జగన్ తాడేపల్లి వస్తున్నారహో.. మరో పరామర్శయాత్రకు ముహూర్తం ఫిక్స్!

Publish Date:Jun 30, 2025

Advertisement

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి సోమవారం (జూన్ 30)సాయంత్రం బయలుదేరి తాడేపల్లికి రానున్నారు. 2024 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం తరువాత జగన్ ఆంధ్రప్రదేశ్ కు, తాడేపల్లిలోని ఆయన ప్యాలెస్ కు చుట్టపు చూపుగానే వస్తున్నారు. దీంతో జగన్ తాడేపల్లి ప్యాలెస్ రాకకు పెద్దగా ప్రధాన్యత ఉండే అవకాశం లేదు. కానీ ఆయన సోమవారం (జూన్ 30) తాడేపల్లికి రానుండటం మాత్రం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

ఎందుకంటే ఇటీవల ఆయన పల్నాడులోని రెంటపాళ్ల పర్యటన సందర్బంగా జరిగిన సంఘటనే. పోలీసు ఆంక్షలను ధిక్కరించి మరీ ఇయన  వందలాది వాహనాలు, వేలాది మంది కార్యకర్తలతో ర్యాలీగా రెంటపాళ్ల పర్యటన చేశారు. ఆ సందర్భంగా ఆయన ఉన్న వాహనం కిందనే పడి వైసీపీ కార్యకర్త సంగమయ్య మరణించారు. దీనికి సంబంధించి జగన్ ఏ2గా కేసు నమోదైంది. దీంతో ఈ కేసు కొట్టివేయాలంటూ ఆయన కోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు జగన్ పిటిషన్ విచారణను జూన్ 1 కు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో జగన్ జూన్ 30 సాయంత్రానికి తాడేపల్లి ప్యాలెస్ కు రానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. జగన్ క్వాష్ పిటిషన్ పై కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్న తరుణంలో  జగన్ తాడేపల్లి ప్యాలెస్ లో సోమవారం (జూన్ 30) రాత్రి పార్టీ కీలక నేతలతో భేటీ కానుండటం ప్రాముఖ్యత సంతరించుకుంది.

 అంతే కాకుండా వచ్చే నెల 2న జగన్  నెల్లూరు జైలులో ఉన్న మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాణి గోవర్దన్ రెడ్డిని పరామర్శించుంకుదు నెల్లూరు పర్యటనకు వెళ్లనున్నారు. వైసీపీ అధినేత జగన్ పర్యటన అన్నారంటే అతి కచ్చితంగా పరామర్శ యాత్రే అయి ఉంటుంది. జగన్ తన పరామర్శయాత్రల ద్వారా రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టించడమే ధ్యేయమన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అందుకే సాధారణంగా తన పరామర్శ యాత్రలు దిగ్విజయమయ్యాయనీ, జన స్పందన బ్రహ్మాండంగా ఉందనీ సొంత మీడియా, సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. ఇక జగన్ యాత్రలలో పరామర్శ సంగతి పక్కన పెడితే.. చంద్రబాబుపై విమర్శలు, ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలే ఎక్కువగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన  తాడేపల్లి ప్యాలెస్ లో పార్టీ కీలక నేతలతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన బెంగళూరు నుంచి తాడేపల్లి వచ్చారంటే.. ఏదో ఒక పరామర్శ యాత్రకు బయలుదేరడానికేనని పార్టీ శ్రేణులే చెప్పుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఆయన సోమవారం తాడేపల్లి ప్యాలస్ కు రావడం, పార్టీ కీలక నేతలతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఒక వైపు క్వాష్ పిటిషన్ పై కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది, మరో వైపు బుధవారం (జులై2 ) నెల్లూరు పర్యటనలో అనుసరించాల్సిన వ్యూహమేంటి అన్నదానిపై చర్చించేందుకే జగన్ తాడేపల్లి చేరుకోనున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
 2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్   ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో  పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది. 
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా  కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
 పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ  అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ  దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు.    ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.
రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. ప్రశాంతంగా సాగేనా.?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.