డాడీ..మోడీ..చిన్నమోడీ..ఏకకాలంలో ముగ్గురిపై కవిత విమర్శల దాడి

Publish Date:Mar 20, 2026

Advertisement

తెలంగాణ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు తనయ జనజాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ఏర్పాటుకు వేగంగా సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె తన తండ్రి కేసీఆర్ టార్గెట్ గా తాజాగా సంధించిన వమర్శనాస్త్రాలు రాజకీయాలలో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.  తన తండ్రి కేసీఆర్ ను, ప్రధాని మోడీనీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినీ ఒకే సమయంలో విమర్శలతో చెరిగేయడం   తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

 డాడీ, మోడీ, చిన్న మోడీ అంటూ ఆమె ప్రయోగించిన పదాలు ఆమె పోరాటం ప్రధానంగా తన తండ్రి కేసీఆర్, ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలపైనేనని విస్పష్ట సంకేతాలిచ్చేశాయి.  డాడీ' అంటే తన తండ్రి కేసీఆర్ అని, 'చిన్న మోదీ' అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని పరోక్షంగా  అయినా స్పష్టంగా చెప్పారు.  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విధానాలను   ఆమె తూర్పారబట్టారు. అలాగే తన తండ్రి కేసీఆర్ సీఎంగా ఉండగా రాష్ట్ర ప్రగతి కుంటుపడిందంటూ విమర్శలు గుప్పించారు. ఇక రాష్ట్రంలో అధికారంలో ఉన్న రేవంత్ సర్కార్ నూ ఆమె వదల లేదు.  

కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తరువాత కొద్ది కాలం పాటు తన తండ్రి కేసీఆర్ ను మాత్రం మినహాయించి బీఆర్ఎస్ నేతలపై నిప్పులు చెరిగారు. మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్, తన అన్న పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ లు లక్ష్యంగా ఆమె విరుచుకుపడ్డారు. అంతే కాకుండా బీఆర్ఎస్ లోని ద్వితీయ శ్రేణి నాయకులను సైతం వదలకుండా విమర్శల వర్షం కురిపించారు. అయితే ఇక సొంత పార్టీ పెట్టడానికి ముందు ఆమె ఏకంగా బీఆర్ఎస్ కుంభ స్థలాన్నే గురిపెట్టారన్నట్లుగా కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నారు. ఆయన మానసపుత్రిక అయిన కాళేశ్వరాన్ని దండగమారి ప్రాజెక్టు గా అభివర్ణించారు. కాళేశ్వరం అవినీతిపై విచారణకు కేసీఆర్ కు నోటీసులు ఇచ్చినప్పుడు ధర్నా చౌక్ వద్ద ఆందోళనకు దిగిన కవిత ఇప్పుడు అదే కాళేశ్వరం ప్రాజెక్టును ఇసుమంతైనా ఉపయోగం లేని ప్రాజెక్టు అని దుయ్యబట్డడమే కాకుండా.. ప్రజాధనం దుర్విని యోగమయ్యిందంటూ విమర్శలు చేశారు.

కాళేశ్వరంలో అవినీతికి హరీష్ రావును బాధ్యుడిని చేయాలంటూ డిమాండ్ చేయడం ద్వారా ఆ ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న విషయాన్ని కుండబద్దలు కొట్టారు. దీంతో రానున్న రోజులలో బీఆర్ఎస్ పార్టీపై కవిత విమర్శలు ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేయడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు. కవిత విమర్శలు, ఆరోపణలపై బీఆర్ఎస్ అగ్రనాయకత్వం స్పందించకపోవడంతో మౌనం అర్ధాంగీకరం అన్న చందంగా కవిత ఆరోపణలల్లో వాస్తవం ఉందా అన్న చర్చ బీఆర్ఎస్ శ్రేణులలోనే మొదలైంది. 

By
en-us Political News

  
ఒకప్పుడు అంటే జగన్ అధికారంలో ఉన్న సమయంలో వైసీపీలో కీలక నేతగా, ఆ పార్టీ అధినేత జగన్ కు సన్నిహితుడిగా, ఆయన కుటుంబ బంధువుగా బాలినేని శ్రీనివాసరెడ్డి చక్రం తిప్పారు. అయితే గత ఎన్నికలకు ముందు నుంచే వైసీపీలో బాలినేని పరిస్థితి పొమ్మనలేక పొగపెట్టిన చందంగా మారింది.
తెలంగాణ చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ లో 13 వేల 679 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇక పోతే మల్లు భట్టి విక్రమార్క మొత్తం 3 లక్షల24 వేల234 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు.
టి.సి. రాజన్ 1967లో స్వతంత్ర పార్టీ తరపున పలమనేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రాజకీయాల్లో ఆయన తన సుదీర్ఘ సేవలతో ప్రత్యేక గుర్తింపు పొందారు.
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యేయెన్నం శ్రీనివాస్ రెడ్డి శాసనసభ విప్‌లుగా నియమితులయ్యారు. అలాగే శాసనమండలిలో అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్‌లను విప్‌లుగా నియమించింది.
మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పేరును ఖరారు చేశారు.
ప్రముఖ హీరోయిన్లను వివాదాల్లోకి లాగుతూ, వివాదాల్లోకి లాగుతూ వ్యక్తిగత విమర్శల దిగజారుతున్న తీరు తమిళనాట రాజకీయ ప్రతిష్ఠను దిగజారుస్తున్నది. సీనియర్ హీరోయిన్లు త్రిష, నయనతార లను ఉద్దేశించి తమిళ రాజకీయ నాయకులు కొందరు చేసిన వ్యాఖ్యల పట్ల తమిళనాటే కాకుండా దేశ వ్యప్తంగా నిరసన వ్యక్తం అవుతున్నది.
రాష్ట్రంలో డ్రగ్స్ సంస్కృతిని నిర్మూలిస్తామని ప్రజలకు హామీ ఇచ్చామని, అలాంటిది పార్టీకి చెందిన ప్రజాప్రతినిధే ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం క్షమించరాని నేరమన్నారు. యువ నాయకుడు, మంచి నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చాడన్న ఉద్దేశంతో అవకాశం ఇస్తే, పార్టీకి చెడ్డపేరు తీసుకువచ్చారంటూ పుట్టా మహేష్ యాదవ్ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
ఇప్పటికే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఓ వైపు డీఎంకే కాంగ్రెస్ కూటమి, మరో వైపు అన్నాడీఎంకే, బీజేపీ కూటములు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తమదంటే తమదని ఉధృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఇప్పుడు ఆ రెండు కూటములతో పాటు టీవీకే అధినేత విజయ్ సీఎం సీటుపై కన్నేశారు.ఇప్పటికే విజయ్ తమిళనాడు వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలతో ఎలక్షన్ క్యాంపెయిన్ హోరెత్తిస్తున్నారు. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో విజయ్‌ నుంచి విడాకులు కోరుతూ ఆయన భార్య కోర్టు గడపతొక్కడంతో ఈ విషయం ఇటు తమిళనాడులోనే కాకుండా దక్షిణాది రాజకీయాల్లో సైతతం హాట్ టాపిక్‌గా నిలిచింది.
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం మొయినాబాద్ లోని పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్ లో ఆయన సమక్షంలో జరిగిన డగ్ర్స్ పార్టీ వ్యవహారంలో ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఈ ఘటనపై స్పష్టత కోరుతూ వారం రోజులలో వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసు జారీ అయ్యింది.
ముఖ్యంగా ఢిల్లీ హైకోర్టులో ప్రస్తుతం తన కేసును విచారిస్తున్న జస్టిస్ స్వర్ణకాంత శర్మ బెంచ్ నుండి విచారణను వేరే బెంచ్‌కు బదిలీ చేయాలని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రస్తుత ధర్మాసనం వద్ద విచారణ జరుగుతుందన్న నమ్మకం లేదని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ రాజాసింగ్ పై సెటైర్లు వేశారు. రాజాసింగ్, కేటీఆర్ మధ్య రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత స్థాయిలో ఇలాంటి స్నేహపూర్వక సంభాషణలు సాగడం మంచి వాతావరణానికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
తాజా ఇంటర్వ్యూలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిత్వానికి, పార్టీ ఇమేజ్‌కు నష్టం కలిగించేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వందేమాతరం అంశం చర్చనీయాంశంగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.