Publish Date:Dec 18, 2022
వివాహాలు వేడుకగా జరుపుకుంటారు. స్థోమతను బట్టి ఘనంగా చేసుకుంటారు. ఆకాశమంత పందిరి.. అంటూ వివాహం ఎంత ఘనంగా జరుపుకున్నారో చెప్పుకోవడానికి అతిశయోక్తులు కూడా ఉన్నాయి. ఇక కొంత మంది కమ్యూనిస్టు వివాహాలు చేసుకుంటారు. ఆడంబరంగా ఖర్చు లేకుండా స్టేజి పెళ్లిళ్లు చేసుకుంటారు. కలిసి అన్యోన్యంగా ఉంటామని ప్రతిజ్ణ చేస్తారు.
ఇక రిజిస్టర్ మ్యారేజీ లు ఉండనే ఉన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఓ జంట మాత్రం తమ వివాహ వేడుకలో వినూత్న పద్ధతిని అనుసరించారు. ఆ కొత్త జంట జనసేన కార్యకర్తలు అవునా కాదో.. తెలియదు. ఇంతకీ ఆ జంట వివాహం ఎప్పుడు ఎక్కడ జరిగిందో తెలియదు కానీ, వారి పెళ్ల ఫొటోలు మాత్రం నెట్టింట తెగ వైరల్ అయిపోయాయి. ఇంతకీ వారు పెళ్లిలో అనుసరించిన వినూత్న పద్ధతి ఏమిటంటే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీద అపారమైన అభిమానం ఉన్న ఆ జంత తమ పెళ్లితో దండలతో పాటు జనసేన కండువాలనూ మార్చుకున్నారు.
ఒకరి మెడలో ఒకరు దండలు వేసుకోవడమే కాకుండా జనసేన కండువాలు కూడా కప్పుకున్నారు. దీంతో వీరి పెళ్లి ఫొటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. అభిమానమంటే ఇదేరా భాయ్ అంటూ నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు. జనసేన ప్రచారానికి ఇదో కొత్త దారి అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి జనసేన కండువాలతో జరిగిన పెళ్లిపై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/janaesna-scarves-changed-in-marriage-25-148694.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.