జగన్ ఉత్తరాంధ్ర ఆశలు ఆవిరి!

Publish Date:Dec 30, 2023

Advertisement

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర మీద గంపెడు ఆశలు పెట్టుకున్నారు. వైసీపీ పార్టీ ఆవిర్భావం సమయం నుండే రాయలసీమ తర్వాత తనను కాపాడేది ఉత్తరాంధ్ర మాత్రమే అని భావిస్తూ.. భ్రమిస్తూ వచ్చారు. కోస్తా ఆంధ్రాలో తనకు ఎలాగు గ్రిప్ దక్కదని భావనతో జగన్.. రాయలసీమ, ఉత్తరాంధ్రలను తనకు కంచుకోటగా మలచుకోవాలని భావించారు. అందుకోసమే జగన్  తల్లి విజయమ్మను విశాఖ నుండి పోటీకి దింపగా.. అక్కడి ప్రజలు ఘోరంగా ఓడించి వెనక్కు పంపించారు. దాదాపు రెండు లక్షలకు పైగా మెజార్టీ ఓటమి వైసీపీకి అక్కడ ఛాన్స్ లేదని అప్పుడే తేటతెల్లం చేసింది. కానీ  వైసీపీ ఆశలు మాత్రం చావలేదు. ఏకంగా  రాజధానిని ఉత్తరాంధ్రకు తెస్తానని ఇన్నాళ్లు ప్రకటనతో  అక్కడి ప్రజలలో ఆశలు కల్పించారు. ముందుగా మూడు రాజధానులంటూ చెప్పినా.. చివరికి విశాఖే  రాజధాని అంటూ ప్రకటిస్తూ మురిపెం పెంచారు. కానీ, తీరా ఎన్నికలకు సమయం ఆసన్నమైనా ఇప్పటికీ విశాఖ రాజధాని ఊసేలేదు. కనీసం వైసీపీ నేతలు చెప్పిన విశాఖ నుండి పరిపాలన కూడా అమల్లోకి రాలేదు.

అసలే ప్రజలలో అసంతృప్తి.. పైగా రాజధాని మోసం.. ఇప్పుడు అభ్యర్థుల మార్పు కలిసి ఉత్తరాంధ్ర నేతలు వైసీపీకి బైబై చెప్పేస్తున్నారు. జగన్ ఎలాగైనా విశాఖతో పాటు ఉత్తరాంధ్రలో పట్టు కోసం పోరాడుతుంటే.. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న పలువురు నాయకులు మాత్రం పార్టీకి దూరమవుతున్నారు. వైసీపీ హై కమాండ్ కు ఇది మింగుడు పడడం లేదు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకకాలంలో నాయకులంతా పార్టీని వీడుతుండడం ఇప్పుడు జగన్ ను కలవరపాటుకు గురి చేస్తోంది. మొన్న జిల్లా పార్టీ అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు పార్టీని వీడగా..ఇటీవల ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ సైతంపార్టీకి గుడ్ బై చెప్పారు. ఇక ఇప్పుడు సీతంరాజు సుధాకర్ కూడా పార్టీకి రాజీనామా ప్రకటించారు. ప్రస్తుతం బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న సుధాకర్.. జగన్ కు అత్యంత సన్నిహితుడైన వారిలో ఒకరు. కానీ, పార్టీ నిర్ణయాలతో విభేదించి రాజీనామా చేసేశారు.  

పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ కోసం పనిచేస్తున్న సుధాకర్.. తొలినుండి విశాఖ దక్షిణ నియోజకవర్గ టికెట్ ను ఆశిస్తున్నారు. కానీ జగన్ ఆయనకు అవకాశం ఇవ్వలేదు. కొంతకాలం కిందట విశాఖ పట్టభద్రుల స్థానం నుంచి సుధాకర్ ను పోటీ చేయించి.. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో విభేదాలకు చెక్ చెప్పాలని జగన్ భావించారు. కానీ ఆ ఎన్నికల్లో సుధాకర్ ఓడిపోవడంతో ఆ అసంతృప్తి అలాగే ఉండిపోయింది. ఇక ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం ఆశలు పెట్టుకున్నారు. కానీ ఫిరాయింపు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ రూపంలో పోటీ ఎదురయ్యింది. మరోవైపు కోలా గురువులు సైతం ఆశావహుడిగా బయటకొచ్చారు. దీంతో సుధాకర్ కు టికెట్ లేదని హై కమాండ్ తేల్చింది. దీంతో ఆయన పార్టీకి బైబై చెప్పేశారు. అయితే విశాఖలో జరుగుతున్న వరుస పరిణామాలు   వైసీపీకి ఇబ్బందికరంగా మారాయి.

ఒక్క సుధాకర్ మాత్రమే కాదు ఉత్తరాంధ్ర నుండి డజనుకుపైగా వికెట్లు పడే ఛాన్స్ ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. పలుచోట్ల సీనియర్లకు టికెట్లు లేవని అధిష్టానం తేల్చడంతో వీరంతా ఇప్పుడు తిరుగుబాటు బావుటా ఎగరేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇంచార్జిల మార్పుపై పార్టీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త వారికి సహకరించే పరిస్థితి లేదని బహిరంగంగానే తేల్చేస్తున్నారు. దీంతో ఈసారి కూడా జగన్ విశాఖ ఆశలు ఆవిరైనట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. విజయసాయి రెడ్డి, బొత్స సత్యనారాయణ, తమ్మినేని సీతారాం లాంటి సీనియర్ నేతలున్నా ఉత్తరాంధ్రను వైసీపీకి అనుకూలంగా మలచడంలో ఫెయిలైనట్లు విశ్లేషకులు అభిప్రా యపడుతున్నారు. జగన్ అనాలోచిత నిర్ణయాలతో ఇన్నాళ్లు ఉత్తరాంధ్ర నేతలు ఇబ్బందులు పడగా.. ఇప్పుడు టికెట్ల కేటాయింపులో గందరగోళం, ఇప్పటికే ఖరారైన పార్టీ ఓటమి ఇక్కడ నేతలను పార్టీకి దూరం చేస్తున్నట్లు భావించాల్సి వస్తుంది.

By
en-us Political News

  
ఎమ్మెల్యేల పనితీరును ప్రజల నుంచే తెలుసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. మే 1 నుంచే ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవాల్సి ఉంటుందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
స్ట్రాంగ్ రూమ్ వద్ద సిసిటివి దృశ్యాలను టీవీలో చూసినప్పుడు తనకు అనుమానం కలిగిందనీ.. అందుకే స్వయంగా తనిఖీ చేయడానికి వచ్చానని మమతా బెనర్జీ తెలిపారు. అక్కడ జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలకు తెగించి అయినా సరే ప్రజా తీర్పును కాపాడుకుంటామన్న మమతా బెనర్జీ.. ఓట్ల లెక్కింపులో ఎలాంటి అవకతవకలు జరిగినా సహించేది లేదని హెచ్చరించారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీ అధికారికంగా అడుగుపెట్టింది.
మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో, ఈ నెల 23న ఒకే విడతలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికార పగ్గాలు అందుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 71. బుధవారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్తకంఠంతో యూడీఎఫ్‌కే అధికారమని అంచనా వేశాయి.
తమిళనాట అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 117 కాగా.. విజయ్ టీవీకే పార్టీ 98 నుంచి 120 సీట్లు గెలిచే అవకాశం ఉందని యాక్సిస్ మై ఇండియా సర్వే అంచనా వేసింది.
ప్రకాష్ రాజ్ తన విమర్శల్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్ స్పందనల్లో ఉన్న వైవిధ్యాన్ని వేలెత్తి చూపారు. తిరుమల లడ్డూ వివాదంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని కోరుతున్న పవన్ కల్యాణ్.. గతంలో దేశాన్ని కుదిపేసిన ఇతర కీలక సంఘటనల సమయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.
యాక్సిస్ మై ఇండియాతన అంచనాలలో తృణమూల్ కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యాన్ని కట్టబెట్టింది. ఈ సంస్థ అంచనా ప్రకారం టీఎంసీ 165 నుంచి 185 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉండగా.. బీజేపీ 95 నుంచి 110 స్థానాలకే పరిమితం కావచ్చని ఆ సర్వే ఫలితం పేర్కొంది. ఇక సీ-ఓటర్ సర్వే కూడా మమతా బెనర్జీపైనే బెంగాల్ ప్రజలు విశ్వాసం ఉంచారని పేర్కొంది.
పదవి వచ్చిందనే అహంకారం వద్దనీ, అందరినీ కలుపుకుని ముందుకుసాగాలని టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు
యువతను పార్టీ వైపు ఆకర్షించడంలోనూ, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలోనూ లోకేశ్ పోషించిన పాత్రకు గుర్తింపుగా ఆయనకు పార్టీలో జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రమోషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లోకేష్ తో పాటుగా కొత్తగా ఎంపికైన కమిటీ సభ్యులందరితో చంద్రబాబు స్వయంగా ప్రమాణం చేయించారు.
బెంగాల్ ఎన్నికలలో తొలి విడతలో రికార్డు స్థాయిలో 93 శాతానికి పైగా పోలింగ్ జరగడంతో.. తుది విడతలోనూ అదే స్థాయిలో పోలింగ్ జరిగే అవకాశాలున్నాయంటున్నారు. రెండో విడతలో దక్షిణ బెంగాల్ ప్రాంతంలో మమతా బెనర్జీకి కంచుకోట వంటి కోల్‌కతా, హౌరా, నాడియా, హూగ్లీ వంటి కీలక జిల్లాల్లో పోలింగ్ జరుగుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
ఒడిశాకు చెందిన ఒక నిరుపేద వ్యక్తి తన సోదరి మరణానంతరం ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న ఇరవై వేల రూపాయలు విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకును సంప్రదించాడు. ఆ డబ్బుతో ఆమె అంత్యక్రియల తాలూకు ఖర్చులు లేదా ఇతర అవసరాలు తీర్చుకోవాలని చెప్పాడు.
గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడుల కేసులో వైసీపీ సోషల్ మీడియా అప్పటి ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డిని పులివెందుల పోలీసులు విచారించారు. సుమారు 9 గంటల పాటు సాగిన ఈ విచారణలో పోలీసులు ఆయనపై దాదాపు 70 ప్రశ్నలను సంధించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.