Publish Date:Dec 18, 2022
బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమ్ ఇండియా 188 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 513 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా 324 పరుగులకు ఆలౌటైంది. దీంతో రెండు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. ఆఖరి రోజైనా ఆదివారం ఓవర్ నైట్ స్కోరు 272/6 తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన బంగ్లాదేశ్ మరో 52 పరుగులు జోడించి మిగిలిన నాలుగు వికెట్లు కోల్పోయింది.
అక్షర్ పటేల్ నాలుగు, కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టగా ఉమేశ్ యాదవ్, సిరాజ్, అశ్విన్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో పుజారా 90, శ్రేయస్ అయ్యర్ 86 పరుగులతో రాణించడంతో 404 పరుగులకు ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన బంగ్లా 150 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్‌కు 254 పరుగుల ఆధిక్యం లభించింది.
బంగ్లాను ఫాలో ఆన్ ఆడించే అవకాశం ఉన్నప్పటికీ కూడా కెప్టెన్ రాహుల్ మరోసారి బ్యాటింగ్ చేసేందుకే మొగ్గు చూపాడు. రెండు ఇన్నింగ్స్ లో శుభ్‌మన్(110), పుజారా(102 నాటౌట్) శతకాలు బాదారు. భారత్ తన రెండో ఇన్నింగ్స్ ను 258/2 స్కోర్ వద్ద డిక్లేర్ చేసి బంగ్లాదేశ్ ముందు 513 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.
అయితే బంగ్లా 324 పరుగులకే కుప్పకూలింది. కుల్దీప్ యాదవ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్ లో కలిపి కల్దీప్ యాదవ్ ఎనిమిది వికెట్లు తీశాడు. ఇరు జట్ల మధ్య రెండో, చివరి టెస్టు డిసెంబర్ 22 నుంచి ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌కు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులోకి రానున్నాడు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/-series-with-bangla-india-one-1st-test-25-148692.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.