వరద ప్రభావిత ప్రాంతాలలో జగన్ పర్యటన అంతా స్వోత్కర్ష.. పరనిందే!

Publish Date:Jul 27, 2022

Advertisement

సీఎం జగన్ రెండు రోజుల వరద బాధిత ప్రాంతాల లో రెండు రోజుల పర్యటన ముగిసింది. అయితే ఈ పర్యటనలో ఆయన బాధితులకు ఒక్కటంటే ఒక్క హామీ   ఇవ్వలేదు.  బాధితులకు ఊరట ఒక్కటంటే ఒక్క ప్రకటన లేదు. వరద నష్టం ఊసే లేదు. ఏదో ఒక వంతెనకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు చేసిన ప్రకటన తప్ప ఎవరికీ  పైసా ప్రకటించింది లేదు. అయితే తానేం చేయలేననీ, చేయగలిగింది ఏమీ లేదని చెప్పడానికి మాత్రం ఆయన ఒక్క నిముషం కూడా ఆలోచించలేదు. జగన్ పర్యటన సందర్భంగా ప్రభుత్వ యంత్రాంగమంతా వరద ప్రభావిత ప్రాంతాల్లోనే మోహరించింది.

కానీ వరద బాధితుల కన్నీరు తుడిచేందుకు ఒక్క చేయి ప్రయత్నించిన దాఖలాలు లేవు. వరద ప్రభావిత ప్రాంతాలలో జగన్ పర్యటన అంతా తనను తాను పొగుడుకోవడానికీ విపక్ష నేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించడానికేనా అన్నట్లుగా సాగంది.  ప్రభుత్వం ప్రకటించిన రెండు వేల రూపాయల ఆర్థిక సాయం బాధితులందరికీ అందిందని ఘనంగా ప్రకటించేశారు. పశువుల కోసం గ్రాసం  కూడా అందించామనీ, వాటికే కనుక నోరుంటే ఇంతటి విపత్తులోనూ తమను అంత శ్రద్ధగా పట్టించుకున్నందుకు అవి కూడా తనను ప్రశంసించి ఉండేవని చెప్పుకున్నారు.   ఆయన పర్యటన మొత్తం స్వోత్కర్ష పర నింద లక్ష్యంగానే సాగింది.  వరద ప్రభావిత ప్రాంతాలలో ముఖ్యమంత్రి పర్యటిస్తే ఏదో ఒక సాయం, ఎంతో కొంత పరిహారం ఇస్తామని ప్రకటిస్తారు. జగన్ ఆ పని కూడా చేయలేదు. వరద ముంపు బాధితులను పరామర్శించలేదనీ, ఆయా ప్రాంతాలలో పర్యటించలేదనీ విపక్షాల విమర్శల కారణంగానే ఏదో పర్యటించేశానని చెప్పుకోవడానికే ఆయన పర్యటన సాగింది.

పునరావాస శిబిరాల్లో ఉన్న వారికి తమ ప్రభుత్వం ఇచ్చిన రూ. రెండు వేలు..  ఉల్లిపాయలు, టమాటాలే చాలా ఎక్కువ అన్న చందంగా వరద ప్రభావిత ప్రాంతాలలో జగన్ పర్యటన సాగింది. వాస్తవానికి ఈ పర్యటనలో ముఖ్యమంత్రిని కలిసిన వారంతా ఎంపిక చేసిన వారే. మొత్తం పర్యటన అంతా చాలా పకడ్బందీ ప్లాన్ ప్రకారం సాగింది. విలేకరులను అనుమతించలేదు.  ఇక పోలవరం నిర్వాసితుల విషయంలో ఈ పర్యటనలో జగన్ మరీ దారుణంగా వ్యవహరించారు.   కేంద్రం నిధులిస్తే తప్ప పోలవరం నిర్వాసితులకు తాను చేయగలిగిన సాయం ఏమీ లేదని నిస్సిగ్గుగా ప్రకటించేశారు.  పునరావాసం బాధ్యత రాష్ట్రానిదేనని కేంద్రం విస్పష్టంగా చెబుతున్నా జగన్ కేంద్రం నిధులిస్తేనే పునరావాసం అని చెప్పారంటే.. వారికి శూన్య హస్తం చూపించినట్లు.  

మొత్తంగా వరద ప్రభావిత ప్రాంతాలలో జగన్ జరిపిన రెండు రోజుల పర్యటన బాధితుల్లో జగన్ ప్రతిష్టను మరింత దిగజార్చడానికే ఉపయోగపడింది. పరిశీలకులు కూడా జగన్ పర్యటనను చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాలలో జరిపిన పర్యటనతో పోల్చి చూస్తున్నారు. వరద ముంపు సమయంలోనే విపక్ష నేత చంద్రబాబు బాధితులను పరామర్శించడానికి వచ్చిన చంద్రబాబుకు వరద బాధితులు ఆయనకు తమ బాధలు చెప్పుకోవడానికి గోదావరి వరద మళ్లీ వచ్చిందా అన్నట్లుగా పోటెత్తారు.  బాధితులను కలుసుకోవడానికి ఆయన బురదలో నడిచారు. ట్రాక్టర్ ఎక్కి డ్రైవర్ పక్కనే కూర్చున్నారు. స్వయంగా ట్రాక్టర్ దిగి బాధితుల వద్దకు వెళ్లారు. అదే జగన్ పర్యటనలో జనం జాడ లేదు. పార్టీ నేతలు ఎంపిక చేసిన వారు వినా ఆయనను చూడడానికి వచ్చిన వారే కనిపించలేదు. ఖాళీ వీధుల్లో ఆయన నమస్కారాలు పెట్టుకుంటూ తిరిగారు. ఇవన్నీ బయటకు పొక్కకూడదన్నట్లు మీడియాను ఆయన పర్యటిస్తున్న ప్రాంతాలలోకి అనుమతించలేదు. విపక్ష నేతగా చంద్రబాబు వరద ప్రాంతాలలో పర్యటించి చేయగలిగింది బాధితుల్లో భరోసా నింపడమే. వరద   నష్టానికి సాయంఆయన ప్రకటించలేరు. అయినా జనం ఆయన ఇచ్చే భరోసాయే చాలు అన్నట్లుగా ఆయన పర్యటన ఆసాంతం ఆయన వెంటనే ఉన్నారు. అదే ముఖ్యమంత్రి జగన్ తన పర్యటనలో బాధితులకు సాయం ప్రకటించే అవకాశం ఉంది. అధికారం ఉంది. ప్రభుత్వాధినేతగా అది చేయాలి కూడా. అయినా సరే ఆయన పర్యటన పట్ల జనం ఆసక్తి చూపలేదు.  

By
en-us Political News

  
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.