జనసేన తెలుగుదేశంకు బలం కాదు బరువు

Publish Date:Jun 9, 2022

Advertisement

ఏపీలో పొత్తుల పై రాజకీయ పార్టీల మధ్య సంప్రదింపులే కాదు.. సామాన్య జనంలో చర్చోపచర్చలూ జరుగుతున్నాయి. ముఖ్యంగా జనసేనాని పవన్ కల్యాన్ ఆప్షన్లు అంటూ చేసిన ప్రకటనతో రాష్ట్రంలో సామాన్య జనంలో ఈ చర్చ మరింత జోరందుకుంది. అయితే ఈ చర్చల్లో జనసేనాని అప్షన్లపై ప్రజలలో అసహనం కనిపిస్తున్నది. తనను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలన్న ఆయన మనోభీష్టంపై సామాజిక మాధ్యమంలో ట్రోలింగ్ ఒక రేంజ్ లో సాగుతోంది.

బలం ఏమిటో తెలియకుండా నేల విడిచి సాము చేయడంలా ఉంది ఆయన వైఖరి అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక తెలుగుదేశం వర్గాలలో అయితే పవన్ ఆప్షన్లపై ఓ రేంజ్ లో ఆగ్రహం వ్యక్తమౌతోంది. రాష్ట్రంలో బలమైన విపక్షంగా తెలుగుదేశం జనసేనను కానీ, జనసేన పార్టీని కానీ భుజాన మోయాల్సిన పని లేదని తెలుగుదేశం వర్గాలు విస్పష్టంగా చెబుతున్నాయి. పవన్ కల్యాణ్ స్వయంగా రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల నివ్వం అంటూ చేసిన ప్రకటన కారణంగానే  ఆ పార్టీతో పొత్తు అన్న చర్చ తెరమీదకు వచ్చింది తప్ప.. తెలుగుదేశం పార్టీకి జనసేనానితో అంటకాగాల్సిన అవసరం ఇసుమంతైనా లేదని తెలుగుదేశం వర్గాలు బాహాటంగా చెబుతున్నాయి.

పొత్తు ఉన్నా లేకున్నా తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో విజయం సాధించి అధికారంలోకి రావడం తథ్యమన్న ధీమా ఆ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. జనసేన అధినేతను మోయాల్సిన అవసరం పార్టీకి లేదన్ని ఆ వర్గాలు కుండ బద్దలు కొడుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనీయను అన్న జనసేన మాటల వెనుక వ్యూహం ఏమిటన్నది, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలన్న ఆయన ఆకాంక్షను బయటపెట్టుకోవడంతోనే  బహిర్గతమైపోయిందని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి.

ఆపరేషన్ టు డిస్ట్రాయ్ తెలుగుదేశం అన్నదే ఆ కుట్ర అని తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి. ప్రస్తతం రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలూ వైసీపీ పాలన పట్ల విసిగిపోయి ఉన్నారని తెలుగుదేశం వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అందుకే ప్రభుత్వ వ్యతిరేక ఓటే కాకుండా, గత ఎన్నికలలో వైసీపీకి పడిన ఓట్లలో కూడా అధిక భాగం ఈ సారి  తెలుగుదేశం కైవసం చేసుకంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. పొత్తు అంటూ ముందుకు వచ్చి తెలుగుదేశం గెలిచే సీట్ల సంఖ్యను తగ్గించడమే జనసేన వ్యూహమని ఆ వర్గాలు అంటున్నాయి.

పొత్తులో భాగంగా ఓ 50 అసెంబ్లీ స్థానాలను జనసేన డిమాండ్ చేస్తుందనీ, ఆ పార్టీకి అన్ని సీట్లు గెలిచే సత్తా లేదనీ తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి. ఇందులో వ్యూహమేమిటంటే తెలుగుదేశం గెలిచే స్థానాలను పరిమితం చేయడమేనని పేర్కొంటున్నారు. అధిక స్థానాలలో అదీ తెలుగుదేశం గెలిచే స్థానాలకు పట్టుబట్టడం ద్వారా వైసీపీ ఎక్కువ నియోజకవర్గాలలో గెలిచేందుకు సహకరించాలన్నదే జనసేనాని వ్యూహంగా కనిపిస్తోందని వివరిస్తున్నాయి.  అందుకే జనసేనతో పొత్తు తెలుగుదేశం పార్టీకి  భారమే అవుతుందని తెలుగు దేశం పార్టీ వర్గాలు అంటున్నాయి.  

By
en-us Political News

  
 పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ  అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ  దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు.    ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు నగర పంచాయతీల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఎటువంటి పెద్ద అవాంతరాలు
YS Jagan Mohan Reddy, Pulivendula Elections, YS Jagan Protest, YSRCP, Bengaluru, Municipal Elections, Polling Irregularities, Andhra Pradesh Politics, YS Jagan News, Pulivendula Polling
దిల్లీలోని ప్రఖ్యాత కనాట్ ప్లేస్ ప్రాంతంలో దుకాణాలను అధికార భారతీయ జనతా పార్టీ (BJP) బలవంతంగా మూసివేయించిందని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
పులివెందుల మున్సిపల్‌ ఎన్నికల్లో పోలింగ్‌ అక్రమాలు చోటుచేసుకున్నాయని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు
ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ వేళ.. కడప జిల్లా పులివెందులలో రాజకీయ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.
సమాజంలో రోజురోజుకూ పెరిగిపోతున్న దారుణాలు, హేయమైన నేరాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. ప్రశాంతంగా సాగేనా.?
గర్ల్స్ హాస్టల్ ముసుగులో అండాల అక్రమ దందా గుట్టురట్టు
బెంగళూరు నగరంలోని ఒక ప్రతిష్టాత్మక లగ్జరీ హోటల్‌లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
అర్నబ్ తుపాను నష్టాల నుంచి రాష్ట్రాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చే పునరుద్ధరణ పనులను వేగవంతం చేయడంతో
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.