Publish Date:Jun 30, 2025
మొన్నటి వరకూ కిషన్ రెడ్డిని కేసీఆర్ ప్రోగా ఉండే బీజేపీ అధ్యక్షుడంటూ ఒక గొడవ నడిచేది. అన్నట్టుగానే బీజేపీ తెలంగాణలో గట్టి పోటీ ఇవ్వలేక.. సెకండ్ ప్లేస్ టు థర్డ్ ప్లేస్ కి పడిపోయింది కమలం పార్టీ.
కట్ చేస్తే ఇప్పుడు రామచంద్రరావు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నిక కాబోతున్న పరిస్థితుల్లో ఆయన చంద్రబాబుకు అనుకూలుడు కాబట్టి ఆయన ఎన్నిక వెనక తెలుగుదేశం ఉందంటూ బీఆర్ఎస్ అప్పుడే మొదలు పెట్టేసింది. సోషల్ మీడియాలో ఈ తరహా పోస్టులు పెడుతూ హల్ చల్ చేస్తోంది.
ఇక్కడ బీఆర్ఎస్ గుర్తించాల్సింది ఏంటంటే చంద్రబాబుకు అనుకూలుడైన రామచంద్రరావు ఉండటం కూడా ఒకందుకు పార్టీకి మంచిదే కదా? వచ్చే రోజుల్లో ఏపీకి ఎన్డీయే కూటమి ఎలాగో సరిగ్గా అలాగే ఇక్కడ స్థానిక సంస్థలు, గ్రేటర్ ఎన్నికలు, ఆపై 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లడానికి వెసలుబాటు ఉంటుంది కదా? ఈ విషయం ఎందుకు గుర్తించడం లేదు? అన్న కామెంట్ వినిపిస్తోంది.
గత ఎన్నికల్లో ఇక్కడ జనసేన, బీజేపీ కూటమి కట్టి ఒక ఎన్నికలను ఎదుర్కున్నాయి. కానీ ఏమంత సక్సెస్ ఫుల్ ఆపరేషన్ జరగలేదు. కనీసం కూకట్ పల్లి వంటి ఆంధ్ర ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్న ఏరియాలో కూడా ఈ బాండింగ్ రిజల్ట్ ఇవ్వలేదు.
2024 ఎన్నికల్లో ఏపీలో కూటమి విజయ దుందుభి మోగించాక కూటమి కంటూ కొంత బలం కనిపిస్తోంది. దాని ఫలితాలు క్రమంగా వచ్చేలా తెలుస్తోంది. ఇప్పటి వరకూ బీజేపీ తన పూర్తి సామర్ధ్యం కనబరచలేక పోయింది. మొదట నెట్ ప్రాక్టీస్ గా స్థానిక సంస్థల నుంచి మొదలు పెడితే, అది గ్రేటర్ తర్వాత అసెంబ్లీ ఎన్నికల వరకూ బండి లాగొచ్చు. అందుకు చంద్రబాబుకు అనుకూల నేత ఉండటం వల్ల ఆ పార్టీకి ఇంకా మేలు చేస్తుందే తప్ప కీడు చేయదు కదా? అన్న ప్రశ్న ఉదయిస్తోంది. మరి బీఆర్ఎస్ చేస్తున్న ఈ ప్రచారానికి కారణమేంటి?అంటే బీఆర్ఎస్ కి అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ విలన్ చంద్రబాబే. చంద్రబాబును బూచిగా చూపించి నెగ్గుకు రావాలనే ప్రయత్నిస్తోంది. తన పార్టీ పేరులోని తెలంగాణ సెంటిమెంటును తీసేశాక కూడా ఈ ధోరణిలోంచి కారు పార్టీ బయటకు రావడం లేదన్నమాట.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bjp-telangana-chief-ramachandrarao-39-200949.html
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు. ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.
Publish Date:Oct 31, 2026
రేపే మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. ప్రశాంతంగా సాగేనా.?