కేంద్ర మంత్రి వర్గంలోకి జేడీయూ! 

Publish Date:Jun 23, 2021

Advertisement

కేంద్ర మంత్రివర్గ విస్తరణ లేదా పునః వ్యవస్థీకరణ ఎప్పుడు ఉటుంది? ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ఈ ప్రశ్న చక్కర్లు కొడుతోంది. అయితే, ఈ విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. కొద్ది రోజుల క్రితం వరకు జోరుగు సాగిన ఊహాగానాలు కూడా కొంత సర్దు కున్నాయి. అదలా ఉంటే గతంలో పిలిచి బెర్తు ఇస్తామంటే అలిగి వద్దు పొమ్మన్న జనతాదళ్ (యు), ఇప్పుడు పిలిస్తే చాలు ఎగిరి గంతేసేందుకు సిద్ధంగా ఉంది. అంతే కాదు మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడు ఉంటుందా, అని వేయి కళ్ళతో ఎదురు చూస్తోంది. ఎన్డీఎ వరసగా రెండవ సారి, 2019లో ప్రధాని నరేంద్ర మోడీ సారధ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సమయంలోనే, ప్రధాని మోడీ, మిత్రపక్షం జేడీ(యు)ను మంత్రివర్గంలోకి  చేరమని కోరారు. అయితే, జనతాదళ్(యు) నుంచి ఒక్కరికి మాత్రమే అవకాశం ఉంటుందని స్పష్టం చేయడంతో బేరం బెడిసి కొట్టింది. ఒక్కటే బెర్త్ అయితే వద్దుపొమ్మని, జనతా దళ్(యు) అధ్యక్షుడు, బీహార్ ముఖ్యమంత్రి అలక పానుపు ఎక్కారు. 

అయితే ఇప్పుడు దేశంలో, రాష్ట్రంలో శరవేగంగా మారుతున్నరాజకీయ సమీకరణల నేపధ్యంలో, జనతా దళ్(యు) కేంద్ర మంత్రివర్గంలో చేరేందుకు ఉత్సాహం చూపుతోంది. మరోవంక బీజేపీ కూడా, త్వరలో జరగనున్న ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని  మంత్రివర్గ విస్తరణలో మిత్రపక్షాలకు పెద్ద పీట వేయాలని నిర్ణయానికి వచ్చింది. అందులోనూ, బీహార్’ను అనుకుని ఉన్న యూపీలోని పూర్వాంచల్ ప్రాంతంలో పటేల్ /కుర్మీ తెగలకు చెందిన ఓటర్లపై నితీష్ కుమార్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ దృష్టా కూడా బీజేపీ నితీష్ కుమార్ తో బంధాన్ని బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర మంత్రి వర్గంలో ఒకటి కంటే ఎక్కువ బెర్తులే సిద్దం చేస్తోందని అంటున్నారు.

కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉహాగానాలు షికార్లు చేస్తన్న సమయంలోనే, సోమవారం నితీష్ కుమార్ ఢిల్లీ వెళ్ళడంతో జనతాదళ్ (యు), కేంద్ర మంత్రివర్గంలో చేరడం ఖయమైపోయినట్లేనని ఢిల్లీ రాజకీయ వర్గాల్లో వినవస్తోంది. ఈ ఉహగానాలకు బలాన్నిచ్చే విధంగా,  జనతాదళ్ (యు) జాతీయ అధ్యక్షుడు ఆర్సీపీ  సింగ్, బీహార్ లో మా రెండు పార్టీలు (జనతాదళ్ (యు),బీజేపీ) అధికారాన్ని పంచుకుంటున్నాయి, కాబట్టి, కేంద్ర మంత్రి వర్గంలో జనతాదళ్ (యు), చేరినా ఆశ్చర్య పోనవసరం లేదని అన్నారు. అయితే నితీష్ కుమార్ ఢిల్లీ పర్యటనకు, మంత్రివర్గ విస్తరణపై జరుగుతున్న ఉహాగానాలకు సంబంధం లేదని అయన అన్నారనుకోండి, అది వేరే విషయం.ప్రస్తుతం జనతా దళ్ (యు)కు లోక్ సభలో 16మంది  రాజ్య సభలో ఐదుగురు సభ్యులున్నారు. 

ఇటేవల లోక్ జన శక్తి (ఎల్జీపీ) చిలీక వచ్చిన నేపధ్యంలో, చీలిక వర్గం  నేత పశుపతి పరసకు మంత్రి వర్గంలో స్థానం లభించే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే, బీహార్ నుంచి బీజేపీ కోటాలో, రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీకి అవకాశం ఉంటుందని అంటున్నారు.అదే విధంగా జనత దళ్ జాతీయ అద్యక్షుడు ఆర్సీపీ సింగ్ కూడా కేంద్ర మంత్రివర్గంలో బెర్త్ కన్ఫరం అయిందని అంటున్నారు. అయితే, 2017 నుంచి ఇదేమాట వింటున్నానని , సింగ్ అన్నారు. అయితే ఇంతకీ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడుంటుంది, అనేది మాత్రం ఇంకా స్పష్టం కాలేదు. అది అయితేనే గానీ, ఊహాగానాలు చల్లారావు.

By
en-us Political News

  
ఏపీకి రాజధాని ఏది? అమరావతి శాశ్వతమా లేక మావిగాన్ అంటూ జగన్ చేసిన ప్రతిపాదనతో మళ్లీ రాజధానిపై జనంలో అనుమానాలు మొదలయ్యాయా? అన్న చర్చ మొదలైంది. ఏపీ రాజధాని విషయంలో మరో ప్రయోగం మొదలుకాబోతోందా? అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిబా ఫూలే 200వ జయంతి వేడుకలు దేశరాజధానిలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్లమెంటు ఆవరణలోని ప్రేరణా స్థల్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దేశాధినేతలు, రాజకీయ దిగ్గజాలు ఒకే వేదికపైకి వచ్చారు. రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉండే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ కార్యక్రమంలో పాల్గొని ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.
బీజేపీకి ఓటేస్తే.. సామాజిక న్యాయానికి పాడె కట్టడమేనన్నారు. రాష్ట్రంలోని బీజేపీని అడుగుపెట్టనీయవద్దని, ఒక్క సీటు కూడా వారికి ఇవ్వకుండా తమిళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పరకాల కోరారు.
అమరావతికి సాక్షాత్తూ పార్లమెంటు సాక్షిగా చట్టబద్ధ రాజధానిగా గుర్తింపు లభించిన తరువాత కూడా సజ్జల మౌలిక వసతులు లేని ప్రాంతంలో వేలకోట్టు కుమ్మరిస్తోందంటూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. ఇప్పుడు కూడా అమరావతి అభివృద్ధి కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్నా.. గ్రాఫిక్స్ రాజధాని అంటూ పాత పాటే పాడారు సజ్జల.
ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో జరిగిన ఈ సమావేశం అత్యంత ఆత్మీయంగా, భావోద్వేగాల మధ్య సాగింది. చాలా కాలం తర్వాత తన పాత మిత్రుడిని కలిసిన జీవన్ రెడ్డి ఒ ఉద్వేగానికి లోనయ్యారు.
గత కొంతకాలంగా తనపై సాగుతున్న అభిశంసన ప్రక్రియ, అలాగే నివాసంలో లభించిన లెక్కకు రాని నగదు వివాదం నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు.
రాజ్యసభ ఎంపీగా ప్రమాణం చేసిన అనంతరం నితీశ్ కుమార్ ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న బీహార్ ముఖ్యమంత్రి పదవికి మరో మూడు నాలుగు రోజుల్లో రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు. తాను లేని పక్షంలో రాష్ట్ర బాధ్యతలను కొత్త ముఖ్యమంత్రి, మంత్రుల బృందం సమర్థవంతంగా నిర్వహిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు.
వైసీపీ సోషల్ మీడియా మాజీ కోఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డిపై జారీ అయిన లుక్ అవుట్ సర్క్యులర్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. విచారణలో భాగంగా న్యాయమూర్తులు రాజకీయ ఫ్లెక్సీలపై స్పందిస్తూ.. ఎవరిని ధ్వంసం చేయాలని చూస్తున్నారు? 2029లో రాష్ట్రాన్నా లేక ప్రజలనా? అంటూ ప్రశ్నించారు.
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో తమకు ఉన్న అనుబంధం ఎంతో గొప్పదని చెప్పుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. వైఎస్ మరణం వెనుక వైఎస్ జగన్ హస్తం ఉందంటూ అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై బొత్స తీవ్రంగా స్పందించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదానికి గురైన రోజున జరిగిన పరిణామాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
జీవన్ రెడ్డి, కేటీఆర్ లు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ సూచన మేరకే సహచరులతో కలిసి జీవన్ రెడ్డిని సాదరంగా ఆహ్వానిం చేందుకు ఆయన నివాసానికి వచ్చినట్లు చెప్పారు. 2014 ఎన్నికలకు ముందే కేసీఆర్ జీవన్ రెడ్డిని బీఆర్‌ఎస్‌లో చేరాలని ఆహ్వానించారన్నారు.
ల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవిపై ఎన్నికల అక్రమాల ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మిరాకిల్ సాఫ్ట్ వేర్ సంస్థ ద్వారా ఉద్యోగుల ఖాతాల్లో భారీగా నగదు జమ చేసి.. ఆ నగదును ఎన్నికల ఖర్చులకు మళ్లించారనే ఫిర్యాదు ఈసీకి చేరింది. దీనిపై సమగ్ర విచారణకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇక వేళ ఆ ఆరోపణలు నిజమని రుజువైతే.. ఆమె పదవికి ముప్పు ఉండొచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కడప జిల్లా నేతలలైన పుట్టా సుధాకర్, వరదరాజులు రెడ్డి, మాధవి రెడ్డిపై లోకేష్ ఫైరయ్యారు. ఈ నెల మొదటి వారంలో జరిగిన సమీక్షలో, నారా లోకేష్ కడప జిల్లా నేతలపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా ఫిర్యాదుల విన్నపం కార్యక్రమాలకు ఈ నేతలు హాజరుకాకపోవడంపై నిలదీసినట్లు చెబుతున్నారు.
రాజకీయాల్లో నిరంతరం ఉండే సవాళ్లు, మానసిక ఒత్తిడి కారణంగానే తాను దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడ్డానన్న రోజా.. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత తనకు బ్లడ్ ప్రషర్ సమస్య వచ్చిందనీ, ఇక రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిని అయిన తరువాత డయాబెటిస్ అటాక్ అయ్యిందనీ వివరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.