జగన్.. ముస్సోలిని, తావోస్!
Publish Date:Aug 26, 2022
Advertisement
కాలం కలిసిరానపుడు ఏదో ఒక మార్గాన్ని అనుసరించి ఆధిపత్య ప్రదర్శన చేయాలనుకోవడమే రాజకీ యాల్లో నాయకులను అప్రతిష్టపాలు చేస్తోంది. ఈ పరిస్థితి తెలిసి కూడా కొందరు అదే విధంగా పాటిస్తూ మరింతగా ప్రజల దృష్టిలో పడుతున్నారు. అధికార గర్వం, అహంకారంతో వ్యవహరించినపుడు ఎదు రయ్యే సమస్యలే ఇపుడు ఏపీ సీఎం జగన్ ఎదుర్కొంటున్నారనాలి. రాష్ట్రంలో సర్వత్రా సామాన్య జనం కూడా ఆయన పట్ల విముఖతే ప్రదర్శి స్తున్నారు. ప్రజలకు ఎమ్మెల్యేలు, మంత్రుల మీద ఏమాత్రం నమ్మ కం కూడా లేకుండా పోయింది. ప్రజలను విప క్షాలను ఇబ్బందిపెట్టడమే ధ్యేయంగా వ్యవహరిస్తు న్నార న్నది ఇటీవలి ఆరోపణ. ముఖ్యంగా వైసీపీ కార్య కర్తల దాడులు, తిట్లపురాణం అన్నీ ఆ పార్టీ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు పై వైసీపీ గూండాల దాడి పిరికిపంద చర్య అని అది కేవలం జగ న్ హ్రస్వదృష్టి, అహంకారానికి నిదర్శనమని టీడీసీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నా రు. సీఎం జగన్ ఏపీ ముస్సోలినీగా మారారని ఆయన వ్యాఖ్యానించారు. తరచూ ప్రతిపక్ష నేత పర్య ట నను అడ్డుకోవటం, దాడులకు పాల్పడటం ఏపీ లో తప్ప దేశంలో మరెక్కడైనా ఉందా? అని ప్రశ్నిం చారు. ఇదిలాఉండగా, జగన్‌ను ఎవెంజర్స్ సినిమాలో విలన్‌తో పోల్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తన ను దత్తపుత్రుడు అని అరోపించే జగన్‌కు ఎవెంజర్స్‌లో విలన్ తానోస్ అని పేరు పెట్టానని పవర్ స్టార్ అన్నారు. అంతేకాదు జగన్‌ను సిబిఐ దత్తపుత్రుడు అనీ సంబోధించాల్సి వస్తుందనీ హెచ్చరించారు. ఇంకోసారి వైసీపీ అధికారంలోకి వస్తే జపాన్ లో మద్యం పోటీలు పెట్టినట్లు పెడతారని ఆరోపించారు. వైసీ పీ పార్టీని ఓడించడమే తమ తొలి అజెండా అన్నారు. ఏపీలో అధికార వైసీపీ, ఆ పార్టీ అధినేత జగన్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగారు. వైసీపీపై తనకు ఎలాంటి ద్వేషం లేదని, వైసీపీనేతలు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే మాత్రం తప్పనిసరిగా నిలదీస్తాననీ స్పష్టం చేశారు.
http://www.teluguone.com/news/content/jaganmussolini-and-thavos-25-142689.html





