జగన్ హయాంలో ఏమున్నది గర్వకారణం.. మూడేళ్ల చరిత్ర సమస్తం వేధింపులు, విధ్వంసం, బెదిరింపులు

Publish Date:Jun 20, 2022

Advertisement

ఏపీలో జగన్ పాలన అంతా   అంతా విపక్ష నేతల్ని వేధించడం, బెదిరించడం, వారి అస్తులను ధ్వంసం చేయడంగా కొనసాగిపోతోంది. జగన్   అధికారం వచ్చిందే తడవు  ప్రజావేదికను కూలగొట్టడంతో మొదలైన విధ్వంస పాలన తాజాగా మాజీ మంత్రి, తెలుగుదేశం సీనియర్ నాయకుడు, బీసీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడి ఇంటి ప్రహారీగోడను కూల్చే దాకా అప్రతిహతంగా సాగిపోతోంది. జగన్ ప్రభుత్వంపై,  వైసీపీ నేతల అవినీతి, అక్రమాలపై   ఏ విపక్ష నేత నోరెత్తి విమర్శివంచినా వారిని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువల నీరు తాగించడమే ఏకైక లక్ష్యంగా జగన్ పాలన సాగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో టీడీపీ శాసనసభాపక్షఉప నేత కింజరాపు అచ్చెన్నాయుడ్ని శ్రీకాకుళంలో అరెస్టు చేసి, అక్కడి నుంచి ఊళ్లన్నీ తిప్పి విజయవాడ తీసకువచ్చి ఇబ్బంది పెట్టిన వైనం గుర్తుండే ఉంటుంది. శస్త్ర చికిత్స చేయించుకుని విశ్రాంతిలో ఉన్న అచ్చెన్నను అంత దూరం, గంటల పాటు కారులోనే తిప్పడంతో ఆయన తీవ్ర ఇబ్బంది పడ్డారు.

ఆ తర్వాత మాజీ మంత్రి కొల్లు రవీంద్రను కూడా హత్యా నేరం, కుట్ర నెపంతో అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలులో వేసేదాకా వైసీపీ పెద్దల మనసు శాంతించలేదు. అలాగే విశాఖ లోక్ సభా స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన శ్రీభరత్ కు చెందిన గీతం యూనివర్శిటీపై వైసీపీ పెద్దల కన్నుపడింది. గీతం వర్శిటీలో ప్రభుత్వ భూమి ఉందని చెప్పి కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా వర్శిటీ ప్రధాన ద్వారం కూల్చివేయించింది. దాంతో పాటు గీతం వర్శిటీలో కొన్ని ఎకరాల భూమిని మార్కింగ్ చేసి, అందులో నిర్మాణాలేవీ చేయకూడదని ఆదేశించింది.

ఇక వైసీపీ సర్కార్ తప్పిదాలను ఎప్పటికప్పుడు వేలెత్తి చూపిస్తున్నారనే అక్కసుతో మాజీ ఎంపీ సబ్బం హరి విశాఖపట్నంలోని సీతమ్మధారలో నిర్మించుకున్న భవనంలోని వాచ్ మన్ బాత్ రూమ్ ను కూలగొట్టింది. జీవీఎంసీ పార్కుకు చెందిన ఆరు అడుగుల వెడల్పు మేర స్థలం సబ్బం హరి భవనం ఆవరణలో కలిసిపోయిందనే సాకును జగన్ సర్కార్ చూపించింది. విశాఖ సిరిపురంలో వీఎంఆర్ డీఏ స్థలాన్ని లీజుకు తీసుకుని టీడీపీ నేత హర్షవర్ధన్ నిర్వహిస్తున్న ఫ్యూజన్ ఫుడ్స్ హొటల్ ను దీపావళి రోజున బలవంతంగా ఖాళీ చేయించడమే కాకుండా హొటల్ లోని వంట పాత్రలతో సహా ఫర్నీచర్ ను లారీల్లో ఎక్కించి తాళాలు వేయించింది.

విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు ఎమ్మెల్సీ పదవి ఆశచూపి ఆహ్వానించినా వైసీపీలోకి రాలేదనే కక్షతో గాజువాకలో ఆయన నిర్మిస్తున్న వాణిజ్య సముదాయాన్ని జీవీఎంసీ సిబ్బందితో కూలగొట్టించింది. తాజాగా వైసీపీ ప్రభుత్వం, అధిష్టానం, ఆ పార్టీ నేతలు చేస్తున్న దురాగతాలపై ఒంటికాలిపై లేచి మరీ విమర్శనాస్త్రాలు సంధిస్తున్న చింతకాయల అయ్యన్నపాత్రుడి ఇంటి ప్రహారీ గోడను కూలగొట్టించడం రాజకీయంగా దుమారం లేపింది. నర్సీపట్నం మున్సిపాల్టీలోని శివపురంలో అయ్యన్న పాత్రుడు రెండు సెంట్ల భూమిని ఆక్రమించారంటూ ఆదివారం తెల్లవారు జామున కూలగొట్టారు.

వైసీపీ  ప్రభుత్వం ప్రతిపక్ష నేతల ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీసి, వారి కుటుంబాలను ఆందోళనకు గురిచేసి, మానసికంగా కుంగదీయడమే లక్ష్యంగా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతోందనే విమర్శలు సర్వత్రా విన వస్తున్నాయి. విపక్ష నేతలను వేధించేందుకు రెవెన్యూ, మున్సిపల్, పోలీసు శాఖలను పావులుగా వాడుకుంటోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్కడ ఎవరి నిర్మాణాలను కూల్చివేయాలనే కుట్రను శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారు జాము లోపే అమలు చేస్తుండడం గమనార్హం.

By
en-us Political News

  
చంద్రబాబు వంటి దార్శనికుడు ముఖ్యమంత్రిగా ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెడీ కుమారస్వామి అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో భారీ ఉక్కుకర్మాగారం శంకుస్థాపన ఈ కార్యక్రమంలో పాల్గొన్న హెచ్ డీ కుమారస్వామి అంతకు ముందు విశాఖలో మీడియాతో మాట్లాడారు.
రేంద్రమోడీ గుజరాత్ సీఎంగా 2001 అక్టోబర్ 7న పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఆయన గుజరాత్ సీఎంగా ఆ రాష్ట్రాన్ని పాలించారు. దీంతో సోమవారం (మార్చి 23) నాటికి ఆయన పాలనా పగ్గాలు చేపట్టి 8932 రోజులైంది. అంటే అత్యధిక రోజుల పాటు రోజుల పాటు ప్రభుత్వాధినేతగా బాధ్యతలు నిర్వహించి, దేశంలోనే సుదీర్ఘకాలం పనిచేసిన నేతగా మోడీ కొత్త రికార్డు సృష్టించారు.
దేశ చరిత్రలో ప్రధానిగా ఎన్నికైన ఏకైక మహిళ ఇందిరాగాంధీ. దాదాపు 16 ఏళ్ల సుదీర్ఘకాలం భారతదేశ ప్రధానిగా కొనసాగిన ఏకైక వనిత ఇందిరాగాంధీ. ఉక్కుమహిళగా పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీ తన హయాంలో తీసుకుని అమలు చేసిన నిర్ణయాలు ఓ సంచలనం.
వచ్చే ఎన్నికల్లో నాగబాబు శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కూడా పొలిటికల్ సర్కిల్స్ లో పుకార్లు షికారు చేస్తున్నాయి.
బుజ్జగింపు ప్రయత్నాలు ఫలించలేదు. ఇంత వరకూ వచ్చిన తరువాత పార్టీలో కొనసాగితే.. తన గౌరవానికి భంగం అని జీవన్ రెడ్డి తనను బుజ్జగించడానికి వచ్చిన నేతలతో అన్నట్లు సమాచారం. వాస్తవానికి గత కొంతకాలంగా పార్టీ అంతర్గత పరిణామాలపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నజీవన్ రెడ్డి.. బీఆర్ఎస్ గూటికి చేరనున్నారని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
రిజర్వుడు నియోజకవర్గాల నుంచి పార్టీ టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు 15వేల రూపాయలు, జనరల్ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న వారు పాతిక వేల రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్. ఇలా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి నిర్దిష్ట తేదీ, నిర్దిష్ట సమయం కేటాయించి ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
తెలుగువన్ వాస్తవ వేదిక తాజా సంచికలో వివేక హత్య కేసుపై విస్తృత చర్చ జరిగింది
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కలిసి ఇటీవల ఒకే ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.
చంద్రబాబు కూడా పలు సందర్భాలలో కొందరు మంత్రుల పనితీరు బాగా లేదనీ, వారు తమ తీరు మార్చుకోవాలని పలుమార్లు సూచించిన విషయం తెలసిందే. అయితే ఏ సందర్భంలోనూ కూడా ఆయన పని తీరు బాగా లేని మంత్రుల పేర్లు వెల్లడించలేదు. ఇక బాబు తనదైన శైలిలో ఎప్పటికప్పుడు మంత్రుల పని తీరును సమీక్షిస్తున్న సంగతి తెలిసిందే.
తనకు కాంగ్రెస్ తో ఉన్న అనుబంధానికి తెగతెంపులు చేసుకోవడం ఖాయమైపోయినట్లేనని పరిశీలకులు అంటున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరినప్పటి నుండి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే.
పుట్టా మహూష్ ఇచ్చిన వివరణ ఆధారంగా ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులోతెలుగుదేశం పార్టీ నాయకుడు, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి సహా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి విదితమే ఈ వ్యవహారంపై చంద్రబాబు సీరియస్ గా స్పందించి.. పుట్టా మహేష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పార్టీ హైకమాండ్ ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసి ఐదు రోజుల్లోగా వివరణ ఇవ్వాని ఆదేశించింది.
ఆమె పోరాటం ప్రధానంగా తన తండ్రి కేసీఆర్, ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలపైనేనని విస్పష్ట సంకేతాలిచ్చేశాయి. డాడీ అంటే తన తండ్రి కేసీఆర్ అని, చిన్న మోదీ అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని పరోక్షంగా అయినా స్పష్టంగా చెప్పారు.
ఒకప్పుడు అంటే జగన్ అధికారంలో ఉన్న సమయంలో వైసీపీలో కీలక నేతగా, ఆ పార్టీ అధినేత జగన్ కు సన్నిహితుడిగా, ఆయన కుటుంబ బంధువుగా బాలినేని శ్రీనివాసరెడ్డి చక్రం తిప్పారు. అయితే గత ఎన్నికలకు ముందు నుంచే వైసీపీలో బాలినేని పరిస్థితి పొమ్మనలేక పొగపెట్టిన చందంగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.