తాజా మాజీల మౌనంతో జగన్ లో గాభరా.. వరుస భేటీలతో బుజ్జగింపులు!

Publish Date:May 9, 2022

Advertisement

మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ప్రకంపనలు వైసీపీలో ఇంకా తగ్గలేదు. బహిరంగంగా నిరసనలు తెలిపి చల్లబడ్డ వారు చల్లబడగా.. బైటకు ఇసుమంతైనా అసంతృప్తి కనబరచని తాజా మంత్రులు కొందరు తమ మౌనంతో పార్టీ అధినేతను కలవరపెడుతున్నారు. ముఖ్యంగా పదవులలో ఉండగా బూతుల మంత్రులుగా ప్రత్యేక గుర్తింపు పొందిన కొడాలి నాని, విపక్షాలపై ప్రత్యేక శైలిలో విమర్శలతో చెలరేగిపోయే పేర్ని నాని వంటి వారి మౌనం ముందు ముందు ఏ పరిణామాలకు దారి తీస్తుందో అన్న కలవరం వైసీపీలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. ముఖ్యంగా జగన్ లో వారి మౌనం కారణంగా అంతర్మథనం మొదలైందని పరిశీలకులు అంటున్నారు. మూడేళ్ల నాడే అంటే మంత్రివర్గ ప్రమాణ స్వీకారం రోజునే రెండున్నరేళ్ల తరువాత కేబినెట్ లో మార్పులు ఉంటాయి అని చెప్పినా ఇప్పుడీ నిరసనలేమిటని ఆయన ఫీలౌతున్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అనగానే.. సీఎం ఏ బాధ్యతలు అప్పగిస్తే వాటిని సంతోషంగా, మనస్ఫూర్తిగా చేస్తామంటూ అందరి కంటే ముందుగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన వారే ఇప్పుడు సైలంట్ అయిపోవడమేమిటని జగన్ ఫీలౌతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొడాలి నాని వంటి వారి మౌనం పార్టీలో మున్నెన్నడూ లేని స్తబ్దత కనిపిస్తున్నదని జగన్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. విపక్షంపై మరీ ముఖ్యంగా తెలుగుదేశం అధినేతపై బూతుల పంచాంగంతో విరుచుకుపడే కొడాలి నాని మౌనం.. పార్టీలో పెద్ద చర్చకు దారి తీసింది. 

సాధారణంగా జగన్ అప్పాయింట్ మెంట్ దొరకడమే కష్టం.. అలాంటిది ఆయనే స్వయంగా తాజా మాజీల మౌనంతో వారిని పిలిపించుకుని మరీ మాట్లాడుతున్నారనీ, వారికి యాక్టివ్ గా ఉంచేందుకు ప్రయత్నస్తున్నారనీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా కొడాలి బూతుల పంచాంగం వల్లనే పార్టీలో యాక్టివిటీ ఉందని జగన్ భావిస్తున్నట్లుగా కనిపిస్తున్నది. ఆయన మౌనం వహించడంతో మొత్తంగా పార్టీలోనే ఏదో ఇబ్బంది ఉందన్న భావన స్వయంగా జగన్ లోనే వ్యక్తమౌతున్నదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

 పార్టీలో మళ్లీ పూర్వపు దూకుడు, జోరు కనిపించాలంటే తాజా మాజీలు మళ్లీ పూర్వంగా విమర్శల గళం విప్పాల్సిన అవసరం ఉందని జగన్ భావిస్తున్నారు. అందుకే గతంలోలా బుజ్జగింపులకు ప్రభుత్వ సలహాదారు సజ్జలపై ఆధారపడకుండా తానే రంగంలోకి దిగారని పరిశీలకులు అంటున్నారు. 
కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు మందు వరకూ మంత్రి పదవులు  వస్తాయని కొందరు… మంత్రి పదవులు నిలబెట్టుకోవాలని కొందరు   తెలుగుదేశం పార్టీపైనా.. ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుపైనా   బూతుల పంచాంగం విప్పి మరీ విమర్శలు గుప్పించారు.  మంత్రివర్గ విస్తరణ చేసే వరకూ  అదే పరిస్థితి కొనసాగింది. తీరా విస్తరణ పూర్తయిన తరువాత.. అదీ పార్టీలోనే ‘ముందస్తు’ యోచన జరుగుతున్న సమయంలో.. తాజా మాజీల గళం మూగబోవడంతో.. వైసీపీ డీలా పడిందన్న భావన జనంలో బలంగా కనిపిస్తున్నది. ఇదే జగన్ ను గాభరా పెడుతోంది. 

తాజా మాజీలతో స్వయంగా భేటీలు జరుపుతూ, గతంలోలా మాట్లాడాలనీ, అలా మాట్లాడితే పార్టీ మళ్లీ గెలిస్తే మంత్రి పదవులు ఇస్తాననీ హామీలు గుప్పిస్తున్నారని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి.  అయితే రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితిని అంచనా వేసిన తాజా మాజీలు విపక్షంపై బూతలతో విమర్శలు చేయడానికి జంకుతున్నారనీ, ఇప్పటికే నెగటివ్ ముద్ర పడిన తాము ఇంకా అలాగే ముందుకు సాగితే భవిష్యత్ లో చిక్కులు తప్పవనీ భావిస్తున్నరని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అవంతి వంటి తాజా మాజీలు ఇప్పటికే సొంత గూటికి ( తెలుగుదేశం) చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించారన్న వార్తలు వినవస్తున్నాయి.   ఈ పరిస్థితుల్లో జగన్ మాట విని తాజా మాజీలు గతంలోలా చంద్రబాబుపై దూషణల పర్వానికి తెరతీసు అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయన్నది పరిశీలకుల భావన.

By
en-us Political News

  
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నగారా మోగడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
ఈ నేపథ్యంలో జరగనున్న ప్రత్యేక అసెంబ్లీ సమావేశం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశంపై ఎలాంటి వైఖరి తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
2026 తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఈసారి ఎవరికీ అంత సులువుగా కనిపించడం లేదు.
అమరావతిని రాజధానిగా గుర్తించాలనే అంశంపై ఇప్పటివరకు చట్టపరమైన స్పష్టత లేదనీ, ఈ లోటును భర్తీ చేసేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. విజయవాడ-అమరావతి ప్రాంతమే రాష్ట్ర రాజధానిగా ఉండాలని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించి దానిని కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు స్పీకర్ వివరించారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
భార్య పేరుతో సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. చిత్తూరు జిల్లాలో తమ పీఎల్ఆర్ కంపెనీ చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించిన బకాయిలు చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆ పిటిషన్ లో కోరారు. అయితే న్యాయమూర్తి జస్టిస్ దిపాంకర్ దత్తా నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసం ఈ విషయంలో తాము నేరుగా జోక్యం చేసుకోబోమని విస్పష్టంగా పేర్కొంది.
ఈ నెల 28 రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ సమావేశం ఎజెండా అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ తీర్మానం ఆమెదించడమే. ఇది ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా కీలక ముందడుగుగా భావించవచ్చు.
భారతంలో ద్రౌపదిని వివస్త్రను చేయడానికి కౌరవులు ప్రయత్నిస్తే.. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను మిగల్చడానికి ఆ పార్టీ ప్రయత్నించింది. అందుకే కురుక్షేత్రంలో కౌరవులు ఓడిపోయినట్టుగా.. 2024 ఎన్నికల్లో ఘోర ఓటమిని చూసింది.
కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అధికారికంగా రాజీనామా చేస్తున్నట్లు జీవన్ రెడ్డి ప్రకటించారు
1978 నుంచి అంటే గత 48 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా ఉన్న నంబర్ 24, అక్బర్ రోడ్ భవనాన్ని ఈ నెల 28 లోగా అంటే శనివారం లోగా ఖాళీ చేయాలంటూ కేంద్రం నోటీసులు జారీ చేసింది.
జ‌గ‌న్ లెవ‌న్ పై మీమ్స్ గురించి చెప్ప‌న‌క్క‌ర్లేదు. పంజాబ్ కింగ్స్ లెవ‌న్ లాగా.. జ‌గ‌న్స్ లెవ‌న్ అనే పేరు మీద మీమ్స్ వెల్లువెత్తాయి. ఇక తాజాగా కొత్త పార్లమెంట్ భవనంలో వైసీపీ ఎంపీలకు లోక్ సభ స్పీకర్ కేటాయించినది కూడా 11వ నెంబర్ రూమే.
ఇక 2026 త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌ధాన పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకే, టీవీకే ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకు ప‌లుర‌కాల ఉచితాల వ‌ల ప‌న్నాయంటే ప‌రిస్థితి ఏమిటో ఊహించుకోవ‌చ్చు.
ఇక టికెట్ ధరల పెంపు అనేది కేవలం పవన్ కల్యాణ్ కోసం తీసుకున్న నిర్ణయం కాదని, నిర్మాతల నుంచి వచ్చే అభ్యర్థనల మేరకు ప్రభుత్వం నిబంధనల ప్రకారం తీసుకునే నిర్ణయమని స్పష్టం చేశారు. ఈ పిటిషన్ వెనుక కేవలం రాజకీయ దురుద్దేశాలు తప్ప, ప్రజా ప్రయోజనం లేదన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.