాణం చేయడానికి ప్రయాణికులు చాలా కాలం ముందే టికెట్లను రిజర్వ్ చేసుకుంటూ ఉంటారు.
తండ్రి అంటే పిల్లలకు ఉండే ప్రాణం, ఆప్యాయత ఎంతో గొప్పవి. కానీ ఆ ప్రేమ కొన్నిసార్లు ఊహకందని వింత నిర్ణయాలకు దారితీస్తుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.